Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions, Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.
Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana State GK MCQs Questions And Answers in Telugu
Q1. కింది వాటిని జతపరుచుము.
జాబితా – I జాబితా – II
- బిజెపి 1. “తెలంగాణ తెచ్చేది మేమే – ఇచ్చేది మేమే”
- కాంగ్రెస్ పార్టీ 2. “ఒక ఓటు – రెండు రాష్ట్రాలు”
- రాజశేఖర్రెడ్డి 3. “విజయమో విరస్వర్గామో”
- O. U విద్యార్ధులు 4. “తెలంగాణ విడిపోతే హైదరాబాద్లో మనం విదేశియులమవుతాం అక్కడికి వెళ్ళాంటే మనకు పాస్పోర్ట్ కావాలి”
(a) A – 2, B – 1, C – 4, D – 3
(b) A – 4, B – 3, C – 1, D – 2
(c) A – 3, B – 4, C – 1, D – 2
(d) A – 4, B – 3, C – 2, D – 1
Q2. హైదరాబాద్ ఫ్రీజోన్ విషయంపై తాడో, పేడో తేల్చుకోవటానికి ఉద్యోగ, ప్రజాసంఘాలు ఉద్యమానికి సిద్ధమయ్యాయి. తెలంగాణ ఉద్యమాన్ని ఐక్యంగా నిర్మించడానికి ఉద్యోగ సంఘాలన్ని కలిసి ఏర్పాటు చేసిన కమిటి ఏది?
- చలో అసెంబ్లీ
- జాయింట్ యాక్షన్ కమిటీ
- విద్యార్ధి జాయింట్ యాక్షన్ కమిటీ
- తెలంగాణా ఉద్యోగుల సంఘం
Q3. కింది వాటిని జతపరుచుము.
జాబితా – I జాబితా – II
- నందిని సిద్ధారెడ్డి 1. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణం
- మిట్టపల్లి సురేందర్ 2. పల్లే కన్నీరు పెడుతుందో
- గోరటి వెంకన్న 3. రాతి బొమ్మల్లోనా
- అభినయ శ్రీనివాస్ 4. నాగేటి సాల్లళ్ళ నా తెలంగాణ
(a) A – 2, B – 1, C – 4, D – 3
(b) A – 4, B – 3, C – 1, D – 2
(c) A – 3, B – 4, C – 1, D – 2
(d) A – 4, B – 3, C – 2, D – 1
Q4. ‘తెలంగాణ జాగృతి‘ కు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా ‘తెలంగాణ జాగృతి‘ ఆవిర్భవించింది.
- తెలంగాణ ప్రాచీన గ్రంథాల సేకరణ, శాసనాలను తెలుగులోకి అనువదించి భద్రపరచ్చడం.
- పురాతన రాతప్రతుల్ని సేకరించి భావి తరాలకు అమూల్య సంపదను అందించడం.
- బతుకమ్మ పండుగకు విశేష ప్రాచుర్యాన్ని కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది తెలంగాణ జాగృతి.
- 1 మరియు 2 మాత్రమే
- 2 మాత్రమే
- 3 మరియు 4 మాత్రమే
- పైవన్నీ
Q5. అగ్నికి ఆహు అవుతూ కూడా జై తెలంగాణ, జైజై తెలంగాణ అంటూ మరో జన్మ అంటూ ఉంటే మరోసారి తెలంగాణ కోసం ప్రాణాలర్పిస్తాను అంటూ నినాదాలు చేసింది ఎవరు?
- శ్రీకాంతచారి
- జాక్
- జార్జి రెడ్డి
- బండారు శ్రీనివాస్
Q6. ఓయులోని విద్యార్థి సంఘాలు, సంఘాలకు అతీతమైన విద్యార్థులు తమ సిద్ధాంతాలు, జెండా, ఎజెండాలు పక్కన పెట్టి రాజకీయాలకతీతంగా తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించడానికి ఏర్పాటు చేసిన కమిటి ఏది?
- చలో అసెంబ్లీ
- జాయింట్ యాక్షన్ కమిటీ
- విద్యార్ధి జాయింట్ యాక్షన్ కమిటీ
- తెలంగాణా ఉద్యోగుల సంఘం
Q7. ఈ క్రింది ప్రజా ఉద్యమాలను కాలక్రమానుసారంగా అమర్చండి.
- సంసద్ యాత్ర
- మిలియన్ మార్చ్
- సాగర హారం
- సకల జనుల సమ్మె
(a) 1, 2, 3, 4
(b) 2, 4, 3, 1
(c) 4, 3, 2, 1
(d) 3, 1, 2, 4
Q8. మలిదశ తెలంగాణా ఉద్యమంలో రాస్తా-రోకో కార్యక్రమానికి సంబంధించి కింది ప్రకటనలు పరిశీలించండి.
- తెలంగాణ రాజకీయ జెఏసి 2011, మార్చి 11, న “పల్లె పల్లె పట్టాలపై”కి అనే కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
- సడక్ష్ బంద్ అనే కార్యక్రమానికి జెఏసి 2013, మార్చి 21, న పిలుపునిచ్చింది.
- 2011, జనవరి 17న “రహదారుల దిగ్బంధం” అనే కార్యక్రమాన్ని తెలంగాణ జెఏసి పిలుపు మేరకు చేపట్టారు.
- 1 మరియు 2 మాత్రమే
- 2 మరియు 3 మాత్రమే
- 3 మరియు 1 మాత్రమే
- పైవన్నీ
Q9. గన్ పార్క్ లో వున్న అమరవీరుల స్థూపం నిర్మాణంలో చాలా విశిష్టతలున్నాయి. అవి ఏవి?
- అడుగుభాగం నల్లరాయితో తయారుచేశారు. నాలుగు వైపులా తొమ్మిది చొప్పున చిన్న చిన్న రధ్రాలు ఉన్నాయి. అవి అమరవీరుల శరీరాల్లోకి దూసుకుపోయిన బుల్లెటుర్తులు.
- స్థూపాన్ని ఎరుపు రంగురాయితో నిర్మించారు. ఎరుపు త్యాగానికి, సాహసానికి చిహ్నం. అక్కడ ఒక మకరతోరణం చెక్కారు. దానిని సాంచిస్థూపం నుంచి స్వీకరించారు.
- శిలాఫలాకానికి నాలుగువైపులా పుష్పాలను చెక్కారు. అవి అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారనేందుకు సంకేతం.
- స్థూపం మధ్య భాగంలో ఒక స్తంభం ఉంటుంది. ఏవైపు నుంచి చూసిన దానిపై తొమ్మిది గీతలు కనిపిస్తాయి. అవి తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు సంకేతం (1975లో).
- పై భాగంలో అశోకుని ధర్మచక్రం ఉంటుంది. ధర్మం, శాంతి, సహనాలకు అదిగుర్తు. పై ఆదర్శాలకోసం అమరులు తమ ప్రాణాలను అర్పించారనేందుకు నిదర్శనం. శీర్షభాగంలో తెలుపు రంగులో తొమ్మిది రేకులు ఉన్న పుష్పం ఉంది.
- 1,2 మరియు 4 మాత్రమే
- 2,4 మరియు 5 మాత్రమే
- 1, 3 మరియు 5 మాత్రమే
- పైవన్నీ
Q10. తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ విమోచన ఉద్యమంలో ఎందరో కవుల తమ కవితలు, పాటలు ద్వారా తమదైన శైలిలో ఉద్యమానికి బాసటగా నిలిచారు. అలాంటి కవులలో ఈ కింది వాటిని సరిగ్గా జత కానివి ఏవి?
- బండి యాదగిరి – “బండి వెనుక బండికట్టి నైజం సర్కారోడా”.
- సుద్దాల హన్మంతు – “పల్లెటూరి పిల్లగాడో”.
- దాశరథి కృష్ణమాచార్యులు – “నా తెలంగాణ కోటి రతనాల వీణ”
- 1 మాత్రమే
- 2 మరియు 3 మాత్రమే
- 3 మాత్రమే
- పైనవన్నీ సరైనవే
Solutions:
S1. Ans (a)
Sol:
- కాంగ్రెస్ పార్టీ – “తెలంగాణ తెచ్చేది మేమే – ఇచ్చేది మేమే” అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్ళింది.
- బిజెపి – చిన్న రాష్ట్రల ఏర్పాటును సమర్థిస్తామని పేర్కొనడమేగాక “ఒక ఓటు – రెండు రాష్ట్రాలు” నినాదంతో ప్రజల ముందుకు వెళ్ళింది.
