తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి సమయం ఆసన్నమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 30,453 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతులిచ్చింది. శాఖల వారీగా ఈ ఉద్యోగాలను ఏయే సంస్థలు భర్తీ చేస్తాయో స్పష్టం చేస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 80,039 ఉద్యోగాలను నేరుగా భర్తీ(డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ఈ నెల 10న అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. వీటిని అత్యంత త్వరితంగా భర్తీ చేసి నిరుద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు చూస్తానని ఆయన ఇచ్చిన హామీ కార్యరూపంలోకి వచ్చింది. ఉద్యోగ ఖాళీలను నోటిఫై చేసిన వెంటనే ప్రభుత్వ శాఖలు చర్యలు వేగవంతం చేస్తూ వచ్చాయి.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు హరీశ్, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఇతరులతో పాటు సీఎస్ సోమేశ్‌కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆయా శాఖల అధికారులతో పలు ధపాలుగా చర్చించారు. 80,039 ఉద్యోగాలకుగాను తొలి విడతగా 30,453 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు అనుమతులిస్తూ బుధవారం జీవోలు జారీ చేసింది. ఇతర ఖాళీలపైనా త్వరలోనే హరీశ్, ఆయా శాఖల మంత్రులు సమీక్షలు నిర్వహించ నున్నారు. వీలైనంత వేగంగా వీటికి అనుమతులు జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.
తొలిసారిగా గ్రూప్–1…: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి అనుమతులు రావడం, అందులోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనుం డటంతో నిరుద్యోగుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం తాజాగా భర్తీకి అనుమతిచ్చిన వాటిలో అత్యధికంగా పోలీస్ ఉద్యోగాలే ఉన్నాయి. పోలీస్ విభాగానికి సంబంధించి నాలుగు కేటగిరీల్లో 17,003 ఉద్యోగాలు, వైద్య, ఆరోగ్య శాఖలో మూడు కేటగిరీల్లో 12,735 ఉద్యోగాలు, రవాణా శాఖలో 212 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
రోస్టర్ ఫిక్స్ అయ్యాక..: వివిధ ప్రభుత్వ శాఖల్లో 30,453 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతివ్వడం, నియామక సంస్థలను కూడా ఖరారు చేయడంతో ఉద్యోగ నోటిఫికేషన్లకు మార్గం సుగమమైంది. ఆర్థిక శాఖ అనుమతిచ్చిన మేరకు ఆయా శాఖలు ఉద్యోగాల వారీగా రోస్టర్‌ను ఖరారు చేయాల్సి ఉంటుంది. రోస్టర్ ప్రకారం ఉద్యోగాల ఇండెంట్లు నియామక సంస్థలకు సమర్పించిన తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ కానున్నాయి.

టీఎస్‌పీఎస్సీ ద్వారా గ్రూప్ –1 పోస్టులు
జిల్లా బీసీ అభివద్ధి అధికారి–2
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్–40
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్–38
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(వైద్యారోగ్యశాఖ)–20
డీఎస్పీ– 91
జైల్స్ డిప్యూటీ సూపరిండెంట్–2
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్–8
డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్–2
జిల్లా మైనారీటీ వెల్ఫేర్ ఆఫీసర్–6
మునిసిపల్ కమిషనర్ గ్రేడ్–2(35)
ఎంపీడీవో(121)
డీపీవో(5)
కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్(48)
డిప్యూటీ కలెక్టర్(42)
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్(26)
జిల్లా రిజిస్ట్రార్(5)
జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్(3)
ఆర్టీవో(4)
జిల్లా గిరిజన సంక్షేమాధికారి(2)
*********************************************************************************
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************
Adda247 App for APPSC, TSPSC, Railways, SSC and Banking