Telugu govt jobs   »   Current Affairs   »   National Leprosy Eradication Programme

National Leprosy Eradication Programme | జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం

National Leprosy Eradication Programme :

National Leprosy Eradication Programme is a Centrally Sponsored scheme. The strategy of National Leprosy Eradication Programme was based on controlling the disease through reduction in the quantum of infection in the population and reduction in infective source, thus breaking the chain of disease transmission.

National Leprosy Eradication Programme | జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం కేంద్ర ప్రాయోజిత పథకం. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జనాభాలో సంక్రమన పరిమాణాన్ని తగ్గించడం మరియు సంక్రమన మూలాన్ని తగ్గించడం ద్వారా వ్యాధిని నియంత్రించడంపై ఆధారపడింది, తద్వారా వ్యాధి వ్యాప్తి చెందడాన్ని ఆపవచ్చు. వ్యాధి భారాన్ని తగ్గించడం మరియు నివారణ కోసం ప్రజలలో అవగాహన కల్పించడం కోసం జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2030 నాటికి ప్రతి జిల్లాలోనూ కుష్టు వ్యాధిని నిర్మూలించాలని జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.

APPSC AMVI Exam Pattern 2022, Check Complete Exam Pattern |_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

Objectives of National Leprosy Eradication Programme | జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం లక్ష్యాలు

  • దేశంలోని అన్ని జిల్లాల్లో 10,000 జనాభాకు 1 కేసు కంటే తక్కువ వ్యాప్తి రేటును తగ్గించడం.
  • కుష్టు వ్యాధితో భాధపడుతున్న వ్యక్తుల వైకల్య నివారణ & వైద్య పునరావాసాన్ని బలోపేతం చేయడం.
  • కుష్టు వ్యాధితో భాధపడుతున్న వ్యక్తుల అపవాద స్థాయి తగ్గించడం.

What is Leprosy? | కుష్టు వ్యాధి అనగా ఏమిటి?

కుష్టు వ్యాధి మైకోబాక్టీరియం లెప్రే అనే బాక్టీరియం వల్ల వస్తుంది, ఇది ఇతరులకు డ్రాప్-లెట్ (గాలి ద్వారా) ద్వారా బహుళ-బాసిల్లరీ లెప్రసీ దగ్గు ఉన్న వ్యక్తి తుమ్మినప్పుడు వ్యాపిస్తుంది.

Affected areas | సంక్రమన భాగాలు :

చర్మం, శ్వాసకోశ భాగాలు, పరిధియ నరాలు.

Symptoms | లక్షణాలు :

  • చేతులు మరియు కాళ్ళు తిమ్మిరి పట్టడం.
  • అరికాళ్ళపై పుండ్లు.
  • కండరాల బలహీనత మరియు అధిక బరువు తగ్గడం.
  • చర్మంపై ఎర్రటి మచ్చలు.

Major initiatives Under NLEP  | NLEP కింద ప్రధాన కార్యక్రమాలు

  • అత్యధికంగా ఉన్న జిల్లాల్లో 14 రోజుల పాటు కుష్టు వ్యాధి గుర్తింపు ప్రచారం
  • కుష్టు వ్యాధి అనుమానితుల కోసం ఆశా ఆధారిత నిఘా (ABSULS)
  • వ్యాధిగ్రస్తులను గుర్తించడం కోసం తక్కువ స్థానిక జిల్లాల్లో కూడా దృష్టి ని కేంద్రీకరించారు.
  • ముందస్తుగా కేసును గుర్తించడం మరియు సమయానికి చికిత్స చేయడం కోసం కష్ట తరమైన  ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రత్యేక ప్రణాళికలు.
  • NIKUSTH – అనే కుష్