Telugu govt jobs   »   Study Material   »   Rashtriya Arogya Nidhi

Rashtriya Arogya Nidhi (RAN) Scheme – Health Minister’s Cancer Patient Fund | రాష్ట్రీయ ఆరోగ్య నిధి పథకం

Rashtriya Arogya Nidhi (RAN) Scheme

The ‘Rashtriya Arogya Nidhi’ scheme is implemented by the Government through the Health Minister’s Cancer Patient Fund. The scheme was introduced by the central government in 2009 to provide financial assistance for the treatment of the poor affected by cancer. It is not uncommon for cancer patients to undergo treatment. The disease is neglected as the cost is unaffordable for the poor. That’s why the central government will provide Rs 15 lakh towards the medical expenses of cancer victims as part of the ‘National Health Fund’ scheme to get treatment for the poor cancer victims. 27 Regional Cancer Centers have been set up in the country to provide medical assistance for cancer treatment to the poor living below the poverty line.

Rashtriya Arogya Nidhi : క్యాన్సర్ సోకిన వారు చికిత్స చేయించుకోవడం అంటే మామూలు విషయం కాదు. చాలా ఖరీదుతో కూడుకున్న పని. ఆర్థిక స్తోమత ఉన్నవారు మాత్రమే ధైర్యంగా క్యాన్సర్ కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. పేదవారికి ఈ ఖర్చు భరించలేనిదని వ్యాధిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకోసమే.. కేంద్ర ప్రభుత్వం పేదరికంలో ఉన్న క్యాన్సర్ బాధితులకు చికిత్స చేయించుకునేందుకు ‘రాష్ట్రీయ ఆరోగ్య నిధి’ పథకంలో భాగంగా క్యాన్సర్ బాధితుల వైద్య ఖర్చుల మేరకు రూ.15లక్షలు సాయం చేస్తుంది. దురదృష్టవశాత్తు ఈ పథకం గురించి సరైన ప్రచారం, సమాచారం తెలియక పేదరికంలో ఉండి క్యాన్సర్ తో పోరాడుతున్న వారు వినియోగించుకోలేక పోతున్నారు. గత నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి 97 మంది లబ్ధిదారులు ఉండగా.. తెలంగాణ నుంచి ఒక్కరు కూడా లేరు.

Rashtriya Arogya Nidhi | రాష్ట్రీయ ఆరోగ్య నిధి

 • ‘రాష్ట్రీయ ఆరోగ్య నిధి’ పథకాన్ని హెల్త్ మినిస్టర్స్ క్యాన్సర్ పేషెంట్ ఫండ్ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తుంది.
 • క్యాన్సర్ సోకిన పేదలకు చికిత్స కోసం ఆర్థిక సాయం అందించాలన్న ఉద్దేశంతో 2009లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
 • కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో రాష్ట్రీయ ఆరోగ్య నిధి అమలు అవుతోంది.
 • దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు క్యాన్సర్ చికిత్స కోసం వైద్యం సాయం అందజేయాలని దేశంలో 27 ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
 • మొదట క్యాన్సర్ బాధితుల చికిత్స కోసం రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేస్తారు. తర్వాత అంతకంటే ఎక్కువ డబ్బు అవసరమైతే ‘రాష్ట్రీయ ఆరోగ్య నిధి’కి దరఖాస్తు చేసుకోవాలి.
 • అర్హతలు పరిశీలించి అవసరాన్ని బట్టి గరిష్ఠంగా రూ. 15 లక్షలు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. అయితే ఈ డబ్బును పూర్తిగా క్యాన్సర్ చికిత్స కోసమే ఖర్చు చేయాలి.

Rashtriya Arogya Nidhi (RAN) Scheme - Health Minister's Cancer Patient Fund_30.1APPSC/TSPSC Sure shot Selection Group

List of the treatments under this scheme |ఈ పథకం కింద చికిత్సల జాబితా

ఆర్థిక సహాయం రూ. 2,00,000/- (రూ. రెండు లక్షలు మాత్రమే) చికిత్స కోసం అందించబడుతుంది. ప్రభుత్వం ఇచ్చే పథకం డబ్బుతో ఈ కింది చికిత్సలు చేయించుకోవచ్చు.

