Telugu govt jobs   »   Current Affairs   »   Telangana State Current Affairs In Telugu

Telangana State Current Affairs In Telugu November 2022 | తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ నవంబర్ 2022 తెలుగులో

Telangana State Current affairs In Telugu November 2022, తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ నవంబర్ 2022 తెలుగులో

Telangana state current affairs plays crucial role in GROUP-1, GROUP-2, Panchayat Secretary, GROUP-4 , Assistant Engineer(AE), Sub-Inspector and Constable, Junior Lecturers etc., exams.. Telangana Government releases notification for Various posts through TSPSC like GROUP-1, GROUP-2, Panchayat Secretary, GROUP-4 , Assistant Engineer(AE), Sub-Inspector and Constable, Junior Lecturers, Degree Lecturers and various executive and non-executive posts under various departments of Telangana. Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations.To complement your preparation, we are providing you the Telangana State Current affairs In Telugu November 2022 .

తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ GROUP-1, GROUP-2, పంచాయితీ సెక్రటరీ, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్(AE), సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్స్ మొదలైన పరీక్షలలో కీలక పాత్ర పోషిస్తుంది.. తెలంగాణ ప్రభుత్వం వివిధ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. TSPSC ద్వారా GROUP-1, GROUP-2, పంచాయితీ సెక్రటరీ, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్ (AE), సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు మరియు వివిధ ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు తెలంగాణలోని వివిధ విభాగాల క్రింద. కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షల్లో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాబట్టి, ప్రభుత్వ పరీక్షలకు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు అభ్యర్థులు దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ప్రిపరేషన్‌ను పూర్తి చేయడానికి, మేము మీకు తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్‌ను తెలుగులో అందిస్తున్నాము.

Telangana State Current Affairs In Telugu July 2022 |_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

Telangana State Current affairs In Telugu, తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ తెలుగులో

1. వెబ్‌ 3.0పై హైదరాబాద్‌లో జాతీయ సదస్సు

Web 3.0
Web 3.0

ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో ముందున్న తెలంగాణ ప్రభుత్వం కొత్త తరం ఇంటర్నెట్‌ టెక్నాలజీ అయిన ‘వెబ్‌ 3.0’పై.. నవంబర్‌ 3, 4న హెచ్‌ఐసీసీలో జాతీయ సదస్సును నిర్వహించింది .

రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ వింగ్‌ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. మెటావర్స్, ఆర్ట్‌ గ్యాలరీస్, బిజినెస్‌ ఆఫీసెస్, గేమ్స్, కాసినోస్, మ్యూజిక్‌ వెన్యూస్, పేమెంట్‌ నెట్‌వర్స్, డీసెంట్రలైజ్డ్‌ ఫైనాన్స్, ఎన్‌ ఎఫ్‌టీ సావరిన్‌ ఫైనాన్స్‌ లాంటి ఎన్నో అత్యాధునిక సేవలను వెబ్‌ 3.0 వేదికగా పొందవచ్చు.

2. తెలంగాణలో 3 నేషనల్‌ హైవే విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన

Expansion of 3 National Highways in Telangana
Expansion of 3 National Highways in Telangana

రాష్ట్రంలో మూడు జాతీయ రహదారుల విస్తరణ పనులకు స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్నారు. నవంబర్ 12న రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన ఈ రోడ్ల పనులను ప్రారంభించనున్నారు. తెలంగాణలో రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేయటం ఇదే మొదటిసారి. గతంలో మనోహరా బాద్‌ కొత్తపల్లి రైల్వే లైన్‌కు గజ్వేల్‌ కేంద్రంగా మోదీ శంకుస్థాపన చేశారు. రోడ్డు పనులకు ఆ శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇప్పుడు మొదటిసారి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు..

3. తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఛైర్మన్‌గా సోమా భరత్‌

Telangana State Dairy Industry Development Cooperative Federation
Telangana State Dairy Industry Development Cooperative Federation

తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఛైర్మన్‌గా సోమా భరత్‌కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఆయనకు నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని వర్ధమానుకోటకు చెందిన భరత్‌ సీనియర్‌ న్యాయవాది. తెరాస ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న ఆయన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించడంతో పాటు ఆరేళ్లుగా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

adda247

 

4. తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌కు జాతీయ గుర్తింపు

Telangana Diagnostics
Telangana Diagnostics

నాణ్యమైన వైద్యమే కాకుండా బాధితులు/రోగులకు రోగ నిర్ధారణ పరీక్షలు సైతం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నొస్టిక్‌ సేవలను ప్రారంభించింది. పరీక్షల నిర్వహణ, ఫలితాలలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నందుకు తెలంగాణ డయాగ్నొస్టిక్‌ సెంట్రల్‌ ల్యాబ్‌కు మెడికల్‌ టెస్టింగ్‌ విభాగంలో నేషనల్‌ అక్రిడేషన్ బోర్డు ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ కొలాబొరేషన్‌ లేబొ రేటరీస్‌(ఎన్ ఏబీఎల్‌) సర్టిఫికేషన్ లభించింది.

5. బొర్లామ్‌లో బ్రహ్మీలిపి రాతిపాత్ర లభ్యం

Brahmi Script
Brahmi Script

పబ్లిక్‌ రీసెర్చ్‌ ఇన్ స్టిట్యూట్‌ ఫర్‌ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్‌ హెరిటేజ్‌ సంస్థ(ప్రిహా)కు చెందిన బృందం ఓ మట్టి దిబ్బపై లఘు శాసనంతో కూడిన రాతిపాత్రను గుర్తించింది. దీనిపై ఉన్న అక్షరాలు క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన ప్రాకృత భాష, బ్రహ్మీ లిపిలో ఉన్నాయి. ‘హిమాబుహియ’ లేక ‘హిమాబుధియ’ అనే ఐదు అక్షరాలు..బ్రహ్మీ లఘు శాసనంలో ‘హిమ’ అనే పదం బౌద్ధ భిక్షుని(స్త్రీ)ది కావచ్చని.. ఈ శాసనాన్ని పరిష్కరించిన ఎపిగ్రఫిస్ట్‌ డాక్టర్‌ మునిరత్నంరెడ్డి అభిప్రాయపడుతున్నారు.

6. Solar power: సౌర వెలుగుల ‘ముఖర’

Solar power
Solar power

ఆదిలాబాద్‌ జిల్లా ముఖర(కె) గ్రామ పంచాయతీ సొంత నిధులతో సౌర విద్యుత్‌ సౌకర్యం కల్పించుకుని రాష్ట్రంలోనే మొదటి గ్రామంగా నిలిచింది. పంచాయతీల్లో విద్యుద్దీపాలు, ఇతర సౌకర్యాల బిల్లులు పెరిగిపోతుండడంతో ఆర్థికంగా ఇబ్బందికర  పరిస్థితులున్నాయి.  దీంతో సమస్య పరిష్కారానికి సర్పంచ్‌ వినూత్నంగా ఆలోచించారు.

7. రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభం

Inauguration of Ramagundam Fertilizer Factory
Inauguration of Ramagundam Fertilizer Factory

రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)ను జాతికి అంకితం చేస్తున్నట్లు సభా వేదికపై నుంచి ప్రధాని మోదీ ప్రకటించారు. డిజిటల్‌ విధానంలో రిమోట్ ద్వారా కర్మాగారాన్ని ఆయన ప్రారంభించారు. భద్రాచలం రోడ్‌ నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన రైల్వే ట్రాక్‌ను ప్రారంభించారు. రామగుండం ఎరువుల పరిశ్రమ ప్రయోజనాలు – తెలంగాణ రైతాంగానికి ఎలా ఉపయుక్తమనే అంశాన్ని వీడియో రూపంలో వేదికపై ప్రదర్శించారు. వివిధ జిల్లాలకు అనుసంధానంగా విస్తరిస్తున్న 3 జాతీయ రహదారుల పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. వీటి శిలాఫలకాలను రిమోట్ ద్వారా ఆవిష్కరించారు. రూ.2,268 కోట్ల వ్యయంతో ఈ మార్గాల్ని విస్తరించనున్నారు. బోధన్‌ – బాసర – భైంసా (ఎన్‌హెచ్‌-161) మార్గంలో 56 కి.మీ.లను రూ.644 కోట్లతో, సిరొంచా – మహదేవ్‌పూర్‌ (ఎన్‌హెచ్‌-353) రోడ్డును 17 కి.మీ.ల మేర రూ.163 కోట్లతో, మెదక్‌ – సిద్దిపేట – ఎల్కతుర్తి (ఎన్‌హెచ్‌-765) మార్గాన్ని 134 కి.మీ. మేర రూ.1461 కోట్లతో రెండు వరుసలుగా విస్తరించనున్నారు. వీటి వీడియో దృశ్యాలను వేదికపై ప్రదర్శించారు.

8. ఆగ్రోస్‌కు ‘స్కోచ్‌ సిల్వర్‌’ అవార్డు 

'Scotch Silver' Award for Agros
‘Scotch Silver’ Award for Agros

రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ ఆగ్రోస్‌కు జాతీయ స్థాయి ‘స్కోచ్‌ సిల్వర్‌’ అవార్డు లభించింది. వ్యవసాయ విభాగంలో జాతీయ స్థాయిలో రెండోస్థానం పొందిన ఆగ్రోస్‌కు ఆన్‌లైన్‌ ద్వారా అవార్డును అందజేశారు. గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసినందుకు ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ఆగ్రోస్‌ ఎండీ రాములును వ్యవసాయశాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు సత్కరించారు.

నిరుద్యోగ గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి, బ్యాంకుల ద్వారా లోన్లు ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా రైతుసేవా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాములు వివరించారు. వాటి ద్వారా రైతులకు ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, సేంద్రియ ఎరువులు, విత్తనాలను నేరుగా అందిస్తున్నారని వెల్లడించారు. అగ్రికల్చర్‌ కమిషనర్‌ రఘునందన్‌రావు ప్రోత్సాహంతో ఆగ్రోస్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని ఆయన హర్షం వ్యక్తంచేశారు.

adda247

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!