Telugu govt jobs   »   Study Material   »   పంచాయితీ రాజ్ వ్యవస్థ

పాలిటి స్టడీ మెటీరీయల్ – పంచాయితీ రాజ్ వ్యవస్థ, డౌన్లోడ్ PDF | APPSC, TSPSC గ్రూప్స్

పంచాయితీ రాజ్ వ్యవస్థ

భారతదేశంలో పంచాయత్ రాజ్ వ్యవస్థ : భారత రాజ్యాంగంలోని IX భాగం పంచాయితీలకు సంబంధించినది. పంచాయత్ రాజ్ వ్యవస్థ అనేది గ్రామీణాభివృద్ధికి భారత పరిపాలనలో మూడు అంచెల నిర్మాణం. జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో స్థానిక స్వపరిపాలనలను అభివృద్ధి చేయడమే పంచాయతీరాజ్ లక్ష్యం. వేద కాలం నుండి ప్రాచీన భారతదేశంలో పంచాయతీరాజ్ మూలాలు ఉన్నాయి. వేద కాలం నుండి, దేశంలో గ్రామం (గ్రామ్) స్థానిక స్వీయ-పరిపాలనకు ప్రాథమిక యూనిట్‌గా పరిగణించబడుతుంది. దేశంలో అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ద్వారా పంచాయత్ రాజ్ వ్యవస్థ  రాజ్యాంగబద్ధం చేయబడింది.

భారతదేశంలో పంచాయితీ రాజ్ వ్యవస్థ

 • భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలకు ఒక మౌళిక స్వరూపాన్ని అందించి వాటిని అభివృద్ధి చేసిన ఘనత లార్డ్ రిప్పన్ కు దక్కుతుంది.
 • అందుకనే లార్డ్ రిప్పను “స్థానిక ప్రభుత్వాల పితామహుడు” అని అంటారు.
 • ఇతను రూపొందించిన 1882 స్థానిక ప్రభుత్వ చట్టంను స్థానిక ప్రభుత్వాలకు మాగ్నాకార్టాగా అభివర్ణిస్తారు.
 • 1882 స్థానిక ప్రభుత్వ చట్టం ప్రకారం స్థానిక ప్రభుత్వాలను క్రింది స్థాయిలలో ఏర్పాటు చేశారు.
 • గ్రామ స్థాయిలో – గ్రామ పంచాయితీలు
 • తాలూకా స్థాయిలో – తాలూకా బోర్డులు
 • జిల్లా స్థాయిలో – జిల్లా బోర్డులు

1907 రాయల్ కమిషన్:

భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల పనితీరును అవి విజయవంతం కాకపోవడాన్ని సమీక్షించడానికి 1907 సంవతరంలో సర్ చార్లెస్ హబ్ హౌస్ అధ్యక్షతన రాయల కమీషన్ ను బ్రిటీష్ ప్రభుత్వం నియమించింది. ఈ కమీషన్ తన నివేదికను 1909 లో సమర్పించింది.

స్వాతంత్ర్యం తర్వాత కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రయోగాలు 

 • స్వాతంత్ర్య అనంతరం దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం ముఖ్యంగా గ్రామీణ సమాజ వికాసం కోసం అభివృద్ధి పథకాలను అమలు చేసేందుకు అనేక ప్రయోగాలు జరిగాయి.
 • అందులో భాగంగా కొన్ని పథకాలు అమలు చేశారు.

సమాజ అభివృద్ధి పథకం 

 • ప్రణాళిక సంఘం (Planning Commission) మొదటి పంచవర్ష ప్రణాళిక (First five year plan) ముసాయిదాను రూపకల్పన చేస్తూ బాగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం తగిన చర్యలను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
 • వి.టి.కృష్ణమాచారి కమిషన్ సలహా మేరకు దేశ వ్యాప్తంగా ఈ పథకాన్ని ఎంపిక చేసిన 50 జిల్లాల్లో 55 బ్లాక్ లో 1952,అక్టోబరు 2న ప్రవేశపెట్టారు.
 • ఈ పథకానికి అమెరికాలోని “ఫోర్డ్ ఫౌండేషన్ సంస్థ” సహకారం అందించింది.
 • వ్యక్తి వికాసం ద్వారా సమాజ సంక్షేమం సాధించడం దీని ప్రధాన ఆశయం.

Polity Quiz in Telugu 20th May 2023_70.1APPSC/TSPSC Sure shot Selection Group

జాతీయ విస్తరణ సలహా కార్యక్రమము 

 • సమాజ అభివృద్ధి పథకానికి అనుబంధంగా ఈ కార్యక్రమాన్ని 1953, అక్టోబరు 2న ప్రవేశపెట్టారు.
 • సమాజ అభివృద్ధి పథకాన్ని 3 సంవత్సరాల కాలానికి రూపొందిస్తే జాతీయ విస్తరణ సేవల కార్యక్రమమును మాత్రం శాశ్వత ప్రాతిపదికపై ప్రారంభించారు.
 • దీని ప్రధాన ఉద్దేశ్యం గ్రామీణ ప్రాంతాల సామాజిక, ఆర్థిక జీవనాన్ని మెరుగు పరచడం (Betterment of Social and Economical Life of Rural Areas)
 • వ్యవసాయం, పశుపోషణ, ప్రజారోగ్యం, సహకార మొదలగు రంగాలలో అభివృద్ధి సాధించటం.
 • ఈ కార్యక్రమం అమలు కోసం కేంద్ర, రాష్ట్ర, జిల్లా, బ్లాక్, గ్రామస్థాయి ప్రత్యేక శాఖలు ఉండేవి.
 • గ్రామ స్థాయిలో ఈ పథకం అమలు కోసం విలేజ్ లెవల్ వర్కర్స్ ను నియమించారు.
 • ఈ విలేజ్ లెవల్ వర్కర్లను సమగ్ర గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాలపై శిక్షణ ఇవ్వడం జరిగిన అందుకే వీరిని Multipurpose Workers పిలిచేవారు.

బల్వంతరాయ్ మెహతా కమిటీ – 1957

 • సమాజ అభివృద్ధి పథకం, జాతీయ విస్తరణ సేవల కార్యక్రమాల ద్వారా ఆశించిన లక్ష్యాలను సాధిస్తున్నామా? లేదా లక్ష్యసాధనకు ఏమైనా మార్పులు అవసరమా అనే అంశాలను పరిశీలించుటకు జాతీయ అభివృద్ధి మండలి (NDC కమిటీని జనవరి 16, 1957న నియమించింది.
 • ఈ కమిటీ “ప్రజాస్వామ్య వికేంద్రీకరణ (Democratic Decentralization) – ప్రజల భాగస్వామ్యం ” (People partcipation) అనే అంశాలతో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను (Three tier Panchayatraj system) సిఫార్సు చేస్తూ తన నివేదికను నవంబర్ 24, 1957న సమర్పించింది.
 • 1958 జనవరిలో బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సులను జాతీయ అభివృద్ధి మండలి (NDC) ఆమోదించింది.

సిఫార్సులు (Recommendations)

 • దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి
 • 1. గ్రామ స్థాయిలో – గ్రామ పంచాయితీ
 • 2. బ్లాక్ స్థాయిలో – పంచాయితీ  సమితి
 • జిల్లా స్థాయిలో – జిల్లా పరిషత్
 • గ్రామ స్థాయిలో ఎన్నికలు ప్రత్యక్షంగా, పంచాయితీ సమితి మరియు జిల్లా పరిషత్ లకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరగాలని సూచించింది.
 • పంచాయతీ సమితి కార్యనిర్వాహక విభాగంగా, జిల్లా పరిషత్ సలహా సమన్వయ మరియు పర్యవేక్షణ విభాగంగా (Advisory, Coordinating and Supervising Agency) పనిచేయాలని సూచించింది.
 • స్థానిక సంస్థలకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నియమబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి.
 • పార్టీల ప్రమేయం లేకుండా ఎన్నికలు నిర్వహించేలా స్థానిక సంస్థలకు అవసరమైన వనరులను ఖచ్చితంగా నిర్దేశించి పంపిణీ చేయాలి.

నోట్ : బల్వంత్ రాయ్ మెహతా కమిటీని మొట్టమొదట “ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీ” (Committee on Democratic Decentralisation) అని అభివర్ణిస్తారు.

కమిటీ సిఫార్సులు అమలు తీరు (Recommendation and their Implementation)

 • దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశ పెట్టిన మొదటి రాష్ట్రం – రాజస్థాన్ (నాగరో జిల్లా)
 • జవహర్ లాల్ నెహ్రూ 1959, అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించారు.  –
 • మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండవ రాష్ట్రం  ఆంధ్రప్రదేశ్.
 • అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిలం సంజీవరెడ్డి 1959, నవంబర్ 1న మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో ప్రారంభించారు.

అశోక్ మెహతా కమిటీ – 1977

 • ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో భాగంగా జనతా ప్రభుత్వం (మొరార్జీ దేశాయ్) ఈకమిటీని 1977, డిసెంబర్ 12న ఏర్పాటు చేసినంది.
 • ఈ కమిటీని రెండవ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీగా పేర్కొంటారు.
 • ‘ అశోక్ మెహతా కమిటీ తన నివేదికను 1978, ఆగష్టు 21న సమర్పిచినది.
 • ఈ కమిటీ సిఫార్సుల సంఖ్య 132.

ముఖ్యమైన సిఫార్సులు (Important Recommendations)

 • మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను రద్దుచేసి రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశ పెట్టాలి. (Introducing tow tier panchayatraj system)
 • ఈ కమిటీ ప్రకారం 2 స్థాయిలను ఏర్పాటు చేయాలి – 1. జిల్లా స్థాయిలో – జిల్లా పరిషత్   2. బ్లాక్ స్థాయిలో – మండల పరిషత్ (ప్రధాన అంచె)
 • గ్రామా చాయితీలను రద్దుచేసి వాటి స్థానంలో “గ్రామ కమిటీ”లు ఏర్పాటు చేయాలి.
 • 1500 నుంచి 2000  జనాభా గల గ్రామాల కమిటీని ఒక మండల పంచాయతీగా ఏర్పాటు చేయాలని సూచించింది.

నోట్: 1. మండల పరిషత్ ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం- కర్ణాటక (అప్పటి ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్గే 1985, అక్టోబరు2న ఈ వ్యవస్థను ప్రారంభించారు.

 • 2. మండల పరిషత్ ను ప్రవేశపెట్టిన రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ (అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 1986, జనవరి 13న సంక్రాంతి సందర్భంగా ప్రవేశపెట్టారు).
 • అశోక్ మెహతా తన నివేదికలో పంచాయితీ సంస్థలను “విఫలమైన దేవుడు – కాదని, వాటికి సరైన విధులు, నిధులు సమకూరిస్తే విజయవంతంగా పని చేస్తాయి” (It is a god that not failed) అని పేర్కొన్నాడు.

దంత్ వాలా కమిటీ – 1978

మోహన్‌లాల్ లల్లూభాయ్ దంత్వాలా నేతృత్వంలోని దంత్వాలా కమిటీ 1978లో RRB గ్రామీణ రుణ నిర్మాణంలో అంతర్భాగంగా ఉండాలని సిఫార్సు చేసింది. బ్లాక్-లెవల్ ప్లానింగ్‌పై దంత్వాలా కమిటీ నివేదిక 1977లో ఏర్పాటైంది. బ్లాక్ ప్లానింగ్ కోసం సంస్థాగత మరియు సంభావిత ఫ్రేమ్‌వర్క్‌ను సూచించడానికి ఇది ఏర్పాటైంది. ఇది 1978లో తన నివేదికను సమర్పించింది.

సి.హెచ్. హనుమంతరావు కమిటీ – 1984

జిల్లా ప్రణాళికలపై ఒక నివేదికను సమర్పించడానికి సి. హెచ్.హనుమంతరావు అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా ప్రణాళికపై హనుమంతరావు కమిటీ నివేదికను 1984లో సమర్పించారు. జిల్లా కలెక్టర్ లేదా మంత్రి ఆధ్వర్యంలోని ప్రత్యేక జిల్లా ప్రణాళికా సంస్థలను కమిటీ ప్రతిపాదించింది.

జి.వి.కె.రావు కమిటీ – 1985

ప్రణాళిక సంఘం గ్రామీణాభివృద్ధి (Rural Development), పేదరిక నిర్మూలన (Poverty Eradication)  కార్యక్రమాల కోసం భారతదేశం యొక్క ప్రస్తుత కార్యాచరణ విధానాలను పరిశీలించడానికి కమీషన్‌ను రూపొందించింది, దీనికి GVK రావు అధ్యక్షత వహించారు. ఇప్పుడు ప్రాజెక్ట్ అభివృద్ధి అధికారీకరణ మరియు పంచాయతీ రాజ్ నుండి విడదీయబడిందని కమిషన్ నిర్ధారించింది.

ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ – 1986

ప్రజాస్వామ్యం మరియు అభివృద్ధికి పంచాయతీ రాజ్ వ్యవస్థలను పునరుద్ధరించే చర్యలను సిఫార్సు చేయడం ప్రధాన లక్ష్యంతో 1986లో భారత ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. కమిటీ ఈ క్రింది సిఫార్సులు చేసింది:

 • పంచాయతీరాజ్ వ్యవస్థలను రాజ్యాంగబద్ధంగా గుర్తించాలని కమిటీ సిఫార్సు చేసింది.
 • పంచాయతీరాజ్ వ్యవస్థలకు స్వేచ్ఛాయుతమైన మరియు న్యాయమైన ఎన్నికలను గుర్తించడానికి రాజ్యాంగ నిబంధనలను కూడా సిఫారసు చేసింది.
 • గ్రామ పంచాయతీని మరింత ఆచరణీయంగా మార్చేందుకు గ్రామాల పునర్వ్యవస్థీకరణకు కమిటీ సిఫార్సు చేసింది.
 • గ్రామ పంచాయితీలు తమ కార్యకలాపాలకు మరింత ఆర్థిక సహాయం చేయాలని సిఫార్సు చేసింది.

పంచాయితీరాజ్ వ్యవస్థ – రాజ్యాంగ నిబంధనలు

 • భారత రాజ్యాంగంలోని 4వ భాగంలోని ఆదేశిక సూత్రాలు నిర్దేశిక నియమాలలో 40వ ప్రకరణ గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేయాలని పేర్కొంటుంది.
 • భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్డ్ నందు గల రాష్ట్ర జాబితాలో  పంచాయితీరాజ్ వ్యవస్థ అనే అంశమును పేర్కొన్నారు.  కాబట్టీ పంచాయితీరాజ్ వ్యవస్థ కార్యనిర్వాహణ బాధ్యత రాష్ట్ర ప్రభుతాలకు ఉంటుంది.
 • 73వ రాజ్యాంగ సవరణ చట్టం  1992 ద్వారా 9వ భాగాన్ని తిరిగి చేర్చి అందులో 243, 243(ఎ) – 243(ఓ) వరకు గల 16 ప్రకరణలలో పంచాయతీరాజ్ వ్యవస్థను పేర్కొన్నారు.
 • 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారానే 11వ షెడ్యూల్డు నూతనంగా చేర్చి అందులో 29 అంశాలతో కూడిన పంచాయతీరాజ్ అధికార విధులను పేర్కొన్నారు. “

73వ రాజ్యాంగ సవరణ చట్టం – 1992 

 • రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఎల్.ఎం.సింఘ్వి, పి.కె.తుంగన్ కమిటీల సూచనలను అనుసరించి పంచాయతీరాజ్ వ్యవస్థకు  రాజ్యాంగ ప్రతిపత్తిని (Constitutional Status) కల్పించేందుకు లోక్ సభలో ప్రవేశపెట్టినది.
 • లోక్ సభలో ఈ బిల్లు 2/3 వంతు మెజారిటీ పొందినప్పటికీ రాజ్యసభలో వీగిపోయింది.
 • ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వి.పి.సింగ్ (నేషనల్ ఫ్రంట్ ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
 • పి.వి.నరసింహారావు ప్రభుత్వం పంచాయితీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించటానికి 73వ రాజ్యాంగ బిల్లును రూపొందించి 1991, సెప్టెంబర్ 16న పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
 • దీనిని పార్లమెంట్ 1992, డిసెంబర్ 22న ఆమోదించింది.
 • ఈ బిల్లు రాష్ట్ర జాబితాలోని అంశాలకు సంబంధించినది కనుక 50 శాతం కంటే తక్కువ కాకుండా రాష్ట్ర శాసన సభలు ఆమోదించాలి
 • ఈ 73వ రాజ్యాంగ సవరణ బిల్లుకు దేశంలో 17 రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి.
 • అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ 1993, ఏప్రిల్ 20న ఈ బిల్లుపై ఆమోదం తెలిపారు.
 • 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1993, ఏప్రిల్ 24 నుండి అమలులోకి వచ్చింది.
 • అందుచేత ఏప్రిల్ 24ను “పంచాయతీ రాజ్ దినోత్సవం”గా (Panchayatraj Day) జరుపుతారు.
 • 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి అనుగుణంగా, మొదటిసారి పంచాయితీ రాజ్ చట్టం రూపొందించిన రాష్ట్రం – కర్నాటక (1993, మే 10).
 • నూతన పంచాయితీరాజ్ చట్టం ప్రకారం మొదటగా పంచాయితీలకు ఎన్నికలు జరిపిన రాష్ట్రం కూడా కర్నాటకనే.

నిబంధన 243 : పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వచనం (Definition) 

” పంచాయితీరాజ్ నిర్వచనాలకు సంబంధించి గవర్నర్ ఒక నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎందుకంటే పంచాయితీరాజ్ వ్యవస్థ రాష్ట్ర జాబితాలో ఉన్నందున వీటిపై చట్టాలు చేసి నిర్వచించే అధికారం రాష్ట్ర శాసన సభకు ఉంటుంది.

నిబంధన 243(ఎ) : గ్రామ సభ ఏర్పాటు (Creation of Grama Sabha) 

 • పంచాయతీరాజ్ వ్యవస్థకు మాతృక – గ్రామ సభ.
 • ” గ్రామ సభ నిర్మాణం, విధులు మొదలగు అంశాలకు సంబంధించి చట్టాలను రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ రూపొందిస్తుంది.
 • ‘ గ్రామ సభ గ్రామ పంచాయితీలోని వయోజనులతో నిండి ఉంటుంది.
 • గ్రామ పంచాయితీ గ్రామ సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది.
 • గ్రామ సభ సంవత్సరమునకు కనీసం రెండు సార్లు సమావేశమవ్వాలి.
 • సమావేశానికి, మరో సమావేశానికి మధ్య, కాలం 6 నెలలకు మించరాదు.
 • ఒక వేల సంవత్సరానికి 2 సార్లు గ్రామసభను ఏర్పాటు చేయకపోతే సర్పంచ్ పదవి రద్దు అవుతుంది.
 • సర్పంచ్ గ్రామ సభకు అధ్యక్షత వహిస్తారు. సర్పంచ్ గైర్హాజరు అయిన పక్షంలో ఉపసర్పంచ్ అధ్యక్షత వహిస్తారు.

నిబంధన 243 (బి) పంచాయతీరాజ్ వ్యవస్థాపన / స్వరూపం 

 • 73 వ రాజ్యాంగ సవరణ చట్టం దేశ వ్యాప్తంగా 3 అంచెల పంచాయితీరాజ్ వ్యవస్థ నెలకొల్పాలని పేర్కొంటుంది.

నిబంధన 243(సి) – పంచాయితీరాజ్ వ్యవస్థ నిర్మాణం, ఎన్నికలు 

 • పంచాయితీలలో అన్ని స్థాయిల్లోని సభ్యులందరూ పౌరులచేత ప్రత్యక్షంగా ఎన్నిక (Direct Election) అవుతారు.
 • జిల్లా పరిషత్ మరియు మండల స్థాయి అధ్యక్షులు పరోక్ష పద్ధతిపై (Indirect Election) ఎన్నుకోబడతారు.

నిబంధన 243(డి) పంచాయితీరాజ్ రిజర్వేషన్లు (Reservations) 

 • SC, ST లకు పంచాయితీరాజ్ అన్ని స్థాయిలలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలి. వీరికి కేటాయించిన 1/3 వంతు స్థానాలకు మహిళలకు కేటాయించాలి.
 • ప్రస్తుతం 10 రాష్ట్రాలలో పంచాయితీరాజ్ ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు వర్తింపజేస్తున్నారు.
 • పంచాయతీరాజ్ ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన మొదటి రాష్ట్రం – బీహార్

నిబంధన 243(ఇ) – పంచాయితీరాజ్ సంస్థల పదవీకాలం (Duration)

 • 73వ రాజ్యాంగ సవరణ చట్టం అనుసరించి పంచాయితీరాజ్ వ్యవస్త అన్ని స్థాయిలలో సభ్యుల మరియు అధ్యకుల పదవీ కాలం 5 సంవత్సరాలు. 

నిబంధన 243 (ఎఫ్) – పంచాయితీ సభ్యుల అర్హతలు- అనర్హతలు (Qualifications and Disqualifications 

 • పంచాయితీరాజ్ వ్యవస్థలోని అన్ని స్థాయిలలోనూ సభ్యులు & అధ్యక్షుల అర్హతలు మరియు అనర్హతలను నిర్ణయించే అధికారం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖకు ఉంటుంది. 
 • పంచాయితీరాజ్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే 21 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

నిబంధన 243 (జి) – పంచాయితీరాజ్ వ్యవస్థ అధికారాలు – విధులు

 • 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో నూతనంగా 11వ షెడ్యూల్ చర్చి అందులో పంచాయితీలు నిర్వర్తించాల్సిన అధికార విధులను పేర్కొన్నారు.
 • 11వ షెడ్యూల్ నందు మొత్తం 29 అధికార విధులున్నాయి.

నిబంధన 243 (హెచ్) పంచాయితీల ఆదాయ వనరులు (Source of Income) 

 • రాష్ట్ర శాసనసభ ఒక చట్టం ద్వారా పంచాయితీలకు కొన్ని పన్నులను విధించి వసూలు చేసుకునే అధికారాన్ని కలిపిస్తుంది.
 • రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పన్నులు వసూలు చేసి పంచాయితీలకు బదలాయిస్తుంది. ఉదా: రహదారి పన్నులు, ఫీజులు

నిబంధన 243 (ఐ) – రాష్ట్ర ఆర్థిక సంఘం (State Finance Commission) 

 • 73వ రాజ్యాంగ సవరణ అమలులోకి వచ్చిన ఒక సంవత్సరం తర్వాత గవర్నర్ రాష్ట్ర ఆర్థిక సంఘంను ఏర్పాటు చేస్తారు. 
 • ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర గవర్నర్ ప్రతి 5 సంవత్సరాలకు ఏర్పాటు చేస్తారు. 

నిబంధన 243(J)- పంచాయతీల ఖాతా ఆడిటింగ్ (Audit of Accounts)

 • రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ నిర్ణయించిన మేరకు ఖాతాలను నిర్వహించడానికి వాటిని ఆడిట్ చేయడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు.

నిబంధన 243(K)- రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) 

 • రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, ఓటర్ల జాబితా మొదలగు అంశాలను స్వేచ్చగా, స్వతంత్రంగా నిర్వహించడానికి రాజ్యాంగ ప్రతిపత్తిగల రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని గవర్నర్ నియమిస్తారు.
 • రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ఏవైనా చట్టాలను రూపొందించే అధికారం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖకు ఉంటుంది.
 • రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ను గవర్నర్ నియమిస్తారు.
 • పదవీ కాలం : 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు ఏది ముందు అయితే అది వర్తిస్తుంది.
 • 73వ రాజ్యాంగ సవరణలోని అంశాలను కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా అనువర్తిస్తారు.
 • శాసన సభలు కలిగి ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలు (ఢిల్లీ, పాండిచ్చేరి) పంచాయత్ రాజ్ సంస్థలకి సంబంధించి చట్టాలు చేసినప్పటికి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శక సూత్రాలకు లోబడే వ్యవహరించాలి.

నిబంధన 243(M) మినహాయింపులు (Exemptions)

73వ రాజ్యాంగ సవరణలో పేర్కొన్న అంశాల నుండి కొన్ని ప్రాంతాలను మినహాయించారు. నిబంధన 243M(1) ప్రకారం ఈ అంశాలు నిబంధన 244(1)లో పేర్కొన్నబడిన షెడ్యూల్ ప్రాంతాలు, 244(2) పేర్కొనబడిన షెడ్యూల్డ్ తెగల ప్రాంతాలలో ఈ విభాగం వర్తించదు.

నిబంధన  243(N)- పూర్వ శాసనాల వర్తింపు (Continuation of Existing Laws)

రాజ్యాంగ సవరణ చట్టం అమలుకు వచ్చిన రోజు నుండి ఒక సంవత్సరం వరకు (1993 ఏప్రిల్ 24 నుండి 1994 ఏప్రిల్ 24) ఆయా రాష్ట్రాలలో ఉన్న పాత పంచాయతీ చట్టాలే కొనసాగించవచ్చు.

నిబంధన 243(0) – పంచాయత్ రాజ్ ఎన్నికల వ్యవహారాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు. (Bar to interference by courts in electoral matters)

పంచాయతీలకు సంబంధించిన నియోజకవర్గాల మొదలగు అంశాలను న్యాయస్థానాల జోక్యం నుండి మినహాయించారు.

పట్టణ ప్రభుత్వాలు (74వ రాజ్యాంగ సవరణ చట్టం – 1992)

 • 1992 డిసెంబర్ 22న పార్లమెంట్ ఆమోదం పొందిన తరువాత 1993 జూన్ 1 నుంచి అమలుకు వచ్చింది.
 • రాజ్యాంగంలో 9 (ఎ) భాగంలో 243 (పి) నుంచి 243 (జడ్.జి) వరకు ఉన్న నిబంధనలు మొత్తం 18. ఇవి పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి వివరిస్తారు. –

12వ షెడ్యూల్ (243 డబ్ల్యు)

ప్రస్తుతమున్న షెడ్యూలుకు మరో షెడ్యూలు అంటే 12వ షెడ్యూలును చేర్చి, అందులో నగరపాలక సంస్థలకు సంబంధించిన అధికారాలను – విధులను 18 అంశాలుగా పేర్కొన్నారు.

12వ షెడ్యూల్ లోని అంశాలు 

 1. పట్టణ ప్రణాళికతో కూడిన నగర ప్రణాళిక
 2. స్థల వినియోగం, భవనాల నిర్మాణ నిబంధన
 3. ఆర్థిక, సాంఘిక అభివృద్ధి నిమిత్తం ప్రణాళిక రచన
 4.  రోడ్లు, వంతెనలు
 5. గృహ, పారిశ్రామిక, వాణిజ్య ఉపయోగం కోసం నీటి సరఫరా (Water supply for household, industrial, trade purpose)
 6. ప్రజారోగ్యం, పారిశుద్ధ్య సంరక్షణ, విశ్వసనీయమైన బంజర్ల నిర్వహణ
 7. ఫైర్ సర్వీసులు
 8. నగర అటవీ పెంపకం, పరిసరాల సంరక్షణ, పర్యావరణ అంశాల పెంపుదల
 9. వికలాంగులు, మానసిక వికలాంగులతో సహా రాజ్యాంగంలోని బలహీనవర్గాల ప్రయోజనాల పరిరక్షణ
 10. మురికివాడల అభివృద్ధి, స్థాయి పెంపు
 11. నగరంలోని పేదరికం తగ్గింపు
 12.  ఉద్యానవనాలు, ఆట స్థలాలు వంటి నగర సౌకర్యాలను కల్పించడం.
 13. సాంస్కృతిక, విద్యా సంబంధమైన, కళాత్మక అంశాల పెంపు
 14. భవన సముదాయాలు, శవ దహనాలు, దహన వాటికలు, విద్యుత్ శ్మశాన వాటికలు.
 15. బందెల దొడ్లు, పశువుల పట్ల క్రూరత్వ నివారణ

DOWNLOAD: పంచాయితీ రాజ్ వ్యవస్థ

పాలిటి స్టడీ మెటీరియల్ – భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం
పాలిటి స్టడీ మెటీరియల్ – రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలు 
పాలిటి స్టడీ మెటీరియల్ తెలుగులో
పాలిటీ స్టడీ మెటీరియల్ – ఫిరాయింపుల వ్యతిరేక చట్టం
పాలిటీ స్టడీ మెటీరియల్ – భారత రాజ్యాంగంలోని 44వ సవరణ చట్టం 1987
పాలిటి స్టడీ మెటీరియల్ – భారత రాజ్యాంగ రూపకల్పన
పాలిటి స్టడీ మెటీరీయల్ – కేంద్రం-రాష్ట్ర సంబంధాలపై కమిటీలు
పాలిటి స్టడీ మెటీరీయల్ – న్యాయ క్రియా శీలత 
పాలిటి స్టడీ మెటీరీయల్ – భారతదేశంలో ఎన్నికల చట్టాలు

Static-GK-Longest Rivers In India, Check Complete Details_170.1

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

What is panchayat raj Act system in India?

In India, the Panchayati Raj now functions as a system of governance in which gram panchayats are the basic units of local administration.

What is the 73rd amendment of Panchayati Raj?

The Act empowered state governments to take the necessary steps that would lead to the formalisation of the gram panchayats and help them operate as units of self-governance.

What is Article 243 of Panchayati Raj?

There shall be constituted in every State, Panchayats at the village, intermediate and district levels in accordance with the provisions of this Part.

What is the main objective of Panchayati Raj system?

Panchayat Raj System in India aims to build democracy at the grass-root level.