సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్ అనేది సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) యొక్క తొమ్మిది యూనిట్లలో ఒకటి, ఇది షెడ్యూల్ “A” మినీ-రత్న కేటగిరీ- I సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ (CPSE) పూర్తిగా భారత ప్రభుత్వానికి చెందినది. SPMCIL కంపెనీల చట్టం ద్వారా స్థాపించిన సంస్థ. ఈ సంస్థ సెక్యూరిటీ పేపర్లు, ప్రింటింగ్ కరెన్సీ & బ్యాంక్ నోట్స్, పాస్‌పోర్ట్‌లు, నాన్-జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు, రూపకల్పన, తపాలా స్టాంపులు మరియు నాణేల ముద్రణ తయారీ వాటిలో నిమగ్నమై ఉంటుంది.
SPMCIL ప్రధాన కార్యాలయం జవహర్ వ్యాపార్ భవన్, జనపథ్, న్యూఢిల్లీ –110001లో ఉంది. కంపెనీ యొక్క కార్యాచరణ యూనిట్లు ముంబై, కోల్‌కతా, హైదరాబాద్ మరియు నోయిడాలో నాలుగు మింట్‌లు, నాసిక్, దేవాస్ మరియు హైదరాబాద్‌లలో నాలుగు కరెన్సీ/సెక్యూరిటీ ప్రెస్‌లు మరియు నర్మదాపురంలో అధిక నాణ్యత గల పేపర్ మాన్యుఫ్యాక్చరింగ్ మిల్లును కలిగి దేశమంతటా వ్యూహాత్మకంగా ఉన్నాయి. SPMICL హైదరాబాద్ వివిధ విభాగాలలో ఖాళీలకు నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కధనంలో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ 2024 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.
Adda247 APP
సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ రిక్రూట్‌మెంట్ 2024 విడుదలైంది
భారత ప్రభుత్వ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ తన అధికారిక వెబ్‌సైట్ https://spphyderabad.spmcil.com/en/లో హైదరాబాద్ రిక్రూట్‌మెంట్ 2024ని విడుదల చేసింది. సూపర్‌వైజర్ (TO), సూపర్‌వైజర్ (టెక్ కంట్రోల్), లాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ II, ఎన్‌గ్రేవర్ (మెటల్ వర్క్స్), జూనియర్ ఆఫీసు అసిస్టెంట్ బి-3, జూనియర్ టెక్నీషియన్, ఫిట్టర్, వెల్డర్, ఫైర్ మ్యాన్ పోస్ట్ ల కోసం మొత్తం 96 ఖాళీలను ప్రకటించింది. ఈ కధనం లో SPMCIL నోటిఫికేషన్ వివరాలు, ముఖ్య తేదీలు, ఖాళీలు వంటి వివరాలు తెలుసుకోండి.
సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ 2024 నోటిఫికేషన్
సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్ రిక్రూట్‌మెంట్ 15 మార్చి 2024న అధికారిక ప్రకటన విడుదల చేసింది. SPMCIL యొక్క హైదరాబాద్ యూనిట్, పూర్తిగా భారత ప్రభుత్వానికి చెందినది. సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నోటిఫికేషన్ కోసం ఆసక్తి మరియు అర్హతగల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లను 15 మార్చి 2024 నుంచి 15 ఏప్రిల్ 2024 వరకు సమర్పించవచ్చు. SPMCIL నోటిఫికేషన్ 2024 లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఆన్‌లైన్ పరీక్ష మే/ జూన్ 2024లో జరగనుంది.
SPMCIL హైదరాబాద్ రిక్రూట్‌మెంట్: అవలోకనం
96 ఖాళీలకు వివిధ పోస్టుల కోసం SPMCIL హైదరాబాద్ రిక్రూట్‌మెంట్ 2024 యొక్క అవలోకనం దిగువ పట్టికలో చర్చించబడింది. పేర్కొన్న అంశాలు పరీక్షా కోణం నుండి ముఖ్యమైనవి.
SPMCIL హైదరాబాద్ రిక్రూట్‌మెంట్: అవలోకనం |
|
సంస్థ | సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ (SPMCIL) |
పరీక్ష పేరు | SPMCIL పరీక్ష 2023 |
పోస్ట్లు | సూపర్ వైజర్, జూనియర్ ఆఫీసు అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, ఫైర్ మ్యాన్ |
ఖాళీలు | 96 |
పరీక్ష భాష | ఇంగ్లీష్ |
ఎంపిక ప్రక్రియ | ఆన్లైన్ పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ |
అప్లికేషన్ విధానం | ఆన్‌లైన్ |
అధికారిక వెబ్ సైట్ | https://spphyderabad.spmcil.com/en/ |
సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ రిక్రూట్‌మెంట్ 2024: ముఖ్యమైన తేదీలు
SPMCIL లేదా సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ 2024 రిక్రూట్‌మెంట్ కి సంబంధించిన అన్ని ముఖ్యమైన తేదీలను ఈ దిగువన పట్టికలో అందించాము.
SPMCIL హైదరాబాద్ రిక్రూట్‌మెంట్ 2024: ముఖ్యమైన తేదీలు |
|
తేదీలు | |
SPMCIL హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ | 15 మార్చి 2024 |
SPMCIL హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2024 ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ | 15 మార్చి 2024 |
SPMCIL రిక్రూట్మెంట్ 2024 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ | 15 ఏప్రిల్ 2024 |
SPMCIL హైదరాబాద్ పరీక్ష తేదీ 2023 | మే/ జూన్ 2024 |
సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ PDF
సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్, అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, జీతం మొదలైన రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన నోటిఫికేషన్ PDFని విడుదల చేసింది. అభ్యర్థులు 96 ఖాళీలకు వివిధ విభాగాల్లో దరఖాస్తుచేసుకోండి. సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ PDFని ఈ దిగువన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ PDF
SPMCIL హైదరాబాద్ ఖాళీలు 2024
SPMCIL హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2024 కోసం మొత్తం 96 ఖాళీలను ప్రకటించింది. SPMCIL హైదరాబాద్ 2024 పోస్టుల వారీగా ఖాళీల వివరాలు తనిఖీ చేయండి.
SPMCIL హైదరాబాద్ 2024 ఖాళీలు |
|
విభాగము | ఖాళీలు |
సూపర్వైసర్ (TO ప్రింటింగ్) | 02 |
సూపర్వైసర్ టెక్ కంట్రోల్ | 05 |
సూపర్వైసర్ OL | 01 |
జూనియర్ ఆఫీసు అసిస్టెంట్ | 12 |
జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్/ కంట్రోల్) | 68 |
జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్) | 03 |
జూనియర్ టెక్నీషియన్ (వెల్డర్) | 01 |
జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్) | 03 |
ఫైర్ మ్యాన్ | 01 |
మొత్తం | 96 |
SPMCIL హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2024 అర్హత ప్రమాణాలు
అభ్యర్ధులు SPMCIL హైదరాబాద్ 2024 కి అప్లై చేసేముందు వివిధ విభాగాలకు SPMCIL 2024 హైదరాబాద్ నోటిఫికేషన్ లో తెలిపిన అర్హతా ప్రమాణాలు తెలుసుకోవాలి. SPMCIL హైదరాబాద్ రిక్రూట్‌మెంట్ 2024 కింద ప్రకటించిన వివిధ పోస్టులకు విద్యార్హత మరియు అర్హత ప్రమాణాలు ఈ కింద అందిచాము:
SPMCIL హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2024: అర్హత ప్రమాణాలు |
|||
క్ర సం. | పోస్టు పేరు | విద్యార్హతలు | గరిష్ట వయస్సు |
1 | సూపర్వైసర్ (TO- ప్రింటింగ్) | ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ప్రింటింగ్ లో డిప్లొమా/ B.Tech/ B.E/B.Sc ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణత సాధించాలి. | 30 |
2 | సూపర్వైసర్ (టెక్నికల్ కంట్రోల్ S-1) | ప్రింటింగ్/ మెకానికల్/ ఎలెక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటరు సైన్స్ లో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. | 30 |
3 | జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్/కంట్రోల్) | ITI, NCVT, SCVT వంటి గుర్తింపు పొందిన సంస్థ నుండి ప్రింటింగ్/ ప్లేట్ మేకింగ్/ఎలెక్ట్రో ప్లేటింగ్/ లేదా ప్రింటింగ్ టెక్నాలజీ లో డిప్లొమా కలిగి ఉండాలి | 25 |
4 | జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్) | NCVT/SCVT నుంచి గుర్తింపు పొందిన ఫిట్టర్ ట్రేడ్ లో ఫుల్ టైమ్ ఐటిఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. | 25 |
5 | జూనియర్ టెక్నీషియన్ (వెల్డర్) | NCVT/SCVT నుంచి గుర్తింపు పొందిన వెల్డర్ ట్రేడ్ లో ఫుల్ టైమ్ ఐటిఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. | 25 |
6 | జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్) | ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్స్లో ఎన్సీవీటీ/ ఎస్సీవీటీ గుర్తింపు పొందిన ఫుల్టైమ్ ఐటీఐ సర్టిఫికెట్. | 25 |
7. | సూపర్వైసర్ (OL) RM | గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యూయేట్ డిగ్రీ హిందీ లేదా ఇంగ్షీషు విభాగంలో కలిగి ఉండాలి మరియు 1 సంవత్సరం ట్రాన్స్లేషన్ అనుభవం ఉండాలి | 30 |
8. | జూనియర్ ఆఫీసు అసిస్టెంట్ | గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం 55% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి | 28 |
9 | ఫైర్ మ్యాన్ | ఫైర్ మ్యాన్ ట్రైనింగ్ పొంది ఉండాలి | 25 |
SPMCIL హైదరాబాద్ రిక్రూట్‌మెంట్ 2024 వయోపరిమితి
SPMCIL హైదరాబాద్ రిక్రూట్‌మెంట్ 2024 కి సంభందించిన అవసరమైన వయోపరిమితి క్రింది పట్టికలో ఇవ్వబడింది. వివిధ పోస్ట్ లకు వివిధ వయోపరిమితి ఉంది మరియు అభ్యర్ధులకి వయోపరిమితి లో సడలింపు కూడా ఉంది.
SPMCIL హైదరాబాద్ రిక్రూట్‌మెంట్ 2024 వయోపరిమితి | |
కనీస వయస్సు | 18 సంవత్సరాలు |
గరిష్ట వయస్సు | 30 సంవత్సరాలు |
SPMCIL హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2024 దరఖాస్తు ఫీజు
SPMCIL హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2024 అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తు ఫారాల తుది సమర్పణ ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు కేటగిరీల వారీగా దరఖాస్తు ఫీజును పరిశీలించవచ్చు.
SPMCIL హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2024 దరఖాస్తు ఫీజు | |
విభాగము | ఫీజు |
GEN/OBC/EWS | రూ. 600 |
SC/STs/PwBD/Ex-SM | రూ. 200 |
SPMCIL హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2024 దరఖాస్తు లింకు
IGM హైదరాబాద్ వివిధ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హతగల మరియు ఆసక్తిగల అభ్యర్థులు తగిన పోస్ట్ లకి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు ఆన్‌లైన్ లింక్ 15 మార్చి 2024న మొదలైంది మరియు దరఖాస్తు చివరి తేదీ 15 ఏప్రిల్ 2024. ఆన్‌లైన్ మాధ్యమం తప్ప మరే ఇతర దరఖాస్తు మార్గాలు ఆమోదించబడవు. ఔత్సాహికుల కోసం మేము ఇక్కడ SPMCIL హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2024 దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌ని అందించాము.
SPMCIL హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2024 దరఖాస్తు లింకు
SPMCIL హైదరాబాద్ 2024 కి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి దశలు
SPMCIL హైదరాబాద్ 2024 కోసం దరఖాస్తు చేసుకునే ఆశావహులు క్రింద పేర్కొన్న దశలను అనుసరించాలి.
- దశ 1: SPMCIL హైదరాబాద్ అధికారిక వెబ్‌సైట్ https://spphyderabad.spmcil.com/en/ ను సందర్శించండి.
- దశ 2: SPMICL విభాగం లో Careers పై క్లిక్ చేయండి అక్కడ ఉన్న దరఖాస్తు ఆన్‌లైన్ లింక్ పై క్లిక్ చేయండి.
- దశ 3: అవసరమైన సమాచారాన్ని మరియు ఆధారాలను నమోదు చేసి నమోదు ప్రక్రియను పూర్తి చేయండి.
- దశ 4: అభ్యర్థుల మొబైల్ నంబర్ మరియు రిజిస్టర్డ్ ఇమెయిల్ IDకి పంపిన రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ చేసి పూర్తి అప్లికేషన్ ఫారమ్‌ను పూరించండి.
- దశ 5: తదుపరి దశ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని సూచించిన ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయండి.
- దశ 6: తదుపరి పేజీలో, అభ్యర్థులు తమ విద్యార్హత వివరాలను పూరించాలి.
- అభ్యర్థులు తమ సౌలభ్యం మేరకు పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవచ్చు.
- దశ 7: దరఖాస్తు ఫారమ్‌ను ఒకసారి ప్రివ్యూ చేసి, నమోదు చేసిన అన్ని వివరాలను ధృవీకరించండి మరియు సమర్పించు బటన్‌పై క్లిక్ చేయండి.
- దశ 7: ప్రతి వివరాలను పూరించి, ఫారమ్‌ను సమర్పించిన తర్వాత అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లింపు గేట్‌వేకి మళ్లించబడతారు.
- దశ 8: అభ్యర్థులు దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ మోడ్ లేదా ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా చెల్లించవచ్చు.
దశ 9: మీరు దరఖాస్తు రుసుమును విజయవంతంగా చెల్లించిన తర్వాత, మీ దరఖాస్తు ఫారమ్ సమర్పించబడుతుంది. - దశ 10: అభ్యర్థులు తమ దరఖాస్తును సమర్పించినట్లు ధృవీకరించడానికి వారి నమోదిత మొబైల్ నంబర్‌లో నిర్ధారణ ఇమెయిల్ లేదా మెసేజ్ అందుకుంటారు.
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |