Telugu govt jobs   »   Telugu Current Affairs   »   Telangana: KTR launches India's 1st women-owned...

 హైదరాబాద్‌లో భారతదేశపు మొట్ట మొదటి మహిళా యాజమాన్యంలోని పారిశ్రామిక పార్కును ప్రారంభించిన కేటీఆర్

KTR launches India’s 1st women-owned industrial park in Hyderabad:

మహిళా పారిశ్రామిక వేత్తల సమస్యలను పరిష్కరించేందుకు ‘ఉద్యమిక ’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. సింగిల్‌ విండో విధానంలో పనిచేసే ఈ విభాగం మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను, ఇతర అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించి వారికి అండగా నిలుస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి 8) సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు.

ఫ్లో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ప్రారంభం:
సంగారెడ్డి పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో ఫ్లో(ఫిక్కి లేడీస్‌ ఆర్గనైజేషన్‌) ఇండస్ట్రియల్‌ పార్క్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ుహిళల కోసమే ఏర్పాటు చేసిన ఈ ఫ్లో ఇండస్ట్రియల్‌ పార్కులో 50 ఎకరాలను 25 మంది మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వం కేటాయించింది. మహిళా పారిశ్రామికవేత్తల కోసం పార్క్‌ ఏర్పాటు చేయడం దేశంలోనే  మొట్టమొదటిసారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

*******************************************************************************************ఆంధ్రప్రదేశ్‌: సుపరిపాలనలో నం.1,Andhra Pradesh: No.1 in good governance

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

ఆంధ్రప్రదేశ్‌: సుపరిపాలనలో నం.1,Andhra Pradesh: No.1 in good governance

Download Adda247 App

Sharing is caring!