Telugu govt jobs   »   History Study Notes

History Study Notes – Rebellion of 1857 in Andhra, Download PDF, APPSC Groups | హిస్టరీ స్టడీ నోట్స్ – ఆంధ్రలో 1857 తిరుగుబాటు, డౌన్‌లోడ్ PDF, APPSC గ్రూప్స్

ఆంగ్లేయులను గడగడలాడించిన సిపాయిల తిరుగుబాటు ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రథమ స్వాతంత్య్ర పోరాటంగా ప్రసిద్ధికెక్కినది. దీనిని 1857 తిరుగుబాటును సిపాయిల తిరుగుబాటు, ముస్లింలకు – క్రైస్తవులకు మధ్య జరిగిన తిరుగుబాటు, నాగరికులకు – అనాగరికులకు మధ్య జరిగిన తిరుగుబాటు వంటి పేర్లతో పిలుస్తారు. జాతీయ భావాలను, స్వాతంత్య్ర కాంక్షను రగిలించి దేశ ప్రజలను ఏకం చేసింది, ఉత్తర భారతంలో ఉవ్వెత్తున వ్యాపించిన విప్లవం ఆంధ్ర ప్రాంతంలో వ్యాపించలేకపోయింది. ఈ ప్రభావంలో అనేక ఇతర కారణాలు ఉన్నాయి.  నాడు ఆంధ్ర ప్రాంతంలో ఏకీకృత పరిస్థితులతో పాటు కంపెనీ పాలనలో అమలైన భూమి శిస్తు విధానాలపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.

ఈ సిపాయిల తిరుగుబాటు మొదట బెంగాల్‌లోని బారక్‌పుర్‌లో 1857, మే 10న  మొదలైంది. దీనికి ముఖ్య కారణం రాజ్యసంక్రమణ సిద్ధాంతం. తక్షణ కారణం సైన్యంలో ఎన్‌ఫీల్డ్‌ రైఫిల్స్‌ను లార్డ్‌ కానింగ్‌ ప్రవేశపెట్టడం. ఉత్తర భారతదేశంలో ఈ సిపాయిల తిరుగుబాటు అలీపుర్, మెయిన్‌పురి, బులంద్‌షహర్, మధుర, అట్టక్‌ తదితర ప్రాంతాల్లో జరిగింది. ముఖ్యంగా బెంగాల్, బిహార్‌లో గ్రామ గ్రామానికి వ్యాపించింది. ఆ సమయంలో మొత్తం సిపాయిలు 2,32,000 మంది ఉన్నారు. వీరికి స్థానిక రాజులు, జమీందారులు, భూస్వాముల సైన్యం సహాయపడింది.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

ఆంధ్రాలో 1857 సిపాయిల తిరుగుబాటు ప్రభావం

1857 సిపాయిల తిరుగుబాటు ప్రభావం ఆంధ్రాలో తక్కువగానే ఉంది. తిరుగుబాటుదారులు రెండో బహదూర్‌ షా జాఫర్‌ను చక్రవర్తిగా ప్రకటించారు. ఈ ప్రకటన వ్యాపించడంతో కడప మసీదుల్లో ప్రార్థనలు చేశారు. కడప, మచిలీపట్నం, విశాఖపట్నంలో కొంత మేరకు కనిపించింది. షేక్‌ పీర్‌ సాహెబ్‌ అనే ముస్లిం బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జీహాద్‌ (పవిత్ర యుద్ధం) ప్రకటించాడు. ఇతడిని అరెస్టు చేయడంతో ఆ తిరుగుబాటు అంతమైంది. ఆయన కడపకు పెట్టిన పేరు మహమ్మద్‌ పట్టణం.

ముస్లింలు తిరుగుబాటులో ఎందుకు పాల్గొనాలి, విశాఖపట్టణానికి మహమ్మద్‌ పట్టణం పేరు పెట్టాలి అనే డిమాండ్‌తో మొహర్రం పండగ రోజున ముస్లింలను రెచ్చగొడూతూ విశాఖపట్టణంలో ఒక పోస్టర్‌ వెలిసింది.

‘దండసేనుడు’ నాయకత్వంలో కంపెనీ పాలనకు వ్యతిరేకంగా గంజాం, గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు తిరుగుబాటు చేశారు. ఈ  తిరుగుబాటు లో ‘సవర’ జాతి గిరిజనులు పాల్గొన్నారు. దీంతో సవర జాతి అటవీ ఉత్పత్తుల అమ్మకాలను బ్రిటిష్‌ ప్రభుత్వం  నిలిపేసింది. ఈ తిరుగుబాటును కెప్టెన్‌ విల్సన్‌ అణచివేశాడు.

ఆగస్టు 1857 – కోరుకొండ సుబ్బారెడ్డి తిరుగుబాటు

మహారాష్ట్ర వీరుడు నానాసాహెబ్‌ తన గొప్ప సైన్యంతో బ్రిటిషర్లను దేశం నుంచి వెళ్లగొట్టడానికి వస్తున్నాడన్న వార్తను గోదావరి జిల్లా కోరటూరు ప్రాంత గ్రామ మున్సబ్‌ అయిన సుబ్బారెడ్డి నమ్మాడు. ఈ వదంతితో ఎర్రన్నగూడెం కేంద్రంగా గోదావరి ప్రాంతంలో గిరిజనులతో తిరుగుబాటు లేవదీశాడు. సుబ్బారెడ్డి చేస్తున్న తిరుగుబాటు మరియు ఇతర కార్యక్రమాలను బుట్టాయగూడెం గ్రామ మున్సబ్‌ సుంకర స్వామి ఆంగ్లేయులకు చేరవేశాడు. దీంతో బ్రిటిషర్లు తిరుగుబాటును అణచివేసి సుబ్బారెడ్డిని ఉరితీశారు.

ఉత్తర భారతదేశంలో తిరుగుబాటు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి మొదలైన ప్రాంతాల్లో బహిరంగ సభలను ఏర్పాటుచేసి బ్రిటిష్‌ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు పలికారు. ముస్లిం రాజుల పాలన కంటే బ్రిటిష్‌ పాలన వేయి రెట్లు మంచిదని వీరంతా భావించారు.

నిజాం రాష్ట్రంలో 1857 తిరుగుబాటు:

హైదరాబాద్‌లోని కొన్నివర్గాల వారికి వారిపై వ్యతిరేకత దత్త మండలాలను ఆంగ్లేయులకు నిజాం ఇచ్చిన నాటి నుంచి ఉంది. కంపెనీ పాలనను కూలదోయడానికి నాటి హైదరాబాద్‌ నవాబు నసీరుద్దౌలా సోదరుడైన ముబారిజుద్దౌలా ప్రోత్సాహంతో 1839లో ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వహాబీలు కుట్రపన్నారు. దానిని పసిగట్టిన ఆంగ్లేయులు ముబారిజుద్దౌలాను 1854లో చనిపోయేవరకు గోల్కొండ కోటలో బంధించారు. హైదరాబాద్‌ ప్రాంతంలోని ముస్లింలలో ఒక వర్గాన్ని 1857లో ఉత్తర భారతదేశంలో తిరుగుబాటుదారులు సాధించిన విజయాలు ఉత్తేజపరిచాయి.  బ్రిటిషర్లపై జీహాద్‌కు ప్రజలను రెచ్చగొడుతూ ముస్లింలకు ప్రథమ శత్రువుగా బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని అభివర్ణించారు.

1857 తిరుగుబాటు ఏర్పాటుకు ముఖ్య కారణం ఎన్‌ఫీల్డ్‌ తుపాకుల వినియోగంపై ఔరంగాబాద్‌లోని సిపాయిల్లో అసంతృప్తి నెలకొనడం. వీరి అసంతృప్తిని గుర్తించిన కంపెనీ అధికారులు 1857, జూన్‌ 23న 90 మంది సిపాయిలను నిరాయుధులను చేసి జైలుకు పంపారు.  హైదరాబాద్‌ నగరంలో బ్రిటిషర్ల రెసిడెన్సీపై రొహిల్లా జమీందారు తుర్రెబాజ్‌ఖాన్‌ 1857, జులై 17న 5000 మందితో దాడిచేశాడు. ఆ సమయంలో  హైదరాబాద్‌ ప్రధానమంత్రి సాలార్‌జంగ్‌ బ్రిటిషర్లకు సహాయపడ్డాడు.

ఆంధ్రాలో  తిరుగుబాటు జరగకపోవడానికి కారణాలు

 • బ్రిటిష్‌ ప్రభుత్వంపై ఆంధ్రాలో సిపాయిలు విశ్వాసం ప్రకటించడం
 • ఆంధ్రాలో ఆంగ్లేయులు రాక ముందు అనేక అనవసర యుద్ధాలు జరుగుతూ శాంతిభద్రతలు సక్రమంగా ఉండేవి కావు. అలాంటి పరిస్థితులు బ్రిటిష్‌ పాలనలో శాంతిభద్రతలు స్థిరంగా ఉండటం.
 • ఆంధ్రా ప్రాంతంలో జమీందారులు బ్రిటిషర్లకు అండగా ఉండటం.
 • ఈస్ట్‌ఇండియా కంపెనీ పాలన రద్దయి బ్రిటిష్‌ సార్వభౌమాధికారం ప్రారంభమైంది. ఈ మేరకు 1858, నవంబరు 1న విక్టోరియా మహారాణి ప్రకటన చేసింది. దీంతో ఆంధ్రాలో కూడా బ్రిటిషర్ల ప్రత్యక్ష పాలన ప్రారంభమైంది.

శాతవాహనుల కాలం

భూమిశిస్తు విధానం

ఈస్ట్‌ఇండియా కంపెనీ పరిపాలనలో ప్రభుత్వానికి భూమి శిస్తు ముఖ్య ఆదాయం. భూమిశిస్తు వసూలు చేయడం జిల్లా అధికారుల ముఖ్య విధి. ఆంధ్రా ప్రాంతంలో నాలుగు రకాల పన్ను విధానాలు ఉండేవి.

వేలం వేసే విధానం

 • 1773లో వారన్‌ హేస్టింగ్స్‌ కాలంలో వేలం వేసే విధానం ఉండేది. ఎవరు ఎక్కువ పాట పాడితే వారికి శిస్తు వసూలు అధికారం వచ్చేది.
 • రాయలసీమ జిల్లాల్లో ఇది అమలైంది. దీనివల్ల రైతులకు, ప్రభుత్వానికి నష్టం జరిగేది.
 • రాయలసీమ ప్రాంతంలో ఈ పద్ధతిని తొలగించిన థామస్‌ మన్రో, తర్వాత రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు.
 • సర్‌క్యూట్‌ కమిటీ వేలం వేసే విధానంపై వేసిన కమిటీ.

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైవిధ్యం

జమీందారీ విధానం

 • ఉత్తర సర్కారు జిల్లాల్లో కారన్‌ వాలీస్‌ జమీందారీ విధానాన్ని మొదటిగా 1793లో ప్రవేశపెట్టాడు. ఇందులో రైతుకు, ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం ఉండదు.
 • భూమిశిస్తు వసూలు కోసం విశాలమైన భూములను జమీందార్లకు ప్రభుత్వం కేటాయిస్తుంది.
 • వారు నిర్ణీత పన్నును ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని ‘షేష్‌కష్‌’ అంటారు.

గ్రామవారీ విధానం

 • గ్రామవారీ పద్ధతిని నెల్లూరు జిల్లాలో ప్రవేశపెట్టారు. గ్రామ అధికారులు భూమిశిస్తు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తారు.
 • ప్రభుత్వానికి, రైతులకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం ఉండదు. ఈ విధానం ఉత్తర సర్కారులు, నెల్లూరు, రాయలసీమలో వాడుకలో ఉండేది.

రైత్వారీ విధానం

 • థామస్‌ మన్రో రాయలసీమ జిల్లాలో రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనిని మొదట ప్రతిపాదించినవారు కెప్టెన్‌ రీడ్‌.
 • రైత్వారీ విధానాన్ని అభివృద్ధి చేసినవారు థామస్‌ మన్రో.
 • 1802-1805ల మధ్య  రాయలసీమ ప్రాంతంలో గ్రామంలోని పొలాలను సర్వే చేయించి శిస్తు నిర్ణయించారు.
 • భూమి శిస్తు 50 శాతంగా  నిర్ణయించారు. కఠినంగా పన్ను వసూలు చేశారు.

Download Rebellion of 1857 in Andhra PDF

Indian History Ebook for APPSC GROUP-1, GROUP-2, AP Grama Sachivalayam, JL, DL, DEO and other APPSC Exams by Adda247

Andhra Pradesh State GK 
Andhra Pradesh Culture Andhra Pradesh Economy
Andhra Pradesh Attire Andhra Pradesh Demographics
Andhra Pradesh Music Andhra Pradesh Flora and fauna
Andhra Pradesh Dance Andhra Pradesh Geography
Andhra Pradesh Festivals Andhra Pradesh Arts & Crafts

Sharing is caring!