Telangana Approved 1,890 Staff Nurse Posts | తెలంగాణలో మరో 1,890 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీ చేయనున్నారు : తెలంగాణలో మరో 1,890 స్టాఫ్‌నర్స్‌ల పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది డిసెంబరు 30న 5,204 స్టాఫ్‌నర్స్‌ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా, దానికి మరో 1,890 పోస్టులను కలిపి మొత్తం 7,094 పోస్టులను రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక మండలి ద్వారా భర్తీ చేసేందుకు అనుమతినిచ్చింది.
తాజా నిర్ణయం మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్ పరిధిలో, వైద్యవిద్యాసంచాలక పరిధిలో 5,650 పోస్టులు, వైద్యవిధాన పరిషత్ పరిధిలో 757 పోస్టులు, ఎంఎన్‌జే ప్రాంతీయ క్యాన్సర్ ఆసుపత్రిలో 81, దివ్యాంగుల సంక్షేమశాఖ పరిధిలో 8, మైనారిటీ గురుకుల విద్యాలయాల సంస్థలో 127, బీసీ గురుకుల సంస్థ పరిధిలో 260, గిరిజన గురుకుల సంస్థ పరిధిలో 74, ఎస్సీ గురుకుల సంస్థ పరిధిలో 124, తెలంగాణ గురుకుల సంస్థ పరిధిలో 13 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నట్లు బోర్డు తెలిపింది. మొత్తం పోస్టుల్లో మూడో వంతు మహిళలతో భర్తీ చేస్తామని పేర్కొంది.
తెలంగాణ స్టాఫ్ నర్స్ ఫలితాలు 2023 విడుదల
శాఖల వారీగా మొత్తం పోస్టులు
శాఖ |
పోస్టులు |
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్, వైద్యవిద్యాసంచాలక పరిధిలో |
5,650 పోస్టులు |
వైద్యవిధాన పరిషత్ పరిధిలో |
757 పోస్టులు |
ఎంఎన్‌జే ప్రాంతీయ క్యాన్సర్ ఆసుపత్రిలో |
81 పోస్టులు |
దివ్యాంగుల సంక్షేమశాఖ పరిధిలో |
8 పోస్టులు |
మైనారిటీ గురుకుల విద్యాలయాల పరిధిలో |
127 పోస్టులు |
బీసీ గురుకుల సంస్థ పరిధిలో |
260 పోస్టులు |
గిరిజన గురుకుల సంస్థ పరిధిలో |
74 పోస్టులు |
ఎస్సీ గురుకుల సంస్థ పరిధిలో |
124 పోస్టులు |
తెలంగాణ గురుకుల సంస్థ పరిధిలో |
13 పోస్టులు |
జోన్ల వారీగా పోస్టుల వివరాలు
జోన్ |
పోస్టులు |
జోన్ 1 |
937 పోస్టులు |
జోన్ 2 |
1044 పోస్టులు |
జోన్ 3 |
1023 పోస్టులు |
జోన్ 4 |
719 పోస్టులు |
జోన్ 5 |
1305 పోస్టులు |
జోన్ 6 |
948 పోస్టులు |
కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు
కేటగిరీ |
పోస్టులు |
OBC |
2110 |
EWBS |
653 |
BC (A) |
612 |
BC (B) |
686 |
BC (C) |
81 |
BC (D) |
466 |
BC (E) |
330 |
SC |
1041 |
ST |
690 |
స్పోర్ట్స్ కోటా |
114 |
దివ్యాంగుల కోటా |
311 |
Sharing is caring!