Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana State GK MCQs Questions And...

Telangana State GK MCQs Questions And Answers in Telugu, 14 July 2022, For TSPSC Groups and Telangana SI and Constable

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telangana State GK MCQs Questions And Answers in Telugu, 12 July 2022, For TSPSC Groups and Telangana SI and Constable_40.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu

Q1. సర్వోదయ కి సంబంధించి కింది వాటిలో ఏది సరైంది?

  1. సర్వోదయ అంటే సాంఘిక పునర్నిర్మాణం లేదా అందరి సంక్షేమం అని అర్థం. 
  2. గాంధీజీ నిర్మాణాత్మక విధానాల్లో సర్వోదయ ఒకటి. మహాత్మాగాంధీ స్వరాజ్య, సర్వోదయ అనే లక్ష్యాల కోసం నిరంతరం కృషిచేసాడు. 
  3. సర్వోదయ సిద్ధాంతం ఆధారంగా భూదానం, గ్రామదానం, సంపత్తి దానం, జీవనదానం, శ్రమదానం అనేవి ఉద్భవించాయి.

(a) 1 మరియు 3

(b) 2 మరియు 3 మాత్రమే

(c) 3 మాత్రమే

(d) 1, 2, 3

 

Q2. దిగువ వాటిని జతచేయండి

        జాబితా I                                జాబితా II 

  1. పుల్లరి సుంకం 1. వర్తక సరుకుల మీద, ఎగుమతి, దిగుమతులపై, తయారైన వస్తువు మీద వేసే పన్ను
  2. దరిశనం 2. రాజదర్శనం కోసం వేసే పన్ను 
  3. గణాచారి పన్ను 3. పశువుల మేతపై వేసే పన్ను
  4. సుంకం 4. వేశ్యలపై మరియు బిచ్చగాళ్లపై వేసే పన్ను

Code:

      a    b     c     d

  1.  1    2     3     4
  2.  4    3     2     1
  3.  1    4     2     3
  4.  3    2     4     1

 

Q3. ముసునూరి నాయకులు ఏ ప్రాంతం రాజధానిగా పాలన ప్రారంభించారు?

  1. రేఖపల్లి
  2. ఓరుగల్లు
  3. వల్లూరు
  4. రాజమహేంద్రవరం

 

Q4. ‘లక్ష మంది ముస్లిమేతరులను సంహరించే దాకా కత్తి దించను’ అని ప్రతిజ్ఞ చేసింది?

  1. రెండో మహ్మద్‌షా
  2. అహ్మద్‌షా
  3. ఒకటో మహ్మద్‌షా
  4. హుమాయూన్

 

Q5. కింది వాటిని జతపరుచుము. 

జాబితా – I(పంట) జాబితా – I (ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం)

  1. పత్తి 1. రష్యా
  2. చెరకు 2. ఇండియా
  3. పొద్దు తిరుగుడు 3. బ్రెజిల్
  4. ఆముదం 4.  చైనా

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

 

Q6. చందా రైల్వే స్కీమ్ ఆందోళన లో ప్రముఖ పాత్ర వహించినది ఎవరు?

(a) అఘోరనాథ్ ఛటోపాధ్యాయ

(b) ముల్లా అబ్దుల్ ఖయ్యుం

(c) a మరియు b రెండూ

(d) పైనవేవి కావు

 

Q7. తెలంగాణా ఆధునికరణలో బాగంగా సాలర్జుంగ్ అనేక  సంస్కరణలు తెచ్చాడు. అందులో పోలీస్ సంస్కరణలకు సంబంధించి కింది ప్రకటనలో ఏది సరైంది?

  1. ప్రభుత్వ కోశం వద్ద రక్షణ విధులను నిర్వహించే పోలీసులను సోవర్స్ అంటారు.
  2. 1867లో రెవెన్యూ బోర్డ్ రద్దైన తరువాత రెవెన్యూ నుండి పోలీస్ వ్యవస్థను వేరు చేసి సదర్ ఉల్ మైహతమీన్ కొత్వాల్ అనే అధికారిని నియమించాడు.
  3. 1870లో పోలీస్ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. నిజామత్ అనే పోలీస్ దళాన్ని ఏర్పాటు చేశాడు.

(a) 1 మరియు 3

(b) 2 మరియు 3 మాత్రమే

(c) 3 మాత్రమే

(d) 1, 2, 3

 

Q8. ఒక జిల్లా పరిధిలోని వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, తదితర రంగాల్లోని ఉత్పాదకతను పరిగణనలోకి తీసుకుని ఏమని నిర్ధరిస్తారు?

  1. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి
  2. జిల్లా స్థూల ఉత్పత్తి
  3. జిల్లా స్థూల ఆదాయం
  4. జిల్లా తలసరి ఆదాయం

 

Q9. మహబూబ్ నగర్ లోని అలంపూర్  కి సంబందించి కింది ప్రకటనలో ఏది సరైంది?

  1. ఇది కృష్ణా మరియు తుంగభద్ర నదులు కలిసే ప్రాంతంలో ఉంది. దీనినే “దక్షిణ కాశీ” అని అంటారు.
  2. శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరి దేవాలయం అష్ట దశ శక్తి పీఠాలలో 5వ శక్తి పీఠంగా కొలువు తిరింది.
  1. 1 మాత్రమే
  2. 2 మాత్రమే
  3. 1  మరియు 2 రెండూ
  4. 1, 2 కాదు

 

Q10. కింది వాటిని జతపరుచుము.

జాబితా – 1 జాబితా – 2

  1. ప్రధాన మంత్రి జన్ దన్ యోజన   1. 85
  2. ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన  2. 82
  3. సమగ్ర పంటల భీమా పథకం 3. 2014
  4. NABARD 4. 2016

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

Solutions:

S1. Ans(d)

Sol: 

  • సర్వోదయ అంటే సాంఘిక పునర్నిర్మాణం లేదా అందరి సంక్షేమం అని అర్థం. 
  • గాంధీజీ నిర్మాణాత్మక విధానాల్లో సర్వోదయ ఒకటి. మహాత్మాగాంధీ స్వరాజ్య, సర్వోదయ అనే లక్ష్యాల కోసం నిరంతరం కృషిచేసాడు. 
  • సర్వోదయ సిద్ధాంతం ఆధారంగా భూదానం, గ్రామదానం, సంపత్తి దానం, జీవనదానం, శ్రమదానం అనేవి ఉద్భవించాయి.

 

S2. Ans (d)

Sol: పశువుల మేతపై పుల్లరీ పన్ను విధించేవారు.

రాజదర్శనం కోసం దరిశనం అనే పన్ను చెల్లించేవారు.

గణాచారి పన్ను-  వైశ్యలపై మరియు బిచ్చగాళ్లపై వేసే పన్ను 

సుంకం – వర్తక సరుకుల మీద, ఎగుమతి, దిగుమతులపై, తయారైన వస్తువు మీద వేసే పన్ను

 

S3. Ans (A)

Sol: ప్రోలయ నాయకుడు (క్రీ.శ. 1325-1330) ముసునూరి నాయక రాజుల్లో మొదటివాడు. ఇతడు రాజమహేంద్ర వరం నుంచి ముస్లింలను పారద్రోలి గోదావరి-కృష్ణ నదుల మధ్య ప్రాంతాన్ని ఆక్రమించాడు. ‘రేఖపల్లి’ కేంద్రంగా పరిపాలించాడు.

 

S4. Ans (C)

Sol: బహమనీ సుల్తానులు మతావేశాన్ని ప్రదర్శించినారు. 1వ మహ్మద్‌షా 1368లో లక్షమంది ముస్లిమేతరులను సంహరించేదాకా కత్తిని దించను అని ప్రతిజ్ఞ చేయడం.

 

S5. Ans (b)

Sol: 

  • పత్తి: ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం చైనా (ఇండియా 2వ స్థానంలో ఉంది).
  • చెరకు : ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం బ్రెజిల్ (ఇండియా 2వ స్థానంలో ఉంది).
  • పొద్దు తిరుగుడు: ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం రష్యా (ఇండియా 4వ స్థానంలో ఉంది)
  • ఆముదం: ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఇండియా

 

S6. Ans(c)

Sol: సామాజిక సంస్కరణల ప్రభావంతో హైద్రాబాద్లో తమ వంతు పాత్రవహించి హైద్రాబాద్లో సంస్కరణలకు నాందిపలికిన ఆధునిక భావాలు గల నాయకులు, తొలి కాంగ్రెస్ వాదులైన ముల్లా అబ్దుల్ ఖయ్యుం, అఘోరనాథ్ ఛటోపాధ్యాయ లాంటి వారు హైద్రాబాద్లో తొలి ప్రజాబాహుళ్య ఉద్యమానికి నాయకత్వం వహించి స్థానిక ప్రజలలో స్వాతంత్ర్య సమరానికి శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. అదే ‘చాందానగర్ రైల్వే సంఘటన’.

 

S7. Ans (b)

Sol: పోలీస్ సంస్కరణలు : 

  • ప్రభుత్వ కోశం వద్ద రక్షణ విధులను నిర్వహించే పోలీసులను సోవర్స్ అంటారు.
  • 1867లో రెవెన్యూ బోర్డ్ రద్దైన తరువాత రెవెన్యూ నుండి పోలీస్ వ్యవస్థను వేరు చేసి సదర్ ఉల్ మైహతమీన్ కొత్వాల్ అనే అధికారిని నియమించాడు.
  • 1869లో పోలీస్ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది.
  • నిజామత్ అనే పోలీస్ దళాన్ని ఏర్పాటు చేశాడు.
  • పోలీస్ అధికారులకు ప్రభుత్వమే జీతం చెల్లించేది. వీరందరు జిల్లా తాలుక్వార్ ఆధీనంలో ఉండేవారు.

 

S8. Ans (b)

Sol: ఒక జిల్లా పరిధిలోని వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, తదితర రంగాల్లోని ఉత్పాదకతను పరిగణనలోకి తీసుకుని ఆ జిల్లా స్థూల ఉత్పత్తిని నిర్ధరిస్తారు.

 

S9. Ans (c)

Sol: అలంపూర్ అలంపూర్ అనేది మహబూబ్నగర్ జిల్లాలోని దేవాలయాల ప్రాంగణం. కృష్ణా మరియు తుంగభద్ర నదులు కలిసే ప్రాంతంలో ఉంది. దీనిని “దక్షిణ కాశీ”గా కూడా పిలుస్తారు. అలంపూర్ లోని ప్రముఖమైన దేవాలయాలలో బ్రహ్మేశ్వర ఆలయం, జోగులాంబ ఆలయం, నవబ్రహ్మ దేవాలయాలు అత్యంత ప్రసిద్ధి పొందిన ఆలయాలు. వీటిని చాళుక్య రాజులు నిర్మించారు. నవబ్రహ్మ ఆలయాలు చిన్న కోటలో తుంగభద్ర నదికి పశ్చిమ తీరాన ఉన్నాయి. ఆలయం సింహద్వారానికి ఒకవైపు కామాక్షి ఆలయం, మరోవైపు ఏకాంబరేశ్వరీ ఆలయం ఉన్నాయి. శ్రీజోగులాంబ, బాలబ్రహ్మేశ్వరి దేవాలయం అష్టాదశ శక్తి పీఠాలలో పీఠంగా దీరింది. అలంపురానికి దక్షిణంగా 1.06 కిలోమీటర్ల దూరంలో పాపనాశం పుణ్య క్షేత్రం ఇక్కడ ఉంది. ఒకేచోట 20 దేవాలయాలు ఉన్నాయి. అలంపూర్ సమీపంలో  గోందిమల్ల గ్రామంలో జింకారేశ్వరి ఆలయం ఉన్నది.

 

S10. Ans (c)

Sol:

  • ప్రధాన మంత్రి జన్ దన్ యోజన  2014
  • ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన 2016
  • సమగ్ర పంటల భీమా పథకం. 85
  • NABARD  82

 

*************************************************************************

ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ (AWO/TPO) నోటిఫికేషన్ 2022_60.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!