Telugu govt jobs   »   Latest Job Alert   »   NFL మ్యానేజ్మెంట్ ట్రైనీ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్...

NFL మ్యానేజ్మెంట్ ట్రైనీ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ విడుదల

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ 2023: నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వివరణాత్మక నోటిఫికేషన్ pdf 02 నవంబర్ 2023న NFL అధికారిక వెబ్‌సైట్ www.nationalfertilizers.comలో విడుదల చేయబడింది. మొత్తం 74 ఖాళీలకు వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ PDF, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ, అప్లికేషన్ లింకు, మొదలైన అన్నీ అంశాలను ఈ కధనంలో అందించాము.

NFL రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ విడుదల

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ 74 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులను మార్కెటింగ్, ఎఫ్ అండ్ ఏ, లా వంటి సంస్థలోని వివిధ విభాగాల్లో మేనేజ్ మెంట్ ట్రైనీలుగా నియమిస్తారు. దరఖాస్తు ప్రక్రియ 02 నవంబర్ 2023 నుంచి ప్రారంభమవుతుంది. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలను క్రింది కథనంలో తెలుసుకోండి.

AP DCCB Recruitment Notification 2022_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ PDF

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ తన అధికారిక వెబ్‌సైట్ www.nationalfertilizers.comలో NFL రిక్రూట్‌మెంట్ 2023 PDFని విడుదల చేసింది. మేనేజ్‌మెంట్ ట్రైనీ స్థానానికి అభ్యర్థుల తుది ఎంపిక ఆఫ్‌లైన్ పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూకి అర్హత సాధించిన తర్వాత ఉంటుంది. ఇక్కడ, మేము నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ 2023 కోసం ముఖ్యమైన తేదీలు, అర్హత ప్రమాణాలు, జీతం మొదలైన సమాచారంతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్ PDFని జోడించాము.

NFL రిక్రూట్‌మెంట్ 2023- నోటిఫికేషన్ PDF డౌన్‌లోడ్ చేసుకోండి

NFL రిక్రూట్‌మెంట్ 2023: అవలోకనం

అభ్యర్థులు NFL రిక్రూట్‌మెంట్ 2023 కి సంభందించిన ముఖ్యాంశాలను దిగువ పట్టికలో అందించాము. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ 2023కి సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలను మేము ఈ కధనం లో పొందుపరిచాము.

NFL రిక్రూట్‌మెంట్ 2023
సంస్థ నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్
పోస్ట్ మ్యానేజ్మెంట్ ట్రైనీ
ఖాళీలు 74
అప్లికేషన్ విధానం ఆన్లైన్
NFL మ్యానేజ్మెంట్ ట్రైనీ విద్యార్హతలు వివిధ పోస్ట్ లకు వివిధ అర్హతలు ఉన్నాయి
వయస్సు 18-27 Years
ఎంపిక విధానం ఆఫ్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ
జీతం ₹40000-140000

NFL రిక్రూట్‌మెంట్ 2023: ముఖ్యమైన తేదీలు

NFL రిక్రూట్‌మెంట్ 2023కి సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ క్రింది పట్టికలో అందించాము. నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ 2023 కి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకోవాలి.

NFL రిక్రూట్‌మెంట్ 2023: ముఖ్యమైన తేదీలు

ఈవెంట్స్ తేదీలు
NFL రిక్రూట్మెంట్ 2023 అప్లికేషన్ ప్రారంభ తేదీ 02 నవంబర్ 2023
NFL రిక్రూట్మెంట్ 2023 అప్లికేషన్ చివరి తేదీ 01 డిసెంబర్ 2023

NFL రిక్రూట్‌మెంట్ 2023 ఆన్‌లైన్‌ దరఖాస్తు లింకు

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(NFL) రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల కోసం మేము ఆన్లైన్ లింకు ని అందించాము. NFL మ్యానేజ్మెంట్ ట్రైనీ కోసం ఆన్‌లైన్ లింక్‌ 02 నవంబర్ 2023 నుండి యాక్టివేట్ చేయబడింది. అధికారిక వెబ్‌సైట్, www.nationalfertilizers.com లో మేనేజ్‌మెంట్ ట్రైనీల 74 ఖాళీల కోసం దరఖాస్తు విధానాన్ని ప్రారంభించబడింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, ఈ దిగువన ఉన్న అప్లై ఆన్‌లైన్ లింక్‌ ద్వారా అభ్యర్ధులు NFL 2023 నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

NFL రిక్రూట్‌మెంట్ 2023- మేనేజ్‌మెంట్ ట్రైనీల దరఖాస్తు లింకు 

NFL మ్యానేజ్మెంట్ ట్రైనీ ఖాళీలు 2023

NFL రిక్రూట్‌మెంట్ 2023 మేనేజ్‌మెంట్ ట్రైనీల కోసం మొత్తం 74 ఖాళీలను విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు NFL రిక్రూట్‌మెంట్ 2023 యొక్క కేటగిరీ వారీగా ఖాళీలను ఈ దిగువ పట్టికను తనిఖీ చేయండి.

NFL రిక్రూట్మెంట్ ఖాళీలు 2023

పోస్టు పేరు మొత్తం ఖాళీలు

విభాగాల వారీగా ఖాళీలు

UR SC ST OBC EWS PWBD ExSM
మేనేజ్ మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) 60 25 10 06 13 06 03
మేనేజ్ మెంట్ ట్రైనీ (ఎఫ్ అండ్ ఏ) 10 06 01 02 01
మేనేజ్ మెంట్ ట్రైనీ (లా) 04 03 01

NFL MT రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు రుసుము

కేటగిరీ వారీగా NFL రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు రుసుమును అందించాము.  అభ్యర్ధులు దరఖాస్తు రుసుము విజయవంతంగా చెల్లించిన తర్వాతనే అప్లికేషన్ ఆమోదించబడుతుంది, ఈ విషయం గమనించగలరు.

NFL రిక్రూట్మెంట్ 2023 దరఖాస్తు ఫీజు

విభాగం దరఖాస్తు ఫీజు
UR/EWS/ OBC ₹ 700/- (బ్యాంక్ ఛార్జీలు అదనం)
SC/ST/PwBD/ExSM/డిపార్ట్మెంట్ అభ్యర్ధులు

 

నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ అర్హత ప్రమాణాలు 2023

నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ మ్యానేజ్మెంట్ ట్రైనీ 2023కి దరఖాస్తు చేయడానికి అభ్యర్ధులు తగిన అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి. NFL MT అర్హత ప్రమాణాలు 2023లో వివిధ పోస్ట్ లకు విద్యా అర్హత, వయో పరిమితి మొదలైనవి వివిధ పారామితులు కలవు. నోటిఫికేషన్ PDFలో పేర్కొన్నట్లుగా, అర్హత ప్రమాణాల కోసం కటాఫ్ తేదీ 31 అక్టోబర్ 2023 (31.10.2023) నాటికి పరిగణించబడుతుంది.

NFL మేనేజ్‌మెంట్ ట్రైనీ విద్యా అర్హతలు 

నోటిఫికేషన్ PDFలో పేర్కొన్న విధంగా NFL రిక్రూట్‌మెంట్ 2023 కింద వివిధ విభాగాలకు అవసరమైన విద్యా అర్హతలు క్రింద అందించాము.

NFL మేనేజ్మెంట్ ట్రైనీ 2023 విద్యార్హతలు 

పోస్ట్  విద్యార్హతలు
మేనేజ్ మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) యూజీసీ/ఏఐసీటీ/ఐసీఏఆర్ ఈ గుర్తింపు పొందిన యూనివర్సిటీలు/సంస్థల నుంచి మార్కెటింగ్/అగ్రి బిజినెస్ మార్కెటింగ్/రూరల్ మేనేజ్మెంట్/ఫారిన్ ట్రేడ్/ఇంటర్నేషనల్ మార్కెటింగ్లో 02 ఏళ్లలో కనీసం 60% మార్కులతో (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు 50%) ఫుల్టైమ్ ఎంబీఏ/ పీజీడీబీఎం/ పీజీడీఎం ఉత్తీర్ణత

B.Sc.సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్/ అగ్రోనమీ/ సాయిల్ సైన్స్/ అగ్రికల్చర్ కెమిస్ట్రీ/ ఎంటమాలజీ/ పాథాలజీలో స్పెషలైజేషన్తో M.Sc (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు 50 శాతం) ఉత్తీర్ణత.

మేనేజ్ మెంట్ ట్రైనీ (ఎఫ్ అండ్ ఏ) ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా/ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) నుంచి సీఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎంఏ తుది పరీక్షలో ఉత్తీర్ణతతో పాటు బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
మేనేజ్ మెంట్ ట్రైనీ (లా) బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదించిన కళాశాల/ విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు 50%) లేదా 05 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఫుల్ టైమ్ ఎల్ఎల్బీ లేదా బీఎల్ డిగ్రీ (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు 50 శాతం) ఉత్తీర్ణులై ఉండాలి.

NFL మ్యానేజ్మెంట్ ట్రైనీ వయో పరిమితి 2023

నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ 2023కి దరఖాస్తు చేయడానికి అభ్యర్ధులు తగిన వయస్సు కలిగి ఉండాలి.

  • కనీస వయస్సు – 18 YRS
  • గరిష్ట వయస్సు- 27 YRS

NFL రిక్రూట్‌మెంట్ 2023 ఎంపిక ప్రక్రియ

నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ 2023 ఎంపిక ప్రక్రియ రెండు విభాగాలలో జరుగుతుంది. అభ్యర్ధులు రెండు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి.  వ్యక్తిగత ఇంటర్వ్యూ లో క్వాలిఫై అయ్యిన అభ్యర్ధులు ఉద్యోగం పొందుతారు.

  • ఆఫ్‌లైన్ OMR ఆధారిత పరీక్ష
  • వ్యక్తిగత ఇంటర్వ్యూ.

NFL మేనేజ్‌మెంట్ ట్రైనీ జీతం

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ స్థానానికి ఎంపికైన అభ్యర్థులకు తగిన వేతనాన్ని పొందుతారు. ప్రాథమిక వేతనంతో పాటు, అభ్యర్థులు వివిధ ప్రోత్సాహకాలు మరియు అలవెన్సులను అందుకుంటారు.

NFL మేనేజ్‌మెంట్ ట్రైనీ జీతం

పోస్ట్ జీతం
మ్యానేజ్మెంట్ ట్రైనీ ₹40000-140000

Bank Foundation (Pre+Mains) Live Batch | Online Live Classes by Adda 247

మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!