 • యాంటీ క్యాన్సర్ కీమోథెరపీ
 • రేడియో థెరపీ మరియు గామా నైఫ్ సర్జరీ/GRT/MRT/బ్రాచీథెరపీతో సహా అన్ని రకాల రేడియేషన్ చికిత్స.
 • బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ – అలోజెనిక్ & ఆటోలోగస్.
 •  PET స్కాన్‌తో సహా రోగనిర్ధారణ విధానాలు.
 • ఆపరేట్ చేయగల ప్రాణాంతక కణితుల కోసం శస్త్రచికిత్స.

Eligibility For Rashtriya Arogya Nidhi Scheme | అర్హతలు

 • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.
 • సంబంధిత MRO జారీ చేసిన రేషన్ కార్డ్, వార్షిక ఆదాయ ధృవపత్రం ఉండాలి.
 • క్యాన్సర్ ఉందని నిర్ధారణ పరీక్షల ధ్రువపత్రాలు ఉండాలి.
 • 27 ప్రాంతీయ క్యాన్సర్ సెంటర్(లు) (RCC)లో మాత్రమే చికిత్స కోసం సహాయం అనుమతించబడుతుంది.
 • కేంద్ర ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వం /PSU ఉద్యోగులు HMCPF నుండి ఆర్థిక సహాయానికి అర్హులు కాదు.
 • క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన చికిత్స/సౌకర్యాలు ఉచితంగా అందుబాటులో ఉన్న చోట HMCPF నుండి గ్రాంట్ ఉపయోగించబడదు

How to Apply for Rashtriya Arogya Nidhi Scheme | ఎలా దరఖాస్తు చేయాలి?

 • రీజనల్ క్యాన్సర్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్ సిఫారసుతో దరఖాస్తు చేసుకోవాలి.
 • అర్హతలను పరిశీలించి కేంద్ర ఆరోగ్య శాఖ రూ.15 లక్షలు ఒకే దఫాలో డబ్బు అకౌంట్ లోకి జమ చేస్తుంది.
 • గతంలో క్యాన్సర్ చికిత్స చేయించుకున్న వారికి ఈ పథకం వర్తించదు. ప్రస్తుతం జరుగుతున్న ట్రీట్మెంట్కు మాత్రమే డబ్బులు ఇస్తారు.
 • కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకాలు, ఆయుష్మాన్ భారత్ పథకంలో ఉన్నట్లయితే ఈ పథకం వర్తించదు.
 • తెలుగు రాష్ట్రాలకు ఒకే రీజనల్ క్యాన్సర్ సెంటర్ ఉంది. అది హైదరాబాద్లో లో ఉంది.
 • mohfw.gov.in వెబ్సైట్లో అప్లికేషన్ ఫారాన్ని డౌన్ లోడ్ చేసి పూర్తిగా నింపాలి.
 • క్యాన్సర్ పేషెంట్ కు చికిత్స చేస్తున్న -హాస్పిటల్ సూపరింటెండెంట్ లేదా మెడికల్ ఆఫీసర్ స్టాంపుతో పాటు సంతకం చేయించాలి.
 • ఈ అప్లికేషన్ న్ను సెక్షన్ ఆఫీసర్, గ్రాంట్స్ సెక్షన్ -మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ రూమ్ నెం. 541, ఏ-వింగ్, నారీమన్ భవన్, న్యూఢిల్లీ అడ్రస్కు పోస్ట్ ద్వారా పంపాలి.

Rashtriya Arogya Nidhi (RAN) Scheme - Health Minister's Cancer Patient Fund_40.1

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

Whether State Government Employees Are Eligible For Financial Assistance of Rashtriya Arogya Nidhi?

Central Government /State Government /PSU employees are not eligible for financial assistance from Rashtriya Arogya Nidhi

How Much amount is provided towards treatment under Rashtriya Arogya Nidhi?

Financial assistance of Rs. 2,00,000/- (Rs. Two lakh only) is provided towards treatment under Rashtriya Arogya Nidhi