Telangana Govt Revokes G.O 111, తెలంగాణ ప్రభుత్వం G.O 111ని రద్దు చేసింది
హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిరక్షణ కోసం గతంలో జారీ చేసిన 111 జీవోను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ రిజర్వాయర్ల ద్వారా నగరానికి సరఫరా అయ్యే తాగునీరు అతి తక్కువ అని, ఇకపై వాటిపై ఆధార పడాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయినా జలాశయాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సోమేశ్‌కుమార్ ఏప్రిల్ 20న జీవో నంబర్ 69 జారీ చేశారు.
Telangana Govt Revokes G.O 111 Highlights
అప్పట్లో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ను, వాటి పరీవాహక ప్రాంతాన్ని పరిరక్షించే ఉద్దేశంతో 111 జీవో ద్వారా ఆంక్షలు విధించారు. జీవో జారీ చేసినప్పుడు ఆ రిజర్వాయర్ల నుంచి నగరానికి అందించే తాగునీరు 27.59 శాతం వరకు ఉండేది. ప్రస్తుతం సరఫరా అయ్యేది 1.25 శాతమే. ఇప్పుడు నగర ప్రజలు తాగునీటి కోసం ఈ రిజర్వాయర్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. 111 జీవో ఆంక్షలను తొలగిస్తున్నాం’’ అని ప్రభుత్వం పేర్కొంది.
G.O 111 Important Points
హైదరాబాద్ నగరాన్ని మూసీ వరదల నుంచి రక్షించేందుకు, అదే సమయంలో తాగునీటిని అందించేలా నిజాం హయంలోనే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను నిర్మించారు. అప్పటి నుంచీ హైదరాబాద్‌కు ప్రధాన నీటి వనరులుగా ఉన్న ఈ రిజర్వాయర్ల పరిరక్షణ కోసం 1996లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో 111ను జారీ చేసింది. జలాశయాలకు చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాల పరిధిలో ఉన్న 1,32,000 ఎకరాల విస్తీర్ణంలో.. పరిశ్రమలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, నివాసాలు, నిర్మా ణాలపై నియంత్రణలు విధించింది. కొన్నేళ్లుగా నగరం విపరీతంగా విస్తరించడం, తాగునీటి కోసం కృష్ణా, గోదావరి జలాలను తరలించడం నేపథ్యంలో.. 111 జీవో ఎత్తివేయాలన్న డిమాండ్ మొదలైంది.
ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలు రూపొందించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో.. మున్సిపల్, ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, వాటర్ బోర్డు ఎండీ, కాలుష్య నియంత్రణ బోర్డు మెంబర్ సెక్రటరీ, హెచ్‌ఎండీఏ డైరెక్టర్ (ప్లానింగ్) సభ్యులుగా ఉంటారు.
Telanagana GO 111 Review
గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణం 217 చదరపు కిలోమీటర్లుకాగా.. 111 జీవో పరిధిలోని భూమి విస్తీర్ణం 538 చదరపు కిలోమీటర్లు. జీవో 111 కింద 84 గ్రామాల్లోని 1,32,600 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో 32 వేల ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది. ఆంక్షల ఎత్తివేతతో ఈ భూములన్నీ అందుబాటులోకి రానున్నాయి.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************
