Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana GK MCQs Questions And Answers...

Telangana GK MCQs Questions And Answers In Telugu, 25th September 2023 For TSPSC GROUPs

Telangana GK MCQs Questions And Answers in Telugu : Practice Telangana GK Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Awareness forms a part and parcel of Telangana GK. Most of the questions asked in the Telangana GK sections are based on current affairs.

Telangana GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

Telangana GK MCQs Questions And Answers in Telugu.

Q1. “వీర తెలంగాణ-నా అనుభవాలు” పుస్తక రచయిత ఎవరు?

(a) రావి నారాయణ రెడ్డి

(b) స్వామి రామానంద తీర్థ

(c) B. నర్సింగ్ రావు

(d) C నారాయణరెడ్డి

Q2. M.K. వెల్లోడి మీనన్ ఏ సంవత్సరాల మధ్య హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించాడు?

(a) 26 మార్చి, 1950 నుండి 6 మార్చి, 1952 వరకు

(b) 26 జనవరి, 1951 నుండి 6 మార్చి, 1952 వరకు

(c) 26 జనవరి, 1950 నుండి 6 మార్చి, 1952 వరకు

(d) 26 జనవరి, 1950 నుండి 6 మార్చి, 1951 వరకు

Q3. ఏ తేదీన హైదరాబాద్ రాజ్ ప్రముఖ్‌గా నిజాం ఉస్మాన్ అలీఖాన్ నియమితులయ్యారు

(a) జనవరి 26, 1951

(b) జనవరి 26, 1949

(c) జనవరి 26, 1950

(d) జనవరి 26, 1948

Q4. వెల్లోడి ప్రభుత్వంలోని మంత్రుల పేరుతో సరిగా జతపరచబడని శాఖను గుర్తించండి

(a) బూర్గుల రామకృష్ణారావు- విద్య, ఎక్సైజ్ శాఖలు

(b) M. శేషాద్రి – హోం, కమ్యూనికేషన్ & లా విభాగాలు

(c) V.B. రాజు – కార్మిక, కస్టమ్స్, పరిశ్రమలు & గృహనిర్మాణ శాఖలు

(d) యార్ జంగ్ బహదూర్ – ఫైనాన్స్ & కామర్స్

Q5. హైదరాబాద్ మిలిటరీ గవర్నర్‌గా జయంతో నాథ్ చౌదరి ఏ తేదీన బాధ్యతలు స్వీకరించారు?

(a) సెప్టెంబర్ 18, 1948

(b) సెప్టెంబర్ 19, 1948

(c) 20 సెప్టెంబర్, 1948

(d) 21 సెప్టెంబర్, 1948

Q6. సరైన ప్రకటనను గుర్తించండి.

(a) 6 ఫిబ్రవరి, 1949J.N.చౌదరి ఫర్మానా జారీ చేశారు.

(b) ఫర్మానా ప్రకారం, హాలి సిక్కా నిషేధించబడింది.

(c) హాలి సిక్కా 1 ఏప్రిల్ 1955న పూర్తిగా నిషేధించబడింది

(d) పైవన్నీ

Q7. J N చౌదరి హయాంలో ముస్లింలు, కమ్యూనిస్టులపై జరిగిన హత్యల గురించి నెహ్రూ దృష్టికి తీసుకెళ్లిన జర్నలిస్ట్ పేరు ఏమిటి?

(a) యూనిస్ సలీం

(b) సలీం అహ్మద్

(c) ఉస్తాద్ సలీం

(d) యూనిస్ ఖాన్

Q8. సుందర్‌లాల్ కమిటీని దేని కొరకు నియమించారు

(a) హైదరాబాద్ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య ఆదాయాలకు పంపిణీ చేయడం

(b) వెల్లోడి ప్రభుత్వ అవినీతిపై విచారణ

(c) J.N చౌదరి యొక్క దాడులపై విచారణ ప్రభుత్వం

(d) పైవేవీ కాదు

Q9. పురాతన జిల్లా పేరుకు సంబంధించి, తప్పుగా జతపరచబడిన దానిని గుర్తించండి

(a) కరీంనగర్ – ఎలగందుల

(b) మహబూబ్ నగర్ – పాలమూరు

(c) ఆదిలాబాద్ – ఎదులాపురం

(d) నిజామాబాద్ – మెతుకుదుర్గం

Q10. నిజాం సబ్జెక్ట్స్ లీగ్-1935కి సంబంధించి సరైన ప్రకటనను గుర్తించండి

  1. 1935లో ముల్కీ కార్యకర్తలు నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అనే సంస్థను ప్రారంభించారు.
  2. ఈ లీగ్ ఇచ్చిన నినాదం హైదరాబాదీల కోసం హైదరాబాద్

(a) 1 మాత్రమే 

(b) 2 మాత్రమే 

(c) 1 మరియు 2 రెండూ

(d) 1 లేదా 2 కాదు

Solutions: 

S1. Ans(a)

 Sol. రావి నారాయణ రెడ్డి రచించిన “వీర తెలంగాణ-నా అనుభవాలు” హైదరాబాద్ చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన పుస్తకం.

S2. Ans(c)  

Sol. కేరళకు చెందిన IPS అధికారి M.K. వెల్లోడి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.

M.K. వెల్లోడి జనవరి 26, 1950 నుండి మార్చి 6, 1952 వరకు పాలించారు.

S3. Ans(c) 

Sol. 1950 జనవరి 26న నిజాం ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ రాజ్ ప్రముఖ్‌గా నియమితులయ్యారు. 1956 నవంబర్ 1న ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడే వరకు నిజాం రాజ్ ప్రముఖ్‌గా కొనసాగారు.

S4. Ans(d)

Sol. యార్ జంగ్ బహదూర్ – ప్రజా పనులు

CVS రావు – ఫైనాన్స్ & కామర్స్

S5. Ans(a) 

Sol. 1948 సెప్టెంబర్ 18న జవహర్‌లాల్ నెహ్రూ సమక్షంలో హైదరాబాద్ మిలటరీ గవర్నర్‌గా జయంతో నాథ్ చౌదరి బాధ్యతలు చేపట్టారు.

S6. Ans(d) 

Sol. అన్ని ప్రకటనలు సరైనవి.

S7. Ans(a) 

Sol. J.N. చౌదరి ప్రభుత్వం కమ్యూనిస్టులు, ముస్లింలపై విచక్షణారహితంగా దాడులు చేసింది. ఈ దాడులను జర్నలిస్టు యూనిస్ సలీం జవహర్‌లాల్ నెహ్రూ దృష్టికి తీసుకెళ్లారు.

S8. Ans(c) 

Sol. J.N. చౌదరి ప్రభుత్వం కమ్యూనిస్టులు, ముస్లింలపై విచక్షణారహితంగా దాడులు చేసింది. ఈ దాడులపై విచారణకు 1949 అక్టోబర్‌లో నెహ్రూ సుందర్‌లాల్ కమిటీని నియమించారు.

S9. Ans(d) 

Sol. నిజామాబాద్ – ఇందూరు

మెదక్ – మెతుకుదుర్గం.

S10. Ans(c)

Sol. రెండు ప్రకటనలు సరైనవి.

Telangana Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 telugu website