రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక ఆల్ రౌండర్ తిసారా పెరెరా
శ్రీలంక ఆల్ రౌండర్ మరియు మాజీ కెప్టెన్ తిసారా పెరెరా అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు, దాదాపు 12 సంవత్సరాల పాటు సాగిన తన అంతర్జాతీయ కెరీర్ను ముగించారు. పెరెరా 2009 డిసెంబర్‌లో అరంగేట్రం చేసిన తరువాత శ్రీలంక తరఫున ఆరు టెస్టులు, 166 వన్డేలు (2338 పరుగులు, 175 వికెట్లు), మరియు 84 T20లు (1204 పరుగులు, 51 వికెట్లు) ఆడారు. 32 ఏళ్ల అతను దేశీయ మరియు ఫ్రాంచిస్ క్రికెట్ ఆడటం కొనసాగిస్తాడని తెలిపారు.