Telugu govt jobs   »   Telugu Current Affairs   »   Software design for building a tuberculosis...

Software design for building a tuberculosis and leprosy free society , క్షయ, కుష్ఠు రహిత సమాజ నిర్మాణానికి సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన

2025 నాటికి క్షయ, కుష్ఠు రహిత సమాజ నిర్మాణానికి సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. నీతి ఆయోగ్, యాస్పిరేషన్‌ డిస్ట్రిక్ట్‌ సూచీలపై విజయనగరం కలెక్టరేట్‌లో సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, ప్రైవేటు సంస్థలు నియోజకవర్గాలను దత్తత తీసుకొని ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ప్రత్యేక డ్రైవ్‌తో పనిచేయాల్సి ఉంటుందన్నారు. వారి వివరాలు, ప్రాంతాలను ఆ సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు సమానంగా పురోగతి సాధించాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ 112 యాస్పిరేషన్‌ డిస్ట్రిక్ట్‌ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారని అన్నారు. అంతకుముందు విజయనగరంలోని కేంద్రాసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కంటైనర్‌ ఆసుపత్రిని మాండవీయ ప్రారంభించారు.

విజయనగరంలోని కేంద్రాసుపత్రి ఆవరణలో కంటైనర్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో మాడ్యులర్‌ పీడియాట్రిక్‌ ఐసీయూ యూనిట్‌ (పీఐసీయూ)ను దేశంలోనే మొదటిసారిగా ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆసుపత్రిని యాక్ట్‌ ఇండియా అందించిన సీఎస్‌ఆర్‌ నిధులతో యూనిసెఫ్‌ సాంకేతిక మార్గదర్శకత్వంతో రైనాక్‌ సంస్థ తయారు చేసింది. ఇందులో చిన్నపిల్లలకు సంబంధించి మూడు పడకల ఐసీయూ, ఆక్సిజన్, మానిటర్స్, వెంటిలేటర్లు, ఏసీ, అటాచ్డ్‌ బాత్‌రూంలు ఉన్నాయి. ప్లగ్‌ అండ్‌ ప్లే సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ సులువుగా ఇటువంటివి ఏర్పాటు చేసుకోవచ్చు.

*******************************************************************************************Software design for building a tuberculosis and leprosy free society_40.1

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

Software design for building a tuberculosis and leprosy free society_50.1

Download Adda247 App

Sharing is caring!