Telugu govt jobs   »   SSC నూతన వెబ్ సైటు మరియు రిజిస్ట్రేషన్...

SSC కొత్త వెబ్ సైటు URL మరియు రిజిస్ట్రేషన్ విధానం తనిఖీ చేయండి.

SSC పరీక్షలకి సన్నద్దమయ్యే అభ్యర్థులకు ఒక ముఖ్యమైన వార్త! స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మీకు మరింత మెరుగైన వినియోగదారు అనుభవాన్ని అందించడానికి దాని నూతన వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. మునుపటి https://ssc.nic.in/ URL స్థానంలో కొత్త వెబ్‌సైట్‌ను ఇప్పుడు https://ssc.gov.in/ని అందుబాటులోకి తీసుకుని వచ్చింది. రాబోయే రోజుల్లో SSC నోటిఫికేషన్ లు అన్నీ ఈ వెబ్ సైటు ద్వారానే అప్లై చేసుకోవాలి కావున అభ్యర్ధులు SSC నూతన వెబ్ సైటు మరియు రిజిస్ట్రేషన్ విధానం గురించి తప్పనిసరిగా అవగాహ ఉండాలి. ఈ కధనం లో SSC నూతన వెబ్ సైటు మరియు దాని రిజిస్ట్రేషన్ కి సంభందించిన వివరాలు అందించాము తనిఖీ చేయండి.

Adda247 APP
Adda247 APP

SSC కొత్త వెబ్ సైటు URL

SSC నూతన వెబ్‌సైట్ URL లేదా లింకు https://ssc.gov.inని బుక్ మార్క్ చేసుకోండి లేదా తప్పనిసరిగా గుర్తి పెట్టుకోండి. SSC నూతన వెబ్‌సైట్ యొక్క హోమ్ పేజీ ఈ దిగువన చూపించిన విధంగా ఉంటుంది. తప్పుడు లేదా ఇతర నకిలీ వెబ్ సైటు బారిన పడకుండా అభ్యర్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

SSC New Official Website, Check ssc.gov.in_30.1

కొత్త SSC వెబ్‌సైట్ ఫీచర్లు:-
కొత్త SSSC వెబ్‌సైట్లో  అధికారికంగా చేసిన నవీకరణలు మరియు ఫీచర్లు గురించిన పూర్తి వివరాలు ఇక్కడ అందించాము:

  • యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్: కొత్త వెబ్‌సైట్ మరింత యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్తో ఉంటుంది, ఇక్కడ మీకు అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవడం మరియు కనుగొనడం సులభంగా ఉంటుంది.
  • కొత్త URL: SSC నుండి తాజా అప్ డేట్ లు మరియు ప్రకటనల గురించి తెలుసుకోడానికి కొత్త URL, https://ssc.gov.in/ని తప్పనిసరిగా బుక్ మార్క్ చేసుకోండి.
  • సమర్థవంతమైన నావిగేషన్: వెబ్సైట్లో మెరుగైన నావిగేషన్ ఫీచర్ అందుబాటులో ఉంది తద్వారా, మీరు వెతుకుతున్నఅంశాల్ని సులభంగా గుర్తించవచ్చు.
  • మొబైల్ ఫ్రెండ్లీ: మీరు మీ కంప్యూటర్ లేదా మొబైల్ పరికరం నుండి SSC అధికారిక సైట్ ను తనిఖీ చేస్తున్నప్పటికీ, కొత్త SSC వెబ్ సైట్ అన్నీ పరికారాల్లోనూ అంతరాయం లేని అనుభవం కోసం ఆప్టిమైజ్ చేయబడింది. తాజా నోటిఫికేషన్లు, పరీక్ష షెడ్యూల్స్, ఇతర ముఖ్యమైన ప్రకటనలను నూతన వెబ్ సైటు లో సులువుగా కనుగొనవచ్చు.

 

SSC New Official Website, Check ssc.gov.in_40.1

ముఖ్యమైన సమాచారం: పరీక్ష నోటిఫికేషన్‌ల నుండి ఫలితాల ప్రకటనల వరకు, వెబ్‌సైట్ SSC పరీక్షలకు సంబంధించిన అన్ని కీలకమైన సమాచారాన్ని త్వరగా యాక్సెస్ చేసేందుకు వీలుగా ఉంటుంది. ఈ దిగువన తెలిపిన విధంగా అన్నీ నూతన మరియు ముఖ్య సమాచారాలు సులువుగా తెలుసుకోగలరు.

SSC New Official Website, Check ssc.gov.in_50.1

పరీక్షలని తనిఖీ చేయండి: ఇప్పుడు మీరు నిర్దిష్ట పరీక్షకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని నూతన వెబ్ సైటు లో సులభంగా తనిఖీ చేయవచ్చు. ఈ దిగువన తెలిపిన విధంగా పరీక్షల వారీగా పూర్తి వివరాలు తెలుసుకొన వచ్చు. పాత వెబ్ సైటు తో పోలిస్తే ఈ విషయంలో కొత్త వెబ్ సైటులో మరింత సులువుగా సమాచారం తెలుసుకోవచ్చు.

SSC New Official Website, Check ssc.gov.in_60.1

పరీక్షా విధానం: పైన మెనూ బార్‌లో, “ఫర్ కాండిడేట్స్”పై క్లిక్ చేసి, ఆపై మీకు కావాల్సిన పరీక్షా విధానాన్ని ఎంచుకోవాలి. ఇక్కడ మీరు అన్ని SSC పరీక్షల కోసం పరీక్ష నమూనాను పొందగలరు. ఈ చర్య వలన వివిధ పరీక్షల విధానాలని తెలుసుకుని ముందుగానే సన్నద్దమవ్వడానికి ప్రణాళిక రచించుకోవచ్చు.

SSC New Official Website, Check ssc.gov.in_80.1

SSC కొత్త వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR)

అభ్యర్థులందరూ కమీషన్ యొక్క కొత్త వెబ్‌సైట్‌లో, అంటే https://ssc.gov.in/లో కొత్తగా వారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకోవాలి గతంలో లేదా పాత కమిషన్ వెబ్‌సైట్ అంటే, https://ssc.nic.in/లో చేసినవి చెల్లవు. కావున అభ్యర్ధులనదారు నూతన SSC వెబ్ సైటు లో వారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ని నమోదు చేసుకుని ఇకముందు వెలువడే SSC నోటిఫికేషన్ లకి దరఖాస్తు చేసుకోవాలి.

SSC పరీక్షల కోసం సన్నద్దమయ్యే అభ్యర్ధులు పై విషయాలను గమనించి వారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ని జాగ్రత్తగా మరియు తప్పులు లేకుండా చేసుకోవాలి. మీ SSC ప్రిపరేషన్ కోసం ADDA తెలుగు అందించే సమగ్రమైన స్టడీ మెటీరీయల్స్ తనిఖీ చేయండి.

SSC వెబ్ సైటు అధికారిక నోటిస్ తనిఖీ చేయండి 

మరిన్ని కధనాలు తనిఖీ చేయండి
SSC క్యాలెండర్ 2024-25 విడుదల  కంప్యూటరు అవేర్నెస్ SSC పరీక్షల కోసం
SSC GD కానిస్టేబుల్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు SSC GD కానిస్టేబుల్ పరీక్ష తేదీ 2024 విడుదల
స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ PDF తెలుగులో SSC GD 2023-2024  పరీక్ష నిర్వహన

AP and TS Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!