Telugu govt jobs   »   Latest Job Alert   »   Telangana Mega DSC Notification will be...

Telangana Mega DSC Notification will be released soon | త్వరలో 9800 పైగా ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్

Telangana Mega DSC Notification will be released soon: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. నియామకాల ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నది. దీంతో నిరుద్యోగులు ఖాళీల భర్తీకి తీసుకుంటున్న చర్యలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. నోటిఫికేషన్ల విడుదల, వాయిదా పడిన రాతపరీక్షల తేదీల కోసం ఎదురుచూస్తున్నారు.  తొలి మంత్రివర్గ సమావేశంలోనే మెగా డీఎస్సీని ప్రకటించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ఆర్నెల్లలో భర్తీ చేయాలని భావిస్తోంది.  మూడున్నర నెలల క్రితం గత ప్రభుత్వం 5,089 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. 15 డిసెంబర్ 2023 (శుక్రవారం) అసెంబ్లీలో గవర్నర్‌ తమిళిసై ప్రసంగంలోనూ వచ్చే ఆరు నెలల్లో మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తారని వెల్లడించారు. ఇప్పటికే గత నోటిఫికేషన్‌, దరఖాస్తుల ప్రక్రియ, పరీక్షల నిర్వహణపై ఆర్థికశాఖ అధికారులతో విద్యాశాఖ అధికారులు సమావేశమై చర్చించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఖాళీ పోస్టులు సుమారు 9,800 ఉంటాయని విద్యాశాఖ వర్గాలు స్పష్టంచేశాయి.

Telangana Mega DSC Notification will be released soon_3.1

త్వరలో 9800 పైగా ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా? అని నిరుద్యోగ యువత ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నది. ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఉపాధ్యాయ ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ అధికారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి అడిగి తెలుసుకున్నారు. దీంతో నిరుద్యోగ యువతలో మరింత ఆసక్తి పెరిగింది.

రాష్ట్రంలో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లాస్థాయి నియామక కమిటీ (DSC) నోటిఫికేషన్ ను పాఠశాల విద్యాశాఖ 6 సెప్టెంబర్ 2023న విడుదల చేసిన విషయం తెలిసిందే. 5,089 ఉపాధ్యాయ పోస్టులకు 1,77,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అయితే రాష్ట్ర వ్యాపంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను కలపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. 9800 పైగా ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేయాలని సమాలోచన చేస్తున్నది. ఆర్నెల్లలో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నది. ఇదే ‘విషయాన్ని… ఉభయసభలనుద్దేశించి… గవర్నర్ తమిళసై సౌందరరాజన్ శుక్రవారం ప్రకటించడమే అందుకు నిదర్శనం.

EMRS అడ్మిట్ కార్డ్ 2023 విడుదల, డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్_30.1APPSC/TSPSC Sure shot Selection Group

ఉపాధ్యాయులకు పదోన్నతులతో మరిన్ని ఖాళీలు పరిగే అవకాశం

రాష్ట్రంలో 9,370 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ గతంలోనే గుర్తించింది. వాటిలో 5,089 పోస్టుల భర్తీకే బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 1,523 ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులను గత ప్రభుత్వమే మంజూరు చేసింది. దీంతో 5,089 ఉపాధ్యాయ పోస్టులకు అదనంగా 1,523 ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు జత కావడంతో DSC ద్వారా భర్తీ చేసే ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య 6,612కు చేరింది. అయితే ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీంతో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకే ప్రభుత్వ నోటిఫికేషన్ ను జారీ చేసింది. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాఠశాల విద్యాశాఖలో 13,086 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిలో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ వచ్చింది. కొన్ని జిల్లాల్లో చాలా సబ్జెక్టులకు రిజర్వేషన్ల వారీగా పోస్టులే లేని పరిస్థితి ఉన్నది. దీంతో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇప్పుడు ఉపాధ్యాయ పోస్టుల సంఖ్యను పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగానే ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తే వాటి ద్వారా వచ్చే ఖాళీలను గుర్తించాలని, అధికారులను కోరినట్లు తెలిసింది. వాటిని కలిపి పది చేల ఉపాధ్యాయ పోస్టులతో మేగా DSCకి కసరత్తు సూచించినట్టు సమాచారం.

TSPSC GROUP-2, GROUP-3 General Studies Online Test Series in Telugu and English By Adda247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!