తెలంగాణ GDS నోటిఫికేషన్ 2022: తెలంగాణ పోస్టల్ సర్కిల్ (తెలంగాణ పోస్ట్ ఆఫీస్) రిక్రూటింగ్ డిపార్ట్‌మెంట్ అధికారిక రిక్రూట్‌మెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తెలంగాణ తపాలా శాఖ జీడీఎస్ పోస్టుల భర్తీకి 1226 ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ పోస్టల్ సర్కిల్ లో ఉద్యోగం కావాలనుకునే అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోగలరు, దరఖాస్తు ప్రారంభ తేదీ 2 మే 2022, మరియు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 5 జూన్ 2022. అదేవిధంగా దరఖాస్తు రుసుము ఎంపిక విధానం మొదలగు సమాచారం కోసం ఈ కథనాన్ని పూర్తిగా చదవండి .
APPSC/TSPSC Sure shot Selection Group
తెలంగాణ GDS నోటిఫికేషన్ 2022 అవలోకనం
తెలంగాణ గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది, పూర్తి సమాచారం కోసం దిగువ పట్టిక తనిఖీ చేయండి .
తెలంగాణ GDS నోటిఫికేషన్ 2022 | ||||||
పోస్ట్ పేరు | బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ | |||||
సంస్థ | తెలంగాణ పోస్టల్ సర్కిల్ (తెలంగాణ పోస్ట్ ఆఫీస్) రిక్రూటింగ్ డిపార్ట్‌మెంట్) | |||||
ఖాళీల సంఖ్య | 1226 | |||||
స్థానం | తెలంగాణ | |||||
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 2 మే 2022 | |||||
ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ | 6 జూన్ 2022 | |||||
ఎంపిక విధానం | మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. | |||||
అధికారిక వెబ్‌సైట్ | https://indiapostgdsonline.gov.in/ |
Download Telangana GDS Official Notification 2022 pdf
తెలంగాణ GDS అర్హత ప్రమాణాలు
తెలంగాణ GDS గ్రామీణ డాక్ సేవక్ యొక్క విద్య, వయోపరిమితి, అర్హత ప్రమాణాలను ఇక్కడ తనిఖీ చేయండి .
విద్యార్హత
తెలంగాణ GDS గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం కనీస విద్యార్హత క్రింద పేర్కొన్న విధంగా ఉంది, అయితే, ఉన్నత విద్య ఉన్న అభ్యర్థులు కూడా GDS గ్రామీణ డాక్ సేవక్ ఖాళీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు, అయితే వయోపరిమితి తప్పనిసరి.
పోస్ట్ | విద్యార్హత |
తెలంగాణ GDS గ్రామీణ డాక్ సేవక్ | 10వ తరగతి పాస్ కావాలి. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ తప్పనిసరి. |
ఇతర అర్హతలు: స్థానిక భాషలో 10వ తరగతి వరకు చదివి ఉండాలి.
వయోపరిమితి
కనిష్ట వయస్సు : 18 సంవత్సరాలు ఉండాలి
గరిష్ట వయస్సు : 40 సంవత్సరాలు ఉండాలి
వయోసడలింపు
ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు | 5 సంవత్సరాలు |
ఓబీసీ అభ్యర్థులకు | 3 సంవత్సరాలు |
దివ్యాంగులకు | 10 సంవత్సరాలు |
ఓబీసీ అయిన దివ్యాంగులకు | 13 సంవత్సరాలు |
ఎస్‌సీ, ఎస్‌టీ అయిన దివ్యాంగులకు | 15 సంవత్సరాలు |
తెలంగాణ GDS దరఖాస్తు రుసుము
తెలంగాణ GDS దరఖాస్తు రుసుము కింది విధంగా ఉంది
- జనరల్ అభ్యర్థులకు : రూ.100.
- ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌వుమెన్‌కు : ఫీజు లేదు
Also check: తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022
తెలంగాణ GDS నోటిఫికేషన్ 2022 ఆన్లైన్ దరఖాస్తు విధానం
కింద పేర్కొన్న దశలు అనుసరించడం ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు అవి:
దశ 1- అభ్యర్థులు ముందుగా https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
దశ 2- హోమ్ పేజీలో వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరు లింక్స్ ఉంటాయి.
దశ 3- ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి ఆ లింక్స్ క్లిక్ చేయొచ్చు.
దశ 4- రిజిస్ట్రేషన్ చేయడానికి Registration పైన క్లిక్ చేయాలి.
దశ 5- మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేయాలి.
దశ 6- పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, 10వ తరగతి పాసైన వివరాలు, ఆధార్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
దశ 7- ఫోటో, సంతకం, టెన్త్ మెమో అప్‌లోడ్ చేయాలి.
దశ 8- రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత Apply పైన క్లిక్ చేయాలి.
దశ 9- రిజిస్ట్రేషన్ నెంబర్, సర్కిల్ వివరాలు ఎంటర్ చేయాలి.
దశ 10- ఆ తర్వాత అడ్రస్, పదవ తరగతిలో వచ్చిన మార్క్స్, ఇతర వివరాలతో అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
దశ 11- ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
Telangana GDS Online Application link
తెలంగాణ GDS వేతనం
తెలంగాణ GDS గ్రామీణ డాక్ సేవక్ లో పని చేసే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కు రూ.12,000, మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, కు రూ.10,000 వేతనం అందిస్తారు.
తెలంగాణ GDS నోటిఫికేషన్ 2022-తరచుగా అడిగే ప్రశ్నలు
ప్ర. తెలంగాణ GDS నోటిఫికేషన్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
జ : 1226 పోస్టులు ఉన్నాయి
ప్ర. తెలంగాణ GDS నోటిఫికేషన్ 2022 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ ఎప్పుడు?
జ: 2 మే 2022
ప్ర. తెలంగాణ GDS నోటిఫికేషన్ 2022 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు?
జ: 5 జూన్ 2022
ప్ర తెలంగాణ GDS నోటిఫికేషన్ 2022 కోసం ఎంపిక ప్రక్రియ ఏమిటి?
జ: 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా.
Also check:TS Police Prohibition and Excise Constable Notification 2022
***************************************************************************************
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************
