Telugu govt jobs   »   State GK   »   Telangana History

Telangana History- Telangana Armed Struggle, Download PDF | తెలంగాణ సాయుధ పోరాటం

తెలంగాణ సాయుధ పోరాటం

తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశ చరిత్రలో ఒక మరిచిపోలేని ఘట్టంగా పేర్కొనవచ్చు. ఐదేండ్లు నిరాటంకంగా సాగిన ఈ పోరాటం 1946లో ప్రారంభమై 1951, అక్టోబర్‌ 21న ముగిసింది.  తెలంగాణ భారత కమ్యూనిస్ట్‍ పార్టీలు, ఆంధ్ర మహాసభ ఈ పోరాటాన్ని నిర్వహించాయి. నాటి తెలంగాణ భూస్వాములకు, దేశ్‌ముఖ్‌లకు, జాగీర్దార్‌లకు, దేశ్‌పాండేలకు వ్యతిరేకంగా, గ్రామాల్లో వెట్టిచాకిరీ వ్యవస్థను నిర్మూలించడం, కౌలుదారులకు న్యాయపరమైన కౌలు, వ్యవసాయ కూలీలకు కూలి రేట్లు పెంచడం, పాత రుణాల రద్దు, చిన్న సన్నకారు రైతుల పంటలు భూస్వాముల పాలుకాకుండా కాపాడటం, దున్నేవాడికి భూమి ఉండాలనే నినాదంతో ఉద్యమించారు.

 

తెలంగాణ సాయుధ పోరాటానికి కారణాలు

Telangana History- Telangana Armed Struggle, Download Pdf_3.1

1) నిజాం ప్రభుత్వ ప్రతిఘాత చర్యలు

 • నిజాం “గస్తి నిషాన్-53” ద్వారా ప్రజలకు వాక్, సభా, పత్రిక స్వాతంత్ర్యాలను హరించి వేశాడు. * తెలుగు భాషలో విద్యాబోధన చేయడం ప్రారంభించిన పాఠశాల “ఆంధ్ర బాలికోన్నత పాఠశాల” (నారాయణగూడ, హైద్రాబాద్)
 • తెలుగులో బోధన చేయటంతో ఉస్మానియా యూనివర్సిటీ దీని గుర్తింపును నిరాకరించింది.

2) నిజాం హిందూ సంస్కృతి వ్యతిరేక చర్యలు:

జిల్లాలు కొత్త పేరు
1) ఎలుగందుల కరీంనగర్
2) పాలమూరు మహబూబ్ నగర్
3) ఇందూరు నిజామాబాద్
4) మెతుకు మెదక్ లుగా మార్పులు

పట్టణాల పేర్లలో కూడా మార్పు చేశారు

1) మానుకోట – మహబూబాబాద్

2) భువనగిరి భంగర్

పై విధంగా జిల్లాల పేర్లను మార్చి వాటి స్థానంలో ముస్లిం పేర్లు పెట్టడం జరిగింది.

3) వడ్డీ వ్యాపారం :

 • ఆ కాలంలో వడ్డీ వ్యాపారం “నాగువడ్డి” ప్రకారం జరిగేది. 
 • నాగువడ్డి అంటే తీసుకున్న అప్పు ఒక సంవత్సరంలో రెట్టింపు అవుతుంది. 2 సం.లలో 4 రెట్లుఅవుతుంది.

4) భూస్వామ్య వ్యవస్థ :

 • సాలార్‌జంగ్ ప్రవేశ పెట్టిన జిల్లా బంది, సర్వే సెటిల్ మెంట్ విధానాల వల్ల దివానీ ప్రాంతంలోని భూములపై శిస్తు చెల్లించి దేశ్ ముట్టు పట్టాదారులయ్యారు.
 • ఉదా: జెన్నారెడ్డి ప్రతాపరెడ్డి – 1,50,000 ఎకరాలు
 • కల్లూరు దేశ్ ముఖ్ – 1,00,000 ఎకరాలు
 • విసునూరు దేశ్ ముఖ్ – 40,000 ఎకరాలు
 • సూర్యాపేట దేశ్ ముఖ్ – 20,000 ఎకరాలు
 • దీనితో తెలంగాణ ప్రాంతంలో భూస్వామ్య వ్యవస్థ వ్యవస్థీకృతమైంది.
 • హైదరాబాద్ రాజ్య లెక్కల ప్రకారం 1901 నుండి 1941 సం|| ల మధ్య వ్యవసాయ కూలీల వృద్ధిరేటు: నల్గొండ జిల్లాలో – 473%, వరంగల్ జిల్లాలో – 234%, తెలంగాణ మొత్తంలో – 72%.
 • వీరి కాలంలో కౌలు రూపంలో పంటలో 1/2 భాగం, 2/3 వంతు కూడా వసూలు చేసేవారు.
 • అనేక రకాలుగా భూస్వాములు ప్రజలను దోచుకునేవారు.
 • పై కారణాల వల్ల రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలుదారులు భూస్వాములకు వ్యతిరేకంగాతెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.

5) వెట్టి చాకిరి :

 • వెట్టి చేసేవారిలో దళితులు అధికంగా ఉండేవారు.
 • మాలలు గ్రామసేవకులుగా (నీరటి,తలారి, మస్కూరు) గా పనిచేసేవారు. 
 • పటేల్ వ్యవస్థలో మాలలు వార్తలు మోయడానికి ఉపయోగపడేవారు.
 • మాదిగలు దొరలకు తోలు పనిముట్లను సమకూర్చేవారు. 
 • పల్లకిలు, మేనాలు మోయడానికి బోయ, బెస్త కులస్థులు ఉండేవారు. ” 
 • నిజాం ప్రభుత్వాధికారులు గ్రామాలను సందర్శించినపుడు చావడిని శుభ్రం చేయడానికి మరియు వారికి ఆహారాన్ని అందించడానికి మంగలి కులస్తులు ఉండేవారు.
 • ఈ విధంగా నిజాం కాలంలో అనేక రకాలైన వెట్టి ఉండేది.
 • సుద్దాల హనుమంతు పెట్టి విధానంపై ” వెట్టి చాకిరి విధానమేమీ రైతన్న” అనే పాటను రాశాడు.

6) రైతులపై ప్రభుత్వ లెవీ : 

 • రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఆహార కొరతను నివారించేందుకు రైతులపై 1943లో నిజాం ప్రభుత్వం లెవి విధానంను ప్రవేశపెట్టింది.
 • నిజాం ప్రభుత్వం 2 రకాల లెవీ పద్ధతులను అమలుపరిచింది.
 • 1) గల్లా లెవీ :ఈ విధానంలో ప్రతి రైతు ఎకర పొలానికి 20 షేర్ల ధాన్యాన్ని పన్ను రూపంలో చెల్లించాలి.
 • 2) ఖుషిగల్లా : ఈ విధానంలో రైతు తన ఇష్టం ప్రకారం ఎంత ధాన్యాన్నైనా చెల్లించవచ్చు.
 • ఈ “లెవీ” పద్దతిలో ప్రతి రైతు తాను పండించిన వరి ధాన్యంలో కొంత భాగాన్ని ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు ప్రభుత్వానికే అమ్మాలి.
 • లెవీ విధానం ప్రకారం రైతులు వాణిజ్య పంటలు పండించరాదు.
 • లెవీ విధానం ప్రకారం రైతులు ధాన్యంను నిలువ ఉంచుకోవడానికి వీలులేదు.
 • ఈ లెవీ ధాన్యానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ఉద్యమాలు-అకునూరు, మాచిరెడ్డి పల్లి ఉద్యమాలు.

7)రాజకీయ పాఠశాలలు :

 • కంకిపాడు (కృష్ణా జిల్లా)లో – రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, హనుమయ్యలకు ఎన్.జి.రంగా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలపై శిక్షణ ఇచ్చాడు.
 • జగిత్యాల (కరీంనగర్)పాఠశాల: అళ్వార్ స్వామి, దేవులపల్లి వెంకటేశ్వరరాలకు సుందరయ్య ,చండ్రా రాజేశ్వర్రావులు శిక్షణ ఇచ్చారు.
 • పై కారణాల చేత రైతులు, హిందూ సంప్రదాయవాదులు, కార్మికులు, కూలీల వంటి అనేక వరాల ప్రజలు తెలంగాణ సాయుధ పోరాటంలో పాలు పంచుకోవడం జరిగింది.
 • సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిలో 90% నిరక్షరాస్యులు. వీరిలో అధికశాతం రైతులున్నారు, మరియు కొద్ది శాతంలో ఇతర వర్గాల వారు కూడా ఉన్నారు.
 • 1940లో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి కమ్యూనిస్ట్ పార్టీని హైద్రాబాద్ లో స్థాపించారు.

మొదటి దశ (1940-46) (కమ్యూనిస్టులు బలపడటం)

 • 1941లో చిలుకూరు సభకు రావినారాయణరెడ్డి అధ్యక్షత వహించారు.
 • ఆంధ్ర కమ్యూనిస్ట్ నాయకుడైన చండ్రా రాజేశ్వరరావ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్ర మహాసభ పూర్తిగా కమ్యూనిస్ట్ చేతిలోకి వెళ్ళింది.
 • ఈ సభ తర్వాత వరంగల్, నల్గొండ జిల్లాలలోని గ్రామాలలో శాఖలు ఏర్పడ్డాయి.
 • ఈ శాఖలనే “సంఘాలు” అంటారు. ఈ సంఘాలు రైతులను చైతన్య వంతుల్ని చేసింది.
 • కమ్యూనిస్ట్ సాంస్కృతిక సంస్థ “ప్రజా నాట్యమండలి” బుర్రకథల ద్వారా తమ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడంతో వీరు బలపడ్డారు.
 • సరిగ్గా ఇదే సమయంలో భారదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.
 • నిజాం ప్రభుత్వం తన దృష్టిని హైద్రాబాద్ సంస్థానం ఒక స్వతంత్ర్య రాజ్యంగా స్థాపించడంపై పెట్టింది.
 • సహజంగానే రాష్ట్రంలోని గ్రామాల్లో తలెత్తుతున్న తిరుగుబాట్ల గురించి పట్టించుకోలేదు.
 • ఈ పరిస్థితులను చక్కగా ఉపయోగించుకోవడంతో కమ్యూనిస్టు తెలంగాణలో బలపడ్డారు.

రెండవ దశ (1946-1947)

 

 • ఈ దశలో జమీందార్లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం ప్రారంభం అయ్యింది.. 
 • మల్లెంపల్లి మత్తెదారు దగ్గర కొంత భూమిని కౌలుకు తీసుకుని చాకలి ఐలమ్మ సాగుచేసేది.
 • విసునూర్ రాంచంద్రారెడ్డి గుండాలు పాలకుర్తి గ్రామానికి చెందిన ఐలమ్మ పంటను ఆక్రమించుకొనుటకు ప్రయత్నించారు.
 • కడివెండి, దేవరకుప్పల గ్రామానికి చెందిన సంఘ సభ్యులు పాలకుర్తి చేరుకొని గుండాలను తరిమికొట్టారు
 • ఈ తిరుగుబాటులో చాకలి ఐలమ్మకు సహకరించిన ఆంధ్రమహాసభ నాయకులు – ఆరుట్ల రామచంద్రారెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి, చకిలం యాదగిరిరావు.
 • ఈ సంఘటన తెలంగాణలో హింసాయుత తిరుగుబాట్లకు నాంది పలికింది.
 • అటువంటి సమయంలో లెవీ ధాన్య వసూళ్ళకు వ్యతిరేకంగా అకునూరు, మాచిరెడ్డిపల్లి దేశ్ ముఖ్ లకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాగించిన ఉద్యమం మహాత్మగాంధి దృష్టిని సైతం ఆకర్షించాయి.

మూడవ దశ (1947-1948 సెప్టెంబర్ 7)

 • 1947 జూన్ 12న నిజాం ఉస్మాన్ అలీఖాన్ తాను సర్వ స్వతంత్రుడని ప్రకటించుకున్నాడు.

సాయుధ పోరాట ప్రకటన: 

 • సాయుధ పోరాటానికి అధికారికంగా పిలుపునిచ్చిన రోజు – సెప్టెంబర్ 11, 1947.
 • సాయుధ పోరాట ప్రకటన చేసిన కమ్యూనిస్టు నాయకులు –
 • 1. బద్దం ఎల్లారెడ్డి (తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి)
 • 2. రావి నారాయణ రెడ్డి (ఆంధ్ర మహాసభ కార్యదర్శి)
 • 3. ముఖ్దుం మొయినుద్దీన్ (కామ్రేడ్ అసోషియేషన్)
 • దీని తర్వాత కమ్యూనిస్టు ఆంధ్రమహాసభను వదిలి పెట్టి కమ్యూనిస్ట్ పార్టీ పేరుతోనే తిరుగుబాటు ప్రారంభించారు.
 • జెన్నారెడ్డి ప్రతాపరెడ్డి నిరంకుశత్వం పై బండియాదగిరి “బండెనక బండి కట్టి” అనే పాటను రచించాడు.

నాలుగవ దశ (1948 సెప్టెంబర్ 17 నుండి 1951 అక్టోబర్ 21 వరకు)

 • “ఆపరేషన్ పోలో” అనంతరం సాయుధ పోరాటాన్ని భారత యూనియన్ కు వ్యతిరేకంగా కొనసాగించవలెనని కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి “రణదివే” ప్రకటన చేశాడు.
 • వల్లభాయ్ పటేల్ హైద్రాబాద్ లో పర్యటించి తెలంగాణ గడ్డపై ఒక్క కమ్యూనిస్ట్ ని కూడా ఉండనివ్వనని పేర్కొన్నాడు.
 • మిలట్ర ప్రభుత్వం ఈ కమ్యూనిస్టులను అణచడానికి బ్రిగ్స్ ప్రణాళికను అమలు చేసింది.

బ్రిగ్స్ ప్రణాళిక:

 •  ఈ బ్రిగ్స్ ప్రణాళిక నంజప్ప అనే అధికారి ఆధ్వర్యంలో కొనసాగింది.
 • సాయుధ పోరాటం కొనసాగించడమా, ఆపడమా అని మాస్కో వెళ్ళిన కమ్యూనిస్టు బృంద సభ్యులు :
 • అజయ్ ఘోష్ , చండూరు రాజేశ్వరరావు ,డాంగే, మాకినేని బసవపున్నయ్య
 • రష్యా ప్రతినిధి బృంద నాయకుడు స్టాలిన్ సలహాతో 1951 అక్టోబర్ 21న కమ్యూనిస్టు తమ సాయుధ పోరాటాన్ని విరమించాయి. దీంతో కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధాన్ని ఎత్తివేశారు.
 • 1952 సాధారణ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలోని 14 నియోజక వర్గాల్లో కమ్యూనిస్ట్ గెలిచారు.

సాయుధ పోరాటం అణచివేత క్రమంలో జరిగిన హింసాత్మక సంఘటనలు

ఆకునూరు సంఘటన

 • పోలీసులు, అధికారులు కలిసి వచ్చి ఆకునూరు ప్రజల నుండి లెవిగల్లా పేరుతో బలవంతంగా ఉన్న కొంతధాన్యమును దోచుకోసాగారు.
 • ఉన్న కొద్దిపాటి ధాన్యమును దోచుకునే సరికి ప్రజలు సహనం కోల్పోయి గిర్దావరను, ఎస్.ఐను పట్టుకొని మిగితా అధికారులను తరిమి కొట్టారు.
 • ఎడ్లబండి ముందు ఎస్.ఐ ను, గిర్దావరను పరుగెత్తించి, బరువులను ఎత్తించి ప్రజల కష్టాలు వీరికి తెలియవచ్చేటట్లు చేశారు.
 • గిర్దావరకు, ఎస్.ఐ కు ఈ శిక్షను విధించడంలో ముఖ్యపాత్ర పోషించిన వారు – సీతల్ సింగ్.
 • ఇక్కడ నుండి గిర్దావర్, ఎస్.ఐ లను వదిలివేసిన తరువాత వారు పెద్దమొత్తంలో సాయుధ పోలీసు బలగాలతో వచ్చి ఆకునూరు ప్రజలపై అనేక ఆకృత్యాలకు పాల్పడ్డారు.
 • గిర్దావర్, ఎస్.ఐ కు శిక్ష విధించినందుకు సీతల్ సింగ్ ను అరెస్టు చేసి 2 సం.లు జైలు శిక్ష విధించారు.

మాచిరెడ్డిపల్లి సంఘటన

 • ఈ గ్రామంలో లెవీ ధాన్యం వసూలు చేయడానికి వచ్చిన తహసీల్దార్ జా మొహినుద్దీన్ పై ప్రజలు తిరుగుబాటు చేశారు.
 • దానితో తహసీల్దార్ పెద్ద మొత్తంలో పోలీసు బలగాలతో వచ్చి ప్రజలను హింసిస్తూ, స్త్రీలను మానభంగాలు చేస్తూ పైశాచిక ఆనందం పొందారు.
 • నిజాం ప్రభుత్వం యొక్క ఈ దుర్మార్గాలను ప్రపంచాన్ని తెలియజేయాలని ముంబాయిలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి రావి నారాయణ రెడ్డి గారు ఈ దుర్మార్గాలను వెల్లడించారు.
 • ఆకునూరు, మాచిరెడ్డిపల్లి దుర్మార్గాల గురించి ప్రచురించిన పత్రిక – ప్రీ ప్రెస్ జర్నల్.
 • ఈ ఆకునూరు, మాచిరెడ్డిపల్లి దుర్మార్గాల గురించి గాంధీజికు నివేదిక అందించినది – పద్మజా నాయుడు
 • ఈ సంఘటనలపై గాంధీజీ హైద్రాబాద్ ప్రధాని సర్ అక్బర్ హైదరీకి లేఖ రాయగా సర్ అక్బర్ హైదరీ ఈ ఘటనలపై విచారణ సంఘంను నియమించాడు.
 • ఈ సంఘటనలపై “ఆకునూరు, మాచిరెడ్డిపల్లి దురంతాలు’ అనే పుస్తకంను రచించినవారు దేవులపల్లి వెంకటేశ్వరరావు
 • 1946 అక్టోబర్ లో నిజాం ప్రభుత్వం కమ్యూనిస్ట్ లపై ఆకస్మిక దాడులు చేసింది.
 • ఈ దాడులలో వి. అళ్వార్ స్వామి అరెస్ట్ చేయబడ్డాడు.
 • 1946 అక్టోబర్ లో కమ్యూనిస్ట్ దాడులను అరికట్టేందుకు నిజాం ప్రభుత్వం వరంగల్, నల్గొండలలో సైనిక శిబిరాలు ఏర్పాటు చేసింది.
 • అప్పుడు కమ్యూనిస్టు తమ ప్రధాన కేంద్రాన్ని “విజయవాడ” స్టాలిన్ గ్రాడ్ కు తరలించారు.
 • అప్పట్లో విజయవాడను “స్టాలిన్ గ్రాడ్” గా పిలిచేవారు.
 • ఎందుకంటే విజయవాడ నుండి ఆయుధాల్ని, ఆయుధ సామాగ్రిని సేకరించేవారు. కావున “స్టాలిన్ ఆ గ్రాడ్” అన్నారు.
 • 1946 నవంబర్ లో నిజాం ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం విధించింది.

బైరాన్‌పల్లి సంఘటన

 • పెద్దమొత్తంలో రజాకార్లు, సైనికులు భైరాన్‌పల్లిని చుట్టుముట్టారు.
 • ద్రోహి అయిన స్థానిక భూస్వామి ఆ గ్రామ ప్రజలందరిని ఒక చోటకు చేర్చి రజాకార్లకు అప్పజెప్పాడు.
 • దాంతో రజాకార్లు 88 మంది ఆ గ్రామ ప్రజలను నిలబెట్టి కాల్చి చంపారు.
 • ఈ నరమేధంలో స్వయంగా నల్గొండ జిల్లా కలెక్టరు (మొహజం హుస్సేన్), డిప్యూటీ కలెక్టర్ (ఇక్బాల్హషిం) పాల్గొన్నారు.
 • భైరాన్‌పల్లి స్థానిక దళ నాయకుడు – ఇమ్మడి రాజిరెడ్డి.
 • ఈ భైరాన్‌పల్లి దురంతంపై కాళోజీ రాసిన గేయం – ‘కాలంబు రాగానే కాటేసితీరాలె’.
 • భైరాన్ పల్లిలో వీరమరణం పొందినవారి పేర్లను చెక్కిన స్థూపాన్ని 2003లో ఏర్పాటు చేశారు.

గుండ్రాంపల్లి సంఘటన

 • గుండ్రాంపల్లి ప్రాంత రజాకార్ నాయకుడు – ‘సైదీ మెయిల్’. 
 • ఈయన నాయకత్వాన సాయుధులైన రజాకార్లు గుండ్రాంపల్లిపై దాడిచేసి ప్రజలను నీరు లేని బావిలో వేసి సామూహిక దహనం చేశారు.
 • ఈ విషయాలు తెలిసిన సర్దార్ పటేల్ గారు హైద్రాబాద్ సంస్థానంలో అంత అరాచకం జరుగుతుంటే భారత ప్రభుత్వం సహించజాలదని పార్లమెంట్ లో ప్రకటించాడు.
 • నిజాం ఒకవైపు దౌర్జన్యం సాగిస్తూ మరోవైపు తన ప్రధాని “చతారి నవాబు” ద్వారా ఇండియన్ యూనియన్‌తో సంధి రాయబారం సాగించాడు.
 • “1947 నవంబర్ 29”న నిజాం ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వంతో యధాతథ ఒప్పందం (Stand still) కుదుర్చుకున్నాడు.
 • ‘ఆపరేషన్ పోలో” తర్వాత 1948 సెప్టెంబర్ 17న నిజాం సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయ్యింది.
 • కమ్యూనిస్ట్ దాడుల వలన దాదాపు 4000 గ్రామాల్లో నిజాం ప్రభుత్వం నామరూపాల్లేకుండా పోయింది.

సాయుధ పోరాటం-మహిళలు

Telangana History- Telangana Armed Struggle, Download Pdf_4.1

 • మల్లారెడ్డి గూడెంలో దళిత మహిళలైన గురువమ్మ, తొండమ్మ, నాగమ్మలు నిజాం సైన్యానికి ఎదురుతిరిగి తెలంగాణ సాయుధ పోరాటంలో మరణించిన తొలి దళిత మహిళలయ్యారు.
 • ఆరుట్ల కమలాదేవి, మల్లుస్వరాజ్యం సాయుధ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారు.
 • విసునూర్ దేశ్ ముఖ్ కు వ్యతిరేకంగా మంగ్లి (ధర్మాపురానికి చెందిన) అనే లంబాడి మహిళ పోరాడి జైలుపాలయింది.

తెలంగాణ విమోచనోద్యమ నేపథ్యంలో వెలువడిన గ్రంథాలు

 

 1. వీర తెలంగాణ విప్లవ పోరాటం – చండ్ర పుల్లారెడ్డి
 2. వీర తెలంగాణ విప్లవ పోరాటం – పుచ్చలపల్లి సుందరయ్య
 3. వీర తెలంగాణ – నా అనుభవాలు, జ్ఞాపకాలు – రావి నారాయణ రెడ్డి 
 4. నా జీవన పథంలో – రావి నారాయణరెడ్డి
 5. తెలంగాణ పోరాట స్మృతులు – ఆరుట్ల రామచంద్రారెడ్డి
 6. తెలంగాణ పోరాటం – నా అనుభవాలు – నల్లా నర్సింలు

తెలంగాణ సాయుధ పోరాటం PDF

 

తెలంగాణ చరిత్ర ఆర్టికల్స్ 

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

Who wrote history of Telangana armed struggle?

Devulapalli Venkateshwara Rao Wrote Telangana People's Armed Struggle History

What was the reason for the armed struggle in Telangana?

Against the Telangana Landlords, Deshmukhs, Jagirdars and Deshpandes, they moved with the slogan of abolishing the vettichakiri system in the villages, increasing the legal rent for the tenants, increasing the wage rates for the agricultural labourers, canceling the old loans, protecting the crops of the small farmers from the share of the landlords, and ensuring that the tiller has land.