Telugu govt jobs   »   Telugu Current Affairs   »   Telangana falling short in growth goals

Telangana falling short in growth goals, సేవా రంగం వృద్ధి రేటులో తెలంగాణా వెనుకబాటు

తిరోగమనంలో తెలంగాణ సేవా రంగం వృద్ధి రేటు: 

హైదరాబాద్‌లో గృహ నిర్మాణ రంగం వేగంగా పరుగులు తీస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2021 – 22 ఆర్థిక సర్వే వెల్లడించింది. అత్యధిక గృహ లావాదేవీలు జరుగుతున్న టాప్‌-8 నగరాల్లో హైదరాబాద్‌ ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. కానీ తెలంగాణలో సేవారంగం వృద్ధి రేటు గత మూడేళ్లుగా తగ్గుతూ వస్తున్నట్లు సర్వే తెలిపింది. 2018 – 19లో 7.91% మేర ఉన్న ఈ రంగం వార్షిక వృద్ధి రేటు 2019 – 20లో 5.69%కి తగ్గిపోయింది. 2020 – 21 నాటికల్లా అది మైనస్‌ 3.94%కి పడిపోయిందని పేర్కొంది. మరోవైపు కొవిడ్‌ ముందునాటి పరిస్థితులతో పోలిస్తే దాని రెండో దశలో భాగ్యనగరంలో ఇళ్ల ధరలు, లావాదేవీలు భారీగా పెరిగినట్లు వెల్లడించింది. ఈ విషయంలో ముంబయి, థానే, పుణె, నోయిడా, బెంగళూరుల సరసన హైదరాబాద్‌ నిలిచినట్లు తెలిపింది. ఇదే సమయంలో గాంధీనగర్, అహ్మదాబాద్, చెన్నై, రాంచీ, దిల్లీ, కోల్‌కతాల్లో మాత్రం లావాదేవీలు తగ్గినట్లు పేర్కొంది

  • హైదరాబాద్‌లో అటవీ విస్తరణ 2011తో పోలిస్తే 2021 నాటికి 146.8% వృద్ధి చెందింది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, ముంబయితో పోలిస్తే పెరుగుదల హైదరాబాద్‌లోనే ఎక్కువ నమోదైంది.
  • గ్రామీణ ప్రాంతాల్లో 100% కుటుంబాలకు తాగునీటి సౌకర్యం కల్పించిన ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచింది.
  • మెరుగైన పారిశుద్ధ్య వసతులతో కూడిన ఇళ్లలో జీవించే జనం సంఖ్య 2015 – 16 నాటి కుటుంబ ఆరోగ్య సర్వే – 4 ప్రకారం తెలంగాణలో 76.2% ఉండగా, 2019 – 21 నాటి సర్వే – 5 నాటికి ఆ సంఖ్య 52.3%కి పడిపోయింది.
  • జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే – 4 ప్రకారం రాష్ట్రంలో శిశుమరణాల రేటు 27.7 ఉండగా, సర్వే-5 నాటికి అది 26.4కి తగ్గింది. అయిదేళ్లలోపు పిల్లల మరణాల రేటు ఇదే సమయంలో 46.5 నుంచి 45.6కి తగ్గింది
  • రాష్ట్రంలో సంతాన సాఫల్యరేటు (ఒక్కో మహిళకు జన్మించే సగటు పిల్లల సంఖ్య)లో మార్పు లేదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4, 5ల్లో ఇది 1.8కి పరిమితమైంది.
  • నీతి ఆయోగ్‌ విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి 2020 – 21లో తెలంగాణ 69 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచింది.
  • నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రాం కింద తెలంగాణకు నిధులు తగ్గాయి. రాష్ట్రానికి 2019 – 20లో దీనికింద రూ.11 కోట్లు విడుదల చేయగా, 2020 – 21లో అది రూ.3 కోట్లకు తగ్గిపోయింది.
  • తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో పొగాకు పండించే రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించే ప్రయత్నం జరుగుతోంది. ఇందుకోసం వీటన్నింటికీ రూ.10 కోట్లు కేటాయించారు
  • దేశంలో వామపక్ష తీవ్రవాద ప్రభావానికి గురైన 9 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో రోడ్డు అనుసంధానత మెరుగుపరిచారు. అందులో తెలంగాణ కూడా ఉంది.

Read More: తెలంగాణా చరిత్ర PDF

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • తెలంగాణ రాష్ట్ర రాజధాని : హైదరాబాద్
  • ముఖ్యమంత్రి :  కె. చంద్రశేఖర్ రావు
  • గవర్నర్ :  తమిళిసై సౌందరరాజన్

 

1,654 ఎకరాలు ప్రభుత్వానివే మణికొండ జాగీర్‌ భూములపై సుప్రీం కోర్టు తీర్పు

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

1,654 ఎకరాలు ప్రభుత్వానివే మణికొండ జాగీర్‌ భూములపై సుప్రీం కోర్టు తీర్పు

Adda247 App for APPSC, TSPSC, Railways, SSC and Banking

Sharing is caring!