Telangana Ranked 5th And AP 9th In Implementation Of Small Irrigation Schemes | చిన్న నీటి పారుదల పథకాల అమలులో తెలంగాణ 5వ, ఏపీ 9వ స్థానంలో నిలిచాయి
దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న చిన్నతరహా సాగునీటి పథకాల్లో తెలంగాణ 5, ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉన్నాయి. కేంద్ర జలశక్తి శాఖ ఆగష్టు 26 న విడుదల చేసిన చిన్నతరహా నీటిపారుదల పథకాల 6వ సెన్సస్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2017-18 సంవత్సరానికి సంబంధించిన డేటా ఆధారంగా జలవనరుల శాఖ ఈ మూల్యాంకనాన్ని నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ (17.2%), మహారాష్ట్ర (15.4%), మధ్యప్రదేశ్ (9.9%), తమిళనాడు (9.1%), తెలంగాణ (7.3%) రాజస్థాన్ (6.4%) కర్ణాటక (6.1%), గుజరాత్ (6.0%), మరియు ఆంధ్రప్రదేశ్ (5.1%), పంజాబ్ (5.1%) తొలి పది స్థానాలను ఆక్రమించాయి.
2013-14నాటి 5వ సెన్సస్ తో పోలిస్తే తాజా సెన్సన్నాటికి తెలంగాణలో చిన్నతరహా నీటి పథకాలు 10.4% పెరిగాయి.
అంతేకాకుండా, ఈ చిన్న తరహా పథకాల ద్వారా నీటిపారుదల సామర్థ్యం 30,14,446 హెక్టార్ల నుండి 35,06,333 హెక్టార్లకు పెరిగింది. పూర్తిస్థాయిలో వినియోగించుకోని స్కీంలలో 2,71,219 భూగర్భ జలాలకు సంబంధించినవి కాగా, 15,063 ఉపరితల జలాలకు సంబంధించినవి. ఇందుకు విభిన్న కారణాలున్నాయి, బోరు బావులు అనుకున్న స్థాయిలో నీరు విడుదల చేయకపోవడం ఒక కారణం కాగా, విద్యుత్తు లేకపోవడం, యంత్రాల వైఫల్యం, నిర్వహణ లోపం వంటి సమస్యలూ ఇందుకు దారితీశాయి.
మరింత చదవండి |
|
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |