Telugu govt jobs   »   Telugu Current Affairs   »   Renowned lyricist Kandikonda passes away

ప్రముఖ పాటల రచయిత కందికొండ ఇకలేరు

Renowned lyricist Kandikonda passes away

ప్రముఖ కవి, పాటల రచయిత కందికొండ యాదగిరి (49) ఇక లేరు. చాలా కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన మార్చి 12న హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో 1973 అక్టోబరు 13న సాంబయ్య, కొమురమ్మ దంపతులకు కందికొండ జన్మించారు. మానుకోటలో ఇంటర్‌ పూర్తి చేసి, మహబూబాబాద్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఇంటర్‌ సెకండియర్‌లో చక్రి (దివంగత సంగీతదర్శకుడు)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరికీ పాటల మీద ఆసక్తి ఉండడంతో ‘సాహితీ కళా భారతి’ అనే ఇన్స్టిట్యూట్ ని ప్రారంభించారు. పుణేలో జరిగిన జాతీయస్థాయి క్రీడల పోటీల్లో పరుగు పందెంలో పాల్గొన్న కందికొండ.. 1997– 98లో మిస్టర్‌ బాడీ బిల్డర్‌గానూ గెలిచారు.

ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్‌ పూర్తి చేసిన కందికొండ.. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంతో గేయరచయితగా తన ప్రస్థానం మొదలుపెట్టారు. పదమూడు వందలకు పైగా పాటలు రాశారు. సినిమా పాటలతోనే కాదు.. సంప్రదాయ, జానపద పాటల్లోనూ తన ప్రతిభ చాటారు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ‘మాగాణి మట్టి మెరుపు తెలంగాణ’, ‘చిన్నీ మా బతుకమ్మా.. చిన్నారక్క బతుకమ్మా’ వంటి చెప్పుకోదగ్గ పాటలు ఉన్నాయి.

 

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!