Telugu govt jobs   »   Current Affairs   »   SIIMA అవార్డులు 2023 పూర్తి వివరాలు

SIIMA అవార్డులు 2023 పూర్తి వివరాలు

ప్రతీ సంవత్సరం జరిగే SIIMA AWARDS ఈ సంవత్సరం కూడా వివిధ సినిమా రంగానికి చెందిన వారిని సత్కరించింది. సైమా అవార్డ్స్ 2023 సెప్టెంబర్ 15 న దుబాయి లో మొదలై 16 వ తేదీన వరల్డ్ ట్రేడ్ సెంటర్ వేదికగా అందరినీ కనువిందు చేసింది. SIIMA (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) దక్షిణాది రాష్ట్రాలైన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమల చిత్రాలలో ఉత్తమమైనవి ఎంపిక చేసి వివిధ విభాగాలలో అవార్డు లు పంపిణీ చేస్తుంది.  గత 10 సంవత్సరాలుగా ప్రజలని అలరిస్తూ ఈ సంవత్సరం 11 వ ఎడిషన్ ను దుబాయి లో నిర్వహించింది. ఈ వేడుకకు ప్రముఖ నటి నటులు, దర్శక నిర్మాతలతో పాటు సినిమా రణగానికి చెందిన వారు ఎందరో హాజరయ్యారు.

11 వ సైమా అవార్డుల తాజా ఎడిషన్ సెప్టెంబర్ 15, 16 తేదీలలో దుబాయి లో  రెండు రోజుల పాటు జరిగింది, మొదటి రోజు మొదటి రోజు, జనరేషన్ నెక్ట్స్ అవార్డ్స్ అత్యంత ప్రామిసింగ్ అప్ కమింగ్ అప్ కమింగ్ సౌత్ ఇండియన్ మూవీ ఆర్టిస్ట్ లను సత్కరించింది. రెండవ రోజు ముఖ్యమైన SIIMA అవార్డులను అందించారు. ఈ వేడుకలకు స్పాన్సర్ గా NEXA వ్యవహరించింది అని చైర్పర్సన్ బృంద ప్రసాద్ తెలిపారు.

TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2023, 1520 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

ఈ కధనం లో వివిధ విభాగాలలో అందించిన SIIMA అవార్డు లను రాష్ట్రాల వారీగా తెలుసుకోండి

SIIMA అవార్డులు 2023 తెలుగు

పురస్కారం విజేత చలనచిత్రం
ఉత్తమ చిత్రం సీతా రామం తెలుగు
ఉత్తమ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆర్ఆర్ఆర్
ఉత్తమ నటుడు జూనియర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్
ఉత్తమ నటి శ్రీలీల ధమాకా
ఉత్తమ సహాయ నటుడు రానా దగ్గుబాటి భీమ్లా నాయక్
ఉత్తమ సహాయ నటి సంగీత మసూధ
ఉత్తమ నటుడు (క్రిటిక్స్ ఛాయిస్) అడివి శేష్ మేజర్
ఉత్తమ నటి (క్రిటిక్స్ ఛాయిస్) మృణాల్ ఠాకూర్ సీతా రామం
ఉత్తమ విలన్ సుహాస్ హిట్ 2
ఉత్తమ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఆర్ఆర్ఆర్
ఉత్తమ సాహిత్యం చంద్రబోస్ నాటు నాటు – ఆర్ఆర్ఆర్
ఉత్తమ నేపథ్య గాయకుడు రామ్ మిర్యాల డీజే టిల్లు టైటిల్ సాంగ్
ఉత్తమ నేపథ్య గాయని మంగ్లీ జింతక్ – ధమాకా
బెస్ట్ డెబ్యూ యాక్టర్ అశోక్ గల్లా ధీరుడు
బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ మృణాల్ ఠాకూర్ సీతా రామం
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ మల్లిది వశిష్టుడు బింబిసార
బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్(లు) శరత్, అనురాగ్ మేజర్
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ ఆర్ఆర్ఆర్
ఉత్తమ హాస్యనటుడు శ్రీనివాస రెడ్డి కార్తికేయ 2
సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ కార్తికేయ 2
ప్రామిసింగ్ న్యూ కమర్ గణేష్ బెల్లంకొండ
ఫ్లిప్ కార్ట్ ఫ్యాషన్ యూత్ ఐకాన్ శ్రుతి హాసన్

SIIMA అవార్డులు 2023 తమిళం

పురస్కారం విజేత చలనచిత్రం
ఉత్తమ చిత్రం పొన్నియిన్ సెల్వన్ – 1 తమిళం
పాపులర్ ఛాయిస్ బెస్ట్ యాక్టర్ కమల్ హాసన్ విక్రమ్
పాపులర్ ఛాయిస్ బెస్ట్ యాక్ట్రెస్ త్రిష కృష్ణన్ పొన్నియిన్ సెల్వన్ – 1
ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు – విమర్శకులు ఆర్ మాధవన్ రాకెట్రీ: నంబి ఎఫెక్ట్
ఉత్తమ నటి విమర్శకులు కీర్తి సురేష్ సాని కాయిధం
ఉత్తమ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ విక్రమ్
ఉత్తమ లిరిక్ రైటర్ ఇళంగో కృష్ణన్ పొన్నియిన్ సెల్వన్ – 1
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ పొన్నియిన్ సెల్వన్ – 1
బెస్ట్ డెబ్యూ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే
బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అదితి శంకర్ విరుమన్
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఆర్ మాధవన్ రాకెట్రీ – నంబి ఎఫెక్ట్
ఉత్తమ సహాయ నటి వాసంతి విక్రమ్
బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ గౌతమ్ రామచంద్రన్ గార్గి
ఉత్తమ సహాయ నటుడు కాళి వెంకట్ గార్గి
నెగెటివ్ రోల్ లో బెస్ట్ యాక్టర్ ఎస్.జె.సూర్య డాన్
ఉత్తమ హాస్య నటుడు యోగి బాబు లవ్ టుడే
ఎక్స్ట్రా ఆర్డినరీ అచీవ్మెంట్ అవార్డు మణిరత్నం
ఉత్తమ నేపథ్య గాయకుడు – పురుషుడు కమల్ హాసన్ విక్రమ్ (పాతాళ పాతాళ)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి పొన్నియిన్ సెల్వన్ – 1
ఉత్తమ దర్శకుడు లోకేష్ కనగరాజ్ విక్రమ్

SIIMA అవార్డులు 2023 మలయాళం

పురస్కారం విజేత చలనచిత్రం
ఉత్తమ చిత్రం నా తాన్ కేస్ కోడు నా తాన్ కేస్ కోడు
ఉత్తమ నటుడు టొవినో థామస్ తల్లుమలా
ఉత్తమ నటి కళ్యాణి ప్రియదర్శన్ బ్రో డాడీ
ఉత్తమ నటుడు – విమర్శకులు కుంచకో బోబన్ నా థాన్ కేస్ కోడు
ఉత్తమ నటి – విమర్శకులు దర్శన రాజేంద్రన్ జయ జయ జయ జయ హే
ఉత్తమ దర్శకుడు వినీత్ శ్రీనివాసన్ హృదయం
బెస్ట్ డెబ్యూ యాక్టర్ రంజిత్ సజీవ్ మైక్
ఉత్తమ నూతన నటి గాయత్రి శంకర్ నా తాన్ కేస్ కోడు
ఉత్తమ సహాయ నటుడు లాల్ మహావీర్
ఉత్తమ సహాయ నటి బిందు పానికర్ రోర్స్చాచ్
ఉత్తమ లిరిక్ రైటర్ వినాయక్ శశికుమార్ భీష్మ పర్వం
ఉత్తమ నేపథ్య గాయని – మహిళ మృదులా వార్డర్ పథోన్పథం నూట్టండు
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ శరణ్ వేలాయుధన్ సౌదీ వెల్లక్క
స్పెషల్ జ్యూరీ అప్రిసియేషన్ అవార్డు బాసిల్ జోసెఫ్ జయ జయ జయ జయ హే
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అభినవ్ సుందర్ నాయక్” ముకుందన్ ఉన్ని అసోసియేట్స్
ఉత్తమ హాస్య నటుడు రాజేష్ మాధవన్ నా తాన్ కేస్ కోడు
నెగెటివ్ రోల్ లో ఉత్తమ నటుడు వినీత్ శ్రీనివాసన్ ముకుందన్ ఉన్ని అసోసియేట్స్
ఉత్తమ నూతన నిర్మాత ఉన్ని ముకుందన్ ఫిలిమ్స్ మెప్పడియాన్

SIIMA అవార్డులు 2023 కన్నడ

పురస్కారం విజేత చలనచిత్రం
స్పెషల్ అప్రిసియేషన్ అవార్డ్ – కథ రిషబ్ శెట్టి కాంతారా
నెగెటివ్ రోల్ లో ఉత్తమ నటుడు అచ్యుత్ కుమార్ కాంతారా
ఉత్తమ సహాయ నటుడు దిగంత్ మంచాలే గాలిపట 2
ఉత్తమ సహాయ నటి శుభ రక్ష హోం మినిస్టర్
ఉత్తమ నూతన నిర్మాత అపేక్ష పురోహిత్, పవన్ కుమార్ వడయార్ డొల్లు
ఉత్తమ నూతన నటుడు పృథ్వీ షామనూర్ పదవి పూర్వా
ఉత్తమ నూతన నటి నీతా అశోక్ విక్రాంత్ రోణ
స్పెషల్ అప్రిసియేషన్ అవార్డు ముఖేష్ లక్ష్మణ్ కాంతారా
స్పెషల్ అప్రిసియేషన్ అవార్డ్ – లీడ్ రోల్ లో యాక్టర్ రక్షిత్ శెట్టి చార్లీ 777
ఉత్తమ హాస్య నటుడు ప్రకాష్ తుమినాద్ కాంతారా
ఉత్తమ నూతన దర్శకుడు సాగర్ పురాణిక్ డొల్లు
ఉత్తమ సంగీత దర్శకుడు బి.అజనీష్ లోక్ నాథ్ కాంతారా

డౌన్లోడ్ PDF

pdpCourseImg

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

SIIMA అవార్డులు 2023 పూర్తి వివరాలు ఎక్కడ లభిస్తాయి?

SIIMA అవార్డుల పూర్తి వివర్లు ఈ కధనం లో అందించాము మరియు PDF కూడా డౌన్లోడ్ చేసుకోండి