- రాజశేఖర్రెడ్డి – “తెలంగాణ విడిపోతే హైదరాబాద్లో మనం విదేశియులమవుతాం అక్కడికి వెళ్ళాంటే మనకు పాస్పోర్ట్ కావాలి ” అని అన్నారు.
- O. U విద్యార్ధులు – “విజయమో విరస్వర్గామో” అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమబాట పట్టారు.
S2. Ans (b)
Sol: హైదరాబాద్ ఫ్రీజోన్ విషయంపై తాడో, పేడో తేల్చుకోవటానికి ఉద్యోగ, ప్రజాసంఘాలు ఉద్యమానికి సిద్ధమయ్యాయి. తెలంగాణ ఉద్యమాన్ని ఐక్యంగా నిర్మించడానికి ఉద్యోగ సంఘాలన్ని జాయింట్ యాక్షన్ కమిటీ (జె.ఎ.సి)గా ఏర్పడ్డాయి. ఉద్యోగ సంఘాలకు బాసటగా తెరాస నిలిచింది. హైదరాబాద్ ను ఫ్రీజోన్ గా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు 2009 అక్టోబర్ 21న సిద్దిపేట ఉద్యోగ గర్జనకు పిలుపునిచ్చాయి. తెలంగాణ నలువైపుల నుంచి ఉద్యోగులు లక్షల సంఖ్యలో ఉద్యోగ గర్జనకు హాజరై విజయవంతం చేశారు.
S3. Ans (d)
Sol:
- నాగేటి సాల్లళ్ళ నా తెలంగాణ – నందిని సిద్ధారెడ్డి
- పల్లే కన్నీరు పెడుతుందో, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, – గోరటి వెంకన్న
- రాతి బొమ్మల్లోనా – మిట్టపల్లి సురేందర్
- ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణం – అభినయ శ్రీనివాస్
S4. Ans (d)
Sol:‘తెలంగాణ జాగృతి‘ :
- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా ‘తెలంగాణ జాగృతి‘ ఆవిర్భవించింది.
- తెలంగాణ ప్రాచీన గ్రంథాల సేకరణ, శాసనాలను తెలుగులోకి అనువదించి భద్రపరచ్చడం.
- పురాతన రాతప్రతుల్ని సేకరించి భావి తరాలకు అమూల్య సంపదను అందించడం.
- బతుకమ్మ పండుగకు విశేష ప్రాచుర్యాన్ని కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది తెలంగాణ జాగృతి
S5. Ans (a)
Sol: తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమకారులపై ప్రభుత్వం అనుసరిస్తున్న దహనకాండకు నిరసన హైదరాబాద్ లోని ఎల్.బి.నగర్ చౌరస్తాలో అంబేద్కర్, జగజీవన్ రామ్ విగ్రహాల సాక్షిగా నల్గొండ జిల్లాకు చెందిన కాసోజు శ్రీకాంత చారీ తన శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. శ్రీకాంతచారి అగ్నికి ఆహు అవుతూ కూడా జై తెలంగాణ, జైజై తెలంగాణ అంటూ మరో జన్మ అంటూ ఉంటే మరోసారి తెలంగాణ కోసం ప్రాణాలర్పిస్తాను అంటూ నినాదాలు ఇచ్చాడు.
S6. Ans (c)
Sol: ఓయులోని విద్యార్థి సంఘాలు, సంఘాలకు అతీతమైన విద్యార్థులు తమ సిద్ధాంతాలు, జెండా, ఎజెండాలు పక్కన పెట్టి విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటి (ఓయుజాక్)గా 2009 నవంబర్ 30న ఆర్ట్స్ కాలేజి వేదికగా ఆవిర్భవించింది. నాటి నుంచి ఆర్ట్స్ కాలేజీ ఉద్యమ కేంద్రంగా మారింది. ఇకపై రాజకీయాలకతీతంగా తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగిస్తామని విద్యార్థి జాయింట్ యాక్షన్ (జెఏసి) కమిటి ప్రకటించింది.
S7. Ans (b)
Sol: ప్రజా ఉద్యమాలను కాలక్రమానుసారంగా:
- మిలియన్ మార్చ్ – మార్చి 10, 2011
- సకల జనుల సమ్మె – సెప్టెంబర్ 13, 2011
- సాగర హారం – సెప్టెంబర్ 30, 2012
- సంసద్ యాత్ర – ఏప్రిల్ 29, 30 2013
S8. Ans (d)
Sol: మలిదశ తెలంగాణా ఉద్యమంలో రాస్తారోకో కార్యక్రమాన్ని రాస్తా-రోకో, రైల్-రోకో, సడక్ బంద్ ల పేర్లతో పిలుస్తూ నిర్వహించారు.
- తెలంగాణ రాజకీయ జెఏసి 2011, మార్చి 11, న “పల్లె పల్లె పట్టాలపై”కి అనే కార్యక్రమానికి పిలుపునిచ్చింది. తెలంగాణ ప్రాంతం గుండా వెళుతున్న రైళ్ళ రాకపోకలను స్థంభింపచేయటం ద్వారా తెలంగాణ ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడమే లక్ష్యంగా ఈ ఉద్యమం జరిగింది.
- సడక్ష్ బంద్ అనే కార్యక్రమానికి జెఏసి 2013, మార్చి 21, న పిలుపునిచ్చింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ సడక్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శంషాబాద్ నుంచి మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దు, ఆలంపూర్ వరకు 200 కిలోమీటర్ల మేర సడక బంద్ను నిర్వహించారు.
- 2011, జనవరి 17న “రహదారుల దిగ్బంధం” అనే కార్యక్రమాన్ని తెలంగాణ జెఏసి పిలుపు మేరకు చేపట్టారు. పార్లమెంట్లో వెంటనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలంటూ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయడం జరిగింది.
S9. Ans (d)
Sol: గన్ పార్క్ లో వున్న అమరవీరుల స్థూపం నిర్మాణంలో చాలా విశిష్టతలున్నాయి
- అడుగుభాగం నల్లరాయితో తయారుచేశారు. నాలుగు వైపులా తొమ్మిది చొప్పున చిన్న చిన్న రధ్రాలు ఉన్నాయి. అవి అమరవీరుల శరీరాల్లోకి దూసుకుపోయిన బుల్లెటుర్తులు.
- స్థూపాన్ని ఎరుపు రంగురాయితో నిర్మించారు. ఎరుపు త్యాగానికి, సాహసానికి చిహ్నం. అక్కడ ఒక మకరతోరణం చెక్కారు. దానిని సాంచిస్థూపం నుంచి స్వీకరించారు.
- శిలాఫలాకానికి నాలుగువైపులా పుష్పాలను చెక్కారు. అవి అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారనేందుకు సంకేతం. స్థూపం మధ్య భాగంలో ఒక స్తంభం ఉంటుంది.
- ఏవైపు నుంచి చూసిన దానిపై తొమ్మిది గీతలు కనిపిస్తాయి. అవి తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు సంకేతం (1975లో).
- పై భాగంలో అశోకుని ధర్మచక్రం ఉంటుంది. ధర్మం, శాంతి, సహనాలకు అదిగుర్తు. పై ఆదర్శాలకోసం అమరులు తమ ప్రాణాలను అర్పించారనేందుకు నిదర్శనం.
- శీర్షభాగంలో తెలుపు రంగులో తొమ్మిది రేకులు ఉన్న పుష్పం ఉంది.
S10. Ans (b)
Sol: తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ విమోచన ఉద్యమంలో ఎందరో కవుల తమ కవితలు, పాటలు ద్వారా తమదైన శైలిలో ఉద్యమానికి బాసటగా నిలిచారు.
- తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ విమోచన ఉద్యమంలో సుద్దాల హన్మంతు వ్రాసిన “పల్లెటూరి పిల్లగాడో”.
- బండి యాదగిరి రాసిన “బండి వెనుక బండికట్టి నైజం సర్కారోడా” వంటి పాటలు
- దాశరథి కృష్ణమాచార్యులు “ఓనిజాము పిశాచమా”, “నా తెలంగాణ కోటి రతనాల వీణ” వంటి కవితలు, తిరునగరి, రామాంజనేయుల స్మృతిగీతాలు, కాళోజీ గీతాలు తెలంగాణ ప్రజలపై ప్రభావాన్ని చూపించాయి.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |