సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన వెబ్‌సైట్‌లో పేర్కొన్న దేశంలోని టాప్-10 ఆదర్శ గ్రామాలన్నీ తెలంగాణవే. మొదటి 20 గ్రామాల్లో 19 రాష్ట్రానికే చెందినవని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇటీవల వచ్చిన 19 అవార్డులకు అదనంగా వచ్చిన ప్రశంస అని తెలిపారు.
పార్లమెంట్ సభ్యులు తమ నియోజకవర్గాల్లోని లేదా దేశంలోని ఏవైనా గ్రామాలను ఎంపిక చేసుకుని వాటి అభివృద్ధికి కృషి చేసేందుకు రూపొందించిన పథకమే సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన. అభివృద్ధిని మదింపు చేసి కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా వడపర్తి (స్కోర్ – 92.17 శాతం), కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ (91.7), నిజామాబాద్ జిల్లా పాల్దా (90.95), కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రామకృష్ణాపూర్ (90.94), యాదాద్రి భువనగిరి జిల్లా అలేరు మండలం కొలనుపాక (90.57), నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్ (90.49), జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూల రాంపూర్ (90.47), నిజామాబాద్ జిల్లా తానాకుర్దు (90.3), నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కుక్‌నూర్ (90.28), కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి (90.25).
*******************************************************************************************
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************
