Telugu govt jobs   »   Study Material   »   మైనారిటీ అభ్యర్ధులకు నయా సవేరా' లేదా 'ఉచిత...

నయా సవేరా’ లేదా ‘ఉచిత కోచింగ్ అండ్ అలైడ్’ పథకం

సిక్కు, జైన్, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ మరియు పార్సీ అనే ఆరు మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన విద్యార్థులు/అభ్యర్థులకు అర్హత పరీక్షల కోసం ప్రత్యేక కోచింగ్ ద్వారా సహాయం చేయడానికి మంత్రిత్వ శాఖ ‘నయా సవేరా’ పథకాన్ని ‘ఉచిత కోచింగ్ అండ్ అలైడ్ స్కీమ్’ అని కూడా పిలవబడే పధకాన్ని అమలుచేస్తోంది.

నయా సవేరా పధకం గురించి

మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉచిత కోచింగ్ మరియు అనుబంధ పథకాన్ని (నయా సవేరా)ని అమలు చేస్తోంది, దీని కింద ఆరు నోటిఫైడ్ మైనారిటీ కమ్యూనిటీలకు (సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు మరియు ముస్లింలు) చెందిన విద్యార్థులు/అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందించబడుతుంది. ఆరు నోటిఫైడ్ మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన విద్యార్థులు/అభ్యర్థులకు ప్రత్యేక కోచింగ్ ద్వారా సాధికారత కల్పించడానికి, పోటీ పరీక్షలకు వారిని సిద్ధం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగం/ ప్రభుత్వ రంగ కంపెనీ లో ఉద్యోగం తెచ్చుకోవాలి అని అనుకునే విధ్యార్ధులకి ఇది ఒక మెరుగైన అవకాశం.

అమృత్ భారత్ స్టేషన్ పథకం, కీలక లక్ష్యాలు, అమృత్ భారత్ స్టేషన్ జాబితా_40.1APPSC/TSPSC Sure shot Selection Group

ఉచిత కోచింగ్ పధకం లో కోర్సులు

నయా సవేరా పధకం కింద మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  నోటిఫై చేసిన మైనారిటీ కమ్యూనిటి కి చెందిన విధ్యార్ధులకి ఉచితంగా కోచింగ్ అందిస్తోంది. ఈ కోచింగ్ టెక్నికల్/ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి ఉండే అర్హత పరీక్షలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, రైల్వేలతో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని గ్రూప్ ఏ, ‘బి’, ‘సి’ సర్వీసులు, ఇతర తత్సమాన పోస్టుల నియమకాలకి శిక్షణ కి అవకాశం కల్పిస్తుంది. పరీక్షల వివరాలు:

  • యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)
  • స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)
  • రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBs.)
  • IBPS నిర్వహించే బ్యాంకు, ఇన్షూరెన్స్ పరీక్షలు
  • రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు (PSC’s)

‘నయా సవేరా’ పథకం: లక్ష్యాలు

నోటిఫైడ్ మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ అందించడం ఈ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం:

  • కోచింగ్ తీసుకునే స్థాయి లేని విధ్యార్ధిని/ విధ్యార్ధులకు ఆర్ధికంగా సహాయంచేసి కోచింగ్ అండీచడం
  • ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అన్న తపన, పట్టుదల ఉండి వేరే ఊరికి వెళ్ళే స్థోమత లేని వారికి మంచి కోచింగ్ సెంటర్ లో కోచింగ్ అందించడం
  • ప్రభుత్వ పరీక్షలకే కాకుండా, ఇంజినీరింగ్, మెడికల్, లా, మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొదలైన టెక్నికల్/ప్రొఫెషనల్ కోర్సులలో ప్రవేశానికి అర్హత పరీక్షలకు సిద్ధమవ్వాలి అని అనుకున్న వారికి కూడా ఒక మంచి అవకాశాన్ని అందించడం
  • విదేశీ విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్ పొందేందుకు అవసరమైన భాష/అప్టిట్యూడ్ పరీక్షలకు సిద్ధమవుతున్నా వారికి కోచింగ్ కి సహాయం చేయడం.

నయా సవేరా పథకం కింద కోచింగ్ వ్యవధి 3 నెలల నుండి 2 సంవత్సరాల వరకు అందించనున్నారు. కాల వ్యవధి ఎంచుకున్న పరీక్షని బట్టి ఉంటుంది.

ఉచిత కోచింగ్ మరియు అనుబంధ పథకం: 2007 నుండి మైనారిటీ కమ్యూనిటీలకు సాధికారత

మైనారిటీ కమ్యూనిటీల అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని ‘ఉచిత కోచింగ్ మరియు అనుబంధ పథకం’ జూలై 17, 2007న ప్రారంభించబడింది. దాని ప్రారంభం నుండి, నయా సవేరా పథకం (‘ఉచిత కోచింగ్ అండ్ అలైడ్’ పథకం అని కూడా పిలుస్తారు) 1.19 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చింది. వీరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 12,155 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆర్ధిక సంవత్సరం 2022-2023 కి గాను 5090 మంది విధ్యార్ధిని విధ్యార్ధులకు ఉచిత కోచింగ్ అందించారు.

మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురించి

  • మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ నుండి ప్రత్యేక సంస్థగా 29 జనవరి 2006న స్థాపించబడింది.
  • ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు మరియు జైనులు, గుర్తించబడిన మైనారిటీ సంఘాలు ఎదుర్కొంటున్న ఆందోళనలు మరియు సమస్యలను మంత్రిత్వ శాఖ పరిష్కరిస్తుంది.
  • మంత్రిత్వ శాఖ యొక్క ప్రాథమిక బాధ్యతలు సమగ్ర విధానాల రూపకల్పన, వ్యూహాత్మక ప్రణాళిక, సమన్వయం, మూల్యాంకనం మరియు రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ల సమీక్ష మరియు మైనారిటీ వర్గాల అభ్యున్నతి మరియు ప్రయోజనం కోసం ఉద్దేశించిన అభివృద్ధి కార్యక్రమాలను కలిగి ఉంటాయి.

పోటీ పరీక్షలకు కీలకమైన అంశాలు

  • మైనారిటీ వ్యవహారాల మంత్రి: శ్రీమతి. స్మృతి జుబిన్ ఇరానీ

అమృత్ భారత్ స్టేషన్ పథకం, కీలక లక్ష్యాలు, అమృత్ భారత్ స్టేషన్ జాబితా_50.1

 

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!