ఆహార భద్రత ప్రమాణాల్లో తెలంగాణ 14, ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో నిలిచాయి
సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ విడుదల చేసిన ఆహార భద్రత ప్రమాణాల రాష్ట్రాల సూచీక ప్రకారం తెలంగాణ 14వ ర్యాంక్‌ను సాధించగా, ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో నిలిచింది. విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య, కేంద్ర సహాయ మంత్రి ఎస్పీసింగ్ భేగల్, FSSAI CEO కమలవర్ధన్‌రావులు మూడు కేటగిరీల్లోని 20 పెద్ద రాష్ట్రాలు, 8 చిన్న రాష్ట్రాలు మరియు 8 కేంద్ర పాలిత ప్రాంతాల స్థానాలను వెల్లడించారు. ఆహార భద్రత ప్రమాణాల మూల్యాంకనం పనితీరును అంచనా వేయడానికి ఆరు విభాగాలలో మార్కులను కేటాయించారు. తెలంగాణ 24 మార్కులు సాధించి 14వ స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ 32 మార్కులు సాధించి 17వ స్థానంలో నిలిచింది. పెద్ద రాష్ట్రాల్లో కేరళ, పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తొలి ఐదు స్థానాల్లో నిలవగా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, జార్ఖండ్ చివరి ఐదు స్థానాల్లో నిలిచాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే తెలంగాణ ఒక ర్యాంక్‌ను ఎగబాకి మెరుగుపరుచుకోగా, ఆంధ్రప్రదేశ్ తన 17వ స్థానాన్ని నిలబెట్టుకుంది.
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
***************************************************************************