తెలంగాణ ఉద్యోగార్థులకు శుభవార్త .. ఎన్ని రోజులుగా ఎదురుచూస్తున్న తెలంగాణ జాబ్ క్యాలండర్ ను 02 ఆగస్టు 2024 న శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇందులో ఉద్యోగాల సంఖ్య ఉండదని, నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ప్రకటిస్తామని తెలిపారు. అక్టోబర్లో Transco, డిస్కంల ఇంజినీరింగ్, AEE పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు విడుదల తేదీలు, పరీక్షల తేదీలు మరియు నిర్వహణ గురించి ఆభ్యర్ధులకు సరైన సమాచారం కోసం ఈ జాబ్ క్యాలెండర్ దిక్సూచి. పోటీ పరీక్షలకి సన్నద్దమయ్యే అభ్యర్ధులకు ఇది ఒక సువర్ణఅవకాశం పరీక్షల కోసం ముందునుంచి సన్నద్దమవ్వడంతో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ పొందగలరు. Telangana Job Calendar 2024 కోసం ఎదురు చూస్తున్న అభ్యర్ధులు వారి ప్రణాళికని సిద్దం చేసుకుని సన్నద్దమవ్వాలి.
తెలంగాణ జాబ్ క్యాలండర్ PDF
తెలంగాణ లో నిరుద్యోగులకి ఇది శుభవార్త. ఎట్టకేలకు తెలంగాణ జాబ్ క్యాలండర్ ను 2 ఆగస్టు 2024 న శాసనసభలో విడుదల చేశారు డిప్యూటీ సిఎం. నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ రానుందని పేర్కొన్నారు. ఈ జాబ్ క్యాలండర్ ద్వారా TS పోలీస్, TGPSC గ్రూప్స్, గురుకుల్, విద్య, వైద్య ఆరోగ్యం,JL, DL, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్ట్లు వంటి ఇతర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ట్రాన్స్‌కో, డిస్కమ్‌లలో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుందని ఆయన తెలిపారు. ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలండర్ విడుదల అయ్యేలా చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. TGPSC గ్రూప్-1, 2, 3 సర్వీసులతో పాటు పోలీసు, సింగరేణి, గురుకుల, వైద్య విభాగాల ఉద్యోగాలతో పాటు ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు ఇందులో ఉన్నాయి.
తెలంగాణ ఉద్యోగ నోటిఫికేషన్ల షెడ్యూల్
తెలంగాణ జాబ్ క్యాలండర్ విడుదల అయ్యింది. పోటీ పరీక్షలకి సన్నద్దమయ్యే అభ్యర్ధులు వారి ప్రణాళిక ని సిద్దం చేసుకుని పరీక్షలకి ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలి. తెలంగాణ ఉద్యోగ నోటిఫికేషన్ల షెడ్యూల్ తెలుసుకోండి:
తెలంగాణ ఉద్యోగ నోటిఫికేషన్ల షెడ్యూల్ | ||
పోస్టుల వివరాలు | నోటిఫికేషన్ జారీ చేసే సమయం | పరీక్షలు నిర్వహించే సమయం |
గ్రూప్-1 (ACFతో కలిపి) విద్యార్హత: ఏదైనా డిగ్రీ, ప్రత్యేక పోస్టులకు ప్రత్యేక విద్యార్హతలు |
2024 అక్టోబరు – 2025 ఫిబ్రవరి(ప్రిలిమినరీ) |
2025 జులై(మెయిన్స్) |
ప్రభుత్వ విభాగాల్లో ఫ్రొఫెషనల్ సర్వీసులు, గెజిటెడ్ అధికారులు విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ/పీజీ |
2025 జనవరి | 2025 ఏప్రిల్ |
అటవీశాఖలో ఫారెస్టు బీట్ అధికారులు(FBO) విద్యార్హత: ఇంటర్మీడియట్, తత్సమాన అర్హత |
2025 ఫిబ్రవరి | 2025 మే |
పాఠశాల విద్యలో ఉపాధ్యాయులు(DSC) విద్యార్హత: డిగ్రీ B.ED, ఇంటర్ D.Ed, ఇతర తత్సమాన అర్హతలు |
2025 ఫిబ్రవరి | 2025 ఏప్రిల్ |
పోలీసు SIలు విద్యార్హత: ఏదైనా డిగ్రీ |
2025 ఏప్రిల్ | ప్రిలిమినరీ: 2025 ఆగస్టు |
పోలీసు కానిస్టేబుళ్లు విద్యార్హత: ఇంటర్మీడియట్ |
2025 ఏప్రిల్ | ప్రిలిమినరీ: 2025 ఆగస్టు |
గ్రూప్-2 (FROతో కలిపి) విద్యార్హత: డిగ్రీ, సంబంధిత పోస్టులకు ప్రత్యేక అర్హతలు |
2025 మే | 2025 అక్టోబరు |
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు నెట్ లేదాస్లెట్ లేదా పీహెచ్‌డీ |
2025 జూన్ | 2025 సెప్టెంబరు |
గురుకుల డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్లు, ఇతర పోస్టులు విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు నెట్ లేదా స్లెట్ లేదా పీహెచ్‌డీ |
2025 జూన్ | 2025 సెప్టెంబరు |
సింగరేణిలో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ మేనేజ్‌మెంట్, జీడీఎంవో విద్యార్హత: సంబంధిత విభాగాల్లో BE/B.Tech, CA, ఐసీడబ్ల్యూఏ, CMA, MBBS |
2025 జులై | 2025 నవంబరు |
ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల్లో ఏఈఈ, ఇతర గెజిటెడ్ హోదా సర్వీసులు విద్యార్హత: BE/B.Tech, తత్సమాన అర్హత |
2024 అక్టోబరు | 2025 జనవరి |
వైద్యారోగ్యశాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ అధికారులు, ఫార్మాసిస్టులు
విద్యార్హత: సర్టిఫికెట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ అధికారులకు జీఎన్‌ఎం, |
2024 సెప్టెంబరు | 2024 నవంబరు |
ట్రాన్స్‌కో, TGNPDSCL, TGSPDCLలలో AEE, AE, సబ్‌ఇంజినీర్, ఇతర పోస్టులు విద్యార్హత: సంబంధిత విభాగాల్లో BE/B.Tech, డిప్లొమా కోర్సులు |
2024 అక్టోబరు | 2025 జనవరి |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |