మే 8న ప్రముఖ రచయిత తాపీ ధర్మారావు గారి వర్ధంతి
తాపీ ధర్మారావు సెప్టెంబరు 19, 1887న ప్రస్తుత ఒడిశాలోని వూరు (బరంపురం)లో తెలుగు కుటుంబంలో జన్మిచారు. ధర్మారావు తల్లి పేరు నరసమ్మ, తండ్రి పేరు అప్పన్న, అసలు వీరి ఇంటి పేరు బండి లేదా బండారు కావచ్చు. ఈయన ప్రాథమిక విద్యను శ్రీకాకుళంలో మెట్రిక్యులేషన్ విజయవాడలో, వర్లాకిమిడిలో ఎఫ్.ఎ. వరకు చదువుకొని మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో పూర్తి చేరారు.అప్పన్న తాత లక్ష్మయ్య కొంతకాలం మిలిటరీలో పనిచేశారు, తరువాత తాపీ పనిలో మంచి పేరు తెచ్చుకొన్నాడు. అలా అతనికి శ్రీకాకుళంలో “తాపి లక్ష్మయ్యగారు’ అన్న పేరు స్థిరపడిపోయింది. ధర్మారావు స్వయంగా కల్లికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేశారు.తాతాజీ చలనచిత్ర రంగంలో కూడా తన ముద్ర వేశారు. ఈయన మాలవల్ల, రైతుబిడ్డ మొదలైన సినిమాలకు సంభాషణలు రాశారు.
1919 ప్రాంతంలో ధర్మారావు కొంత మంది మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథాలను స్థాపించారు, దానికి 1911లో ఆంధ్రులకొక మానవి అని పేరు పెట్టారు.కాగడ వంటి వార్తాపత్రికలు ఆయన ప్రతిభకు నిదర్శనం. ‘మాలపిల్ల’, ‘రైతుబిడ్డ’, ‘ఇల్లాలు’, ‘రోజులు మారాయి’, ‘కీలు గుర్రం’, ‘పల్లెటూరి పిల్ల’, ‘కృష్ణ ‘ప్రేమ’, ‘పరమానందయ్య శిష్యుల కథ’ వంటి సినిమాలకు సంభాషణలు రాశారు. చాలా కాలం పాటు మద్రాసులో ఉండి తర్వాత హైదరాబాదులో స్థిరపడ్డారు. ఎగ్జిమా, ఆస్తమా వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 1973 మే 8న హైదరాబాదులోని కుమారుడి ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 న “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపుకుంటారు.
తాపీ ధర్మారావు రాసిన రచనలు:
ఆంధ్రులకొక మనవి, దేవాలయాల పై బూతుబొమ్మలు ఎందుకు? 1936 , పెళ్ళి దానిపుట్టుపూర్వర్ణోత్తరాలు 1960,ఇనుపకచ్చడాలు, సాహిత్య మొర్మొరాలు, రాలూ రప్పలూ, మబ్బు తెరలు, పాతపాళీ, కొత్తపాళీ, ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ , విజయవిలాసం వ్యాఖ్య, అక్షరశారద ప్రశంస, హృదయోల్లాసము, భావప్రకాలిక , నల్లిపై కారుణ్యము, విలాసార్జునీయము, ఘంటాన్యాయము, అనా కెరినీనా , ద్యోయానము, భిక్షాపాత్రము, ఆంధ్ర తేజము, తప్తాశ్రుకణమ వంటి రచనలు అయన వ్రాశారు.
మరింత చదవండి |
|
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |