Telugu govt jobs   »   Railways   »   RRB NTPC Exam Pattern

RRB NTPC Exam Pattern : RRB NTPC CBT-I & II యొక్క వివరణాత్మకమైన పరీక్ష విధానం

RRB NTPC Exam Pattern : Overview 

RRB NTPC Exam Pattern : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) వివిధ జోనల్ రైల్వేలలో అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, గూడ్స్ గార్డ్ మొదలైన వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (NTPC) నియామక పరీక్షను 7 దశల్లో నిర్వహిస్తుంది.

భారతీయ రైల్వేలోని వివిధ జోనల్ రైల్వేలు మరియు ప్రొడక్షన్ యూనిట్లలో 35,208 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (NTPC) గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం RRB NTPC అప్లికేషన్ స్టేటస్ ని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ విడుదల చేసింది.

RRB NTPC పరీక్షకు అర్హత సాధించడానికి, RRB NTPC సిలబస్ మరియు పరీక్షా సరళిపై పూర్తి పరిజ్ఞానం ఉండాలి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ద్వారా నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (NTPC) పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయబడింది CBT-I కూడా నిర్వహించబడింది. తదుపరి పరీక్ష అయిన RRB NTPC CBT-II యొక్క వివరణాత్మకమైన పరీక్ష విధానం ను ఈ వ్యాసం లో అందించాము.

Read More : RRB NTPC CBT-2 Study Plan

RRB NTPC Exam Pattern : పరీక్ష విధానం 

RRB NTPC నియామక ప్రక్రియ కింది దశలను కలిగి ఉంటుంది:

  1. 1వ దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
  2. 2వ దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
  3. టైపింగ్ స్కిల్ టెస్ట్/కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (వర్తించే విధంగా)
  4. డాక్యుమెంట్ వెరిఫికేషన్/మెడికల్ ఎగ్జామినేషన్.

RRB NTPC CBT-I తో పాటుగా CBT-II యొక్క వివరణాత్మకమైన పరీక్ష విధానం కింద అందించబడింది.

RRB NTPC Stage-1 Exam Pattern

RRB NTPC స్టేజ్ 1 పరీక్ష విధానం కింది విభాగాలను కలిగి ఉంది:

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు వ్యవధి
1 జనరల్ అవేర్నెస్ 40 40 90 Minutes
2 మ్యాథమెటిక్స్ 30 30
3 జనరల్ ఇంటలిజెన్స్ & రీజనింగ్ 30 30
మొత్తం  100 100
  • PWD అభ్యర్థులకు పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.
  • 1/3 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
  • స్టేజ్ 1 అనేది స్క్రీనింగ్ పరీక్ష.

RRB NTPC Stage-2 Exam Pattern

RRB NTPC స్టేజ్ 2 పరీక్ష విధానం కింది విభాగాలను కలిగి ఉంది:

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు వ్యవధి
1 జనరల్ అవేర్నెస్ 50 50 90 Minutes
2 మ్యాథమెటిక్స్ 35 35
3 జనరల్ ఇంటలిజెన్స్ & రీజనింగ్ 35 35
మొత్తం 120 120
  • ప్రతి 7వ CPC స్థాయికి ప్రత్యేక 2వ దశ CBT ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.
  • 1/3 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
  • వివిధ స్థాయిల పోస్టులకు ప్రశ్నల స్థాయి భిన్నంగా ఉంటుంది.

Read More : RRB Group-D Exam Important Topics to get High Score

RRB NTPC Computer Based Aptitude Test (కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్)

(ట్రాఫిక్ అసిస్టెంట్ మరియు స్టేషన్ మాస్టర్ ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే)

  • అర్హత మార్కులు: అభ్యర్థులు అర్హత సాధించడానికి ప్రతి టెస్ట్ లో కనీసం 42 మార్కుల T- స్కోర్ ను సాధించాలి.
  • ఇది కేటగిరీతో సంబంధం లేకుండా అభ్యర్థులందరికీ వర్తిస్తుంది మరియు కనీస T- స్కోరులో ఎలాంటి సడలింపు అనుమతించబడదు.
  • అభ్యర్థులు SM/TA పోస్ట్ కోసం పరిగణనలోకి తీసుకున్నందుకు CBAT యొక్క ప్రతి టెస్ట్ లో అర్హత సాధించాలి.
  • CBAT కి ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ప్రశ్నలు ఉంటాయి.
  • CBAT లో నెగటివ్ మార్కింగ్ ఉండదు.
  • CBAT లో అర్హత సాధించిన అభ్యర్థుల నుండి మాత్రమే మెరిట్ జాబితా డ్రా చేయబడుతుంది, 2 వ స్టేజ్ CBT లో పొందిన మార్కులకు 70% వెయిటేజీ మరియు CBAT లో పొందిన మార్కులకు 30% వెయిటేజీ ఉంటుంది.

Read More : RRB NTPC CBT-II Detailed Syllabus

Typing Skill Test (టైపింగ్ స్కిల్ టెస్ట్)

  • ఈ పరీక్ష చాలా సులువుగా ఉంటుంది.
  • టైపింగ్ పరీక్ష కోసం ఎనిమిది రెట్లు ఖాళీల సంఖ్యను పిలుస్తారు.
  • అభ్యర్థులు ఇంగ్లీష్‌లో నిమిషానికి 30 పదాలు (WPM) లేదా హిందీలో 25 WPM వ్యక్తిగత కంప్యూటర్‌లో మాత్రమే ఎడిటింగ్ టూల్స్ మరియు స్పెల్ చెక్ సౌకర్యం లేకుండా టైప్ చేయాలి.

Document Verification(డాక్యుమెంట్ వెరిఫికేషన్)

2వ స్టేజ్ CBT లో అభ్యర్థుల ఉత్తీర్ణత స్తాయి  ఆధారంగా మరియు 2వ స్టేజ్ CBT మరియు CBAT/TST రెండింటిలోనూ అభ్యర్థుల ఉత్తీర్ణత స్తాయి ఆధారంగా (వర్తించే విధంగా), ఖాళీల సంఖ్యకు సమానమైన అభ్యర్థులను వారి మెరిట్ మరియు ఎంపికల ప్రకారం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుంది.

Read More : Weekly Current Affairs in Telugu

RRB NTPC Exam Pattern : FAQs

ప్ర. RRB NTPC రిక్రూట్‌మెంట్ కోసం విడుదలైన ఖాళీల మొత్తం సంఖ్య ఎంత.?
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 35,208 ఖాళీల కోసం నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (NTPC) నియామకాల కోసం RRB NTPC నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

 

ప్ర. RRB NTPC స్టేజ్ -1 నియామక పరీక్షకు ఏదైనా నెగెటివ్ మార్కింగ్ ఉంటుందా?

అవును, ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

 

ప్ర. RRB NTPC నియామక పరీక్ష ఎంపిక విధానం ఏమిటి?

నియామక ప్రక్రియ కింది దశలను కలిగి ఉంటుంది:

  1. 1వ దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
  2. 2వ దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
  3. టైపింగ్ స్కిల్ టెస్ట్/కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (వర్తించే విధంగా)
  4. డాక్యుమెంట్ వెరిఫికేషన్/మెడికల్ ఎగ్జామినేషన్.
Shathabdhi Batch RRB NTPC CBT-2
For RRB NTPC CBT-2

 

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

Sharing is caring!