Telangana launches first space-tech framework policy in metaverse: Telangana as the primary hub for all space-related activities, the government has consulted various stakeholders from industry, academia, national agencies, startups and other domain experts to come up with the state’s strategy which is summarized in the following framework.
అంతరిక్ష సాంకేతిక రంగంలో రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఏకైక గమ్యస్థానంగా మార్చడం లక్ష్యంగా ‘తెలంగాణ స్పేస్‌టెక్ ఫ్రేమ్‌వర్క్ పాలసీ’ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అత్యాధునిక ఐటీ సాంకేతికత ‘మెటావర్స్’(వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నా ఒకే వేదికపై ఉన్నట్లు చూపే 3డీ ప్రోగ్రాం) వేదికగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ఏప్రిల్ 18న స్పేస్‌టెక్ పాలసీని విడుదల చేసి ప్రసంగించారు. కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్, నీతిఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, ఇన్‌స్పేస్ సీఈఓ పవన్ గోయెంకా, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.
Telangana launches first space-tech framework policy in metaverse స్పేస్ టెక్ పాలసీని విడుదల చేసిన తెలంగాణ రాష్ట్రం
- స్పేస్‌టెక్ వాతావరణాన్ని వేగవంతం చేసేందుకు రాష్ట్రంలోని స్టార్టప్‌లు, పరిశ్రమలు, విద్యాసంస్థలు చేపట్టే వినూత్న కార్యక్రమాల్లో ప్రభుత్వాన్ని భాగస్వామిగా చేసుకోవాలి.
- ఎమర్జింగ్ టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇకపై స్పేస్ టెక్నాలజీపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించింది.
- 2026 నాటికి అంతరిక్ష రంగం 558 బిలియన్ డాలర్ల పరిశ్రమగా ఎదుగుతుందనే అంచనాల నేపథ్యంలో ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది.
- కృత్రిమ మేథస్సు ఆధారిత ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ ఏఐ మిషన్ (టీ ఎయిమ్) మార్గదర్శనం, సాయం, మార్కెటింగ్ మద్దతు కోసం దేశవ్యాప్తంగా 80కిపైగా స్టార్టప్‌లు తమ వివరాలు నమోదు చేసుకున్నాయి.
- టీ ఎయిమ్ తరహాలో ఇంక్యుబేషన్, శిక్షణ, భాగస్వామ్యాల కోసం సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీసీఓఈ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
- టీ హబ్, టీఎస్‌ఐసీ, వి హబ్, రిచ్, టాస్క్, టీ వర్క్స్, ఎమర్జింగ్ టెక్నాలజీ విభాగం, ఇమేజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తదితరాలను అభివృద్ది చేయడంతో గత ఐదేళ్లలో 1,500కు పైగా స్టార్టప్‌లకు రూ.1,800 కోట్లకు పైగా నిధులు సమకూరాయి.
- గతంలో అనేక విదేశీ సంస్థలు సాధించిన సాంకేతిక ప్రగతి, ఆవిష్కరణల్లో భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లది కీలకపాత్ర అనే విషయం మనకు తెలుసు. ఇకపై భారతీయుల స్వదేశీ సాంకేతికతను విశ్వవ్యాప్తంగా ఎగుమతి చేయాల్సిన తరుణం వచ్చింది.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************
