Telugu govt jobs   »   Current Affairs   »   Telangana Govt to launch Chief Minister's...

Telangana Govt to launch Chief Minister’s Breakfast Scheme for Students | తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించనుంది

Telangana Govt to launch Chief Minister’s Breakfast Scheme for Students | తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించనుంది

ప్రభుత్వం పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా నుంచి తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి అల్పాహార పథకంగా పిలవబడే ఈ కార్యక్రమం దసరా రోజున అక్టోబర్ 24న ప్రారంభంకానుంది.

దసరా కానుకగా అక్టోబర్ 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు (1 నుంచి 10వ తరగతి వరకు) చదువుతున్న విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహారం పథకాన్ని అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందేలా చూడటమే ఈ కార్యక్రమం లక్ష్యం. తద్వారా నిరుపేద కుంటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా చర్యలు చేపట్టింది.

తమిళనాడు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ఈ పథకం విధానాన్ని పరిశీలించి రావాలని ఐఎఎస్ అధికారుల బృందాన్ని సిఎం కేసీఆర్ ఇటీవలే పంపించారు. అక్కడ విజయవంతంగా అమలవుతున్న ‘ విద్యార్థులకు అల్పాహారం పథకాన్ని అధ్యయనం చేసిన అధికారుల బృందం ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కూడా అల్పాహారాని అందచేయాలని నిర్ణయించారు. ఇందుకు గాను రాష్టర ప్రభుత్వ ఖజానా పై ప్రతి యేటా దాదాపు రూ. 400 కోట్ల అదనపు భారం పడనున్నది.

Telangana Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

***************************************************************************

Sharing is caring!

Telangana Govt to launch Chief Minister's Breakfast Scheme for Students_4.1

FAQs

పాఠశాల అల్పాహార కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

మధ్యాహ్న భోజన పథకంలో అగ్రగామిగా నిలిచిన తమిళనాడు ఇప్పుడు దేశంలోనే విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం అందిస్తున్న తొలి రాష్ట్రంగా అవతరించింది. ఈ పొడిగింపుతో రాష్ట్రంలోని 31,008 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని దాదాపు 17 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు.