Telugu govt jobs   »   Telugu Current Affairs   »   Telangana Seed Development Corporation MD Professor...

ఇస్టా (ISTA) అధ్యక్షుడిగా ఎంపికకానున్న తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ ప్రొఫెసర్‌ కేశవులు

ఇస్టా (ISTA) అధ్యక్షుడిగా ఎంపికకానున్న తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ ప్రొఫెసర్‌ కేశవులు Telangana Seed Development Corporation MD Professor Keshavulu to be elected as President of ISTA

అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం(ఇస్టా) అధ్యక్షుడిగా తెలంగాణ విత్తనా భివృద్ధి సంస్థ ఎండీ ప్రొఫెసర్‌ కేశవులు పేరు ఖరారైంది. ప్రస్తుతం ఈజిప్ట్‌ రాజధాని కైరోలో జరుగుతున్న ఇస్టా అంతర్జాతీయ కాంగ్రెస్‌లో ఆయన పేరును నేడో రేపో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ పదవికి ఎంపికవుతున్న మొదటి భారతీయుడు, మొదటి ఆసియా వ్యక్తి కూడా డాక్ట‌ర్ కేశవులే. 2019లో హైదరాబాద్‌లో జరిగిన ఇస్టా అంతర్జాతీయ కాంగ్రెస్‌లో ఆయన ఉపాధ్యక్షుడిగా ఎంపికైన సంగతి విదితమే.

అధిక దిగుబడులు సాధించడానికి, మెరుగైన విత్తనాలు అందేందుకు నాణ్యత పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్‌ అందించడమే ఇస్టా లక్ష్యం. ల్యాబ్‌లో విత్తనాల నాణ్యతను గుర్తించి అవి సరైన ప్రమాణాలతో ఉన్నాయని తేలితేనే ఇస్టా సర్టిఫికేషన్‌ ఇస్తారు. ఇస్టా ప్రధాన కార్యాలయం స్విట్జర్‌లాండ్‌లో ఉంది. ప్రస్తుతం దీని అధ్యక్షుడిగా స్టీవ్‌ జోన్స్‌ ఉన్నారు.

 

ISTA: International Seed Testing Association (అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం)

ISTA యొక్క ప్రధాన కార్యలయం: స్విట్జర్లాండ్

 

****************************************************************************

Migration Help Desk opened at Hyderabad airport

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Migration Help Desk opened at Hyderabad airport

 

Sharing is caring!