Sustainable Urban Planning in India :
India is one of the fastest growing economies in the world. Urbanization is happening very fast in India, it was slow during covid-19 phase but will accelerate again later. According to the 2011 census, 31 percent of India’s population lives in urban areas. By 2050, India’s urban population is expected to become 50 percent of India’s Population. Therefore, urban planning plays an important role in urban in development.
Sustainable Urban Planning in India | భారత దేశంలో స్థిరమైన పట్టణ ప్రణాళిక
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటి. పట్టణీకరణ అనేది భారత దేశంలో చాలా వేగంగా జరుగుతుంది. కోవిడ్ -19 దశలో మెల్లగా అయినప్పటికీ తరువాత మళ్ళీ వేగవంతం అవుతుంది. 2011 జనాభా గణన ప్రకారం భారతదేశ జనాభాలో 31 శాతం జనాభా పట్టణాలలో నివసిస్తున్నారు 2050 నాటికి భారత దేశ పట్టణ జనాభా , భారత దేశ జనాభాలో 50 శాతం గా మారుతుందని అంచనా వేస్తున్నారు. అందువలన పట్టణ అభివృద్ది లో పట్టణ ప్రణాళికా అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
What is sustainable urban planning? స్థిరమైన పట్టణ ప్రణాళికా అంటే ఏమిటి?
స్థిరమైన పట్టణ ప్రణాళిక అనేది భౌతిక ప్రణాళికలు మరియు అభివృద్ధి నిబంధనలను రూపొందించడం ద్వారా పర్యావరణానికి ఏ విధమైన హాని కలుగజేయకుండా పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వృత్తిపరమైన మార్గం మరియు ఒక పట్టణంలో నివసించడానికి, పని చేయడానికి మరియు చుట్టూ తిరగడానికి, మంచి ఆరోగ్యకరమైన ప్రదేశంగా మార్చడానికి పట్టణ ప్రణాళికా అనేది ఉపయోగపడుతుంది.

Problems in urban planning | పట్టణ ప్రణాళికా లో సమస్యలు
Slums | మురికివాడలు :
పట్టణ ప్రాంతాలు అధిక జీవన వ్యయం కలిగి ఉంటాయి కాని గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వెళ్లే చాలా మంది ప్రజలు అలాంటి జీవనాన్ని భరించే స్థితిలో లేరు. ఈ పరిస్థితిలో వలసదారులు సురక్షితమైన ప్రదేశాలలో ఎక్కువ ఖర్చు చేయలేక మురికివాడలలో నివసిస్తున్నారు. దీని వలన మురికివాడలు పెరుగుతున్నాయి. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, భారతదేశంలోని మురికివాడలలో నివసిస్తున్న జనాభా మొత్తం పట్టణ జనాభాలో 35%గా నివేదించబడింది. ముంబైలోని ధారవి ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పరిగణించబడుతుంది.
Sewage Problems |మురుగునీటి సమస్యలు:
వేగవంతమైన పట్టణీకరణ నగరాలలో సరైన ప్రణాళికా లేక అస్థిరమైన వృద్ధికి దారి తీస్తుంది, దీని వలన నగరాల్లో చాలా వరకు ప్రజలు మురుగునీటి సౌకర్యాలతో ఇబ్బంది పడుతున్నారు. చాలా నగరాల్లో మురుగు వ్యర్థాలను శుద్ధి చేసేందుకు సరైన ఏర్పాట్లు లేవు. భారత దేశ ప్రభుత్వ లెక్కల ప్రకారం, భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన మురుగునీటిలో దాదాపు 75 శాతం శుద్ధి చేయబడదు మరియు నదులు, సరస్సులు లేదా సముద్రంలోకి చేరుతుంది.
Urban Floods |పట్టణ వరదలు:
పట్టణాలలో లోతట్టు ప్రాంతాలలో వరదలు ఎక్కువగా సంభవిస్తున్నాయి, మొత్తం నేలలు సిమెంట్ మరియు కాంక్రీటుతో ఉండటం వల్ల తక్కువ వర్షం కురిసిన కూడా నీరు కూడా రోడ్ల మీద ప్రవహిస్తుంది. సహజ నీటి పారుదల వ్యవస్థలు తక్కువ ప్రభావవంతంగా మారాయి, ఫలితంగా పట్టణ వరదలు ఏర్పడుతున్నాయి.ఘన పదార్ధ వ్యర్ధాలు మేనేజ్‌మెంట్ చేయలేకపోవడం వల్ల తుఫాను నీటిని ఈ వ్యర్ధ పదార్ధాలు అడ్డుకోవడం వల్ల వరదలు మరియు నీటి ఎద్దడికి దోహదం చేస్తుంది.
Transport Facilities | రవాణా వసతులు :
సామాజిక హోదా పేరుతో ప్రజలు ప్రైవేట్ రవాణాను ఎక్కువగా ఉపయోగించేందుకు ఇష్టపడతారు. ప్రతీ ఒక్కరూ సొంత వాహనాలు ఉపయోగించడం వల్ల రోడ్ల రద్దీ, కాలుష్యం మరియు నగరాల్లో ప్రయాణ సమయం పెరిగింది. వాహనాలు పెరగడం వల్ల ఇంధనాల వాడకం కూడా పెరిగింది.
Environmental Degradation | పర్యావరణ క్షీణత :
పర్యావరణ క్షీణతకు ప్రధాన కారణాలలో పట్టణీకరణ ఒకటి. పరిమిత ప్రదేశాల్లో ప్రజల రద్దీ గాలి నాణ్యతను తగ్గిస్తుంది మరియు నీటిని కలుషితం చేస్తుంది. భవనాలు మరియు కర్మాగారాల నిర్మాణం కోసం అడవులు మరియు వ్యవసాయ భూమిని నాశనం చేయడం వల్ల భూమి నాణ్యత క్షీణిస్తుంది. గృహ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు మరియు ఇతర వ్యర్థాలు నేరుగా నదులలోకి చేరడం వల్ల నీటి నాణ్యత క్షీణిస్తుంది.
Government Initiatives | ప్రభుత్వ కార్యక్రమాలు
- అటల్ మిషన్ ఫర్ అర్బన్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్)
- క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ 2.0
- TULIP – ది అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్
- ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (PMAY-U)
Sustainable Urban Planning in India FAQs | భారత దేశంలో స్థిరమైన పట్టణ ప్రణాళిక – తరచుగా అడిగే ప్రశ్నలు
ప్ర. స్థిరమైన పట్టణ ప్రణాళిక యొక్క కొన్ని ప్రయోజనాలు ఏమిటి?
జ. శబ్దం, ట్రాఫిక్, రద్దీగా ఉండే ప్రజా రవాణా మీద ఒత్తిడి తగ్గింపు, కాలుష్యం తగ్గింపు, జీవవైవిధ్యంలో విద్య.
ప్ర. స్థిరమైన పట్టణాభివృద్ధికి ఉదాహరణ ఏమిటి?
జ. దుబాయి నగరం స్థిరమైన పట్టణాభివృద్ధికి ఉదాహరణ.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |