ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. TSLPRB పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల పరీక్ష ఫలితాలపై తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాజాగా డివిజన్ బెంచ్ కొట్టివేసింది. కానిస్టేబుల్ పరీక్ష ప్రశ్నాపత్రంలో నాలుగు ప్రశ్నలకు మార్కులు కలపాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో పాటు పోలీస్ నియామక మండలి కూడా హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది. మొత్తం 16,604 పోస్టులకు గాను 15,750 మంది ఎంపికైనట్లు TSLPRB వెల్లడించింది. ఎంపికైనవారిలో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళలు ఉన్నారు. అలాగే.. కోర్టు కేసుల దృష్ట్యా పలు పోస్టులకు ఫలితాలు విడుదల చేయలేదు. PTOలోని 100 డ్రైవర్ పోస్టులు, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలోని 225 పోస్టులకు ఫలితాలు కోర్టు కేసుల కారణంగా విడుదల చేయలేదు.
TSLPRB పోలీస్ కానిస్టేబుల్ పరీక్షపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు
TSLPRB కానిస్టేబుల్ పోస్టుల తుది రాత పరీక్ష ఫలితాలను తెలంగాణా పోలీసు నియామకమండలి విడుదల చేసింది. మొత్తం పోస్టులకు గాను 84శాతం మంది అర్హత సాధించారు. అయితే, తుది అర్హత పరీక్షలో నాలుగు ప్రశ్నలు తప్పుగా వచ్చాయని వాటికి ఇచ్చిన ఆప్షన్లను తెలుగులో అనువాదం చేయకపోవడం వల్ల సరైన సమాధానం గుర్తించలేకపోయామని కొంతమంది అభ్యర్థులు గతేడాది హైకోర్టును ఆశ్రయించారు. ఆయా ప్రశ్నలకు సమాధానం రాసిన అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు కలిపి తిరిగి అర్హుల జాబితా రూపొందించాలని జస్టిస్ పి.మాధవి పోలీస్ నియామక మండలి ని ఆదేశించింది. దీంతో ఈ తీర్పుపై ఎంపికైన అభ్యర్థులు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశారు.
APPSC/TSPSC Sure Shot Selection Group
TS కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలపై తెలంగాణ హైకోర్టు తీర్పు
గతంలో TS కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. సివిల్ కానిస్టేబుల్ పరీక్షలో నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ జనవరి 4 హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. నాలుగు ప్రశ్నలకు ఆప్షన్లను తెలుగులో ఇవ్వకపోవడం వల్ల నష్టపోయామని కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. నాలుగు ప్రశ్నలకు ఆప్షన్లను వాడుకలో ఉన్న పదాలనే ఇచ్చామని పోలీసు నియామక మండలి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. నాలుగు ప్రశ్నలపై అభ్యంతరాలను నిపుణుల కమిటీ తేల్చిన తర్వాత నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ధర్మాసనం ఆదేశించింది. నాలుగు వారాల్లోగా కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని పోలీసు నియామక మండలికి సూచించింది.
నాలుగు వారాల్లోగా నియామక ప్రక్రియ పూర్తి
అభ్యంతరాలున్న నాలుగు ప్రశ్నలపై పరిశీలన కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం సాయంతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి అని హైకోర్టు ఆదేశించింది. అభ్యంతరాలు ఉన్న నాలుగుప్రశ్నలపై నిపుణుల కమిటీ తేల్చాలని పోలీసు నియామక మండలి (TSLPRB)ని ఆదేశించింది. ప్రశ్నల తప్పిదాలపై నిపుణుల కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా నియామక ప్రక్రియను పూర్తిచేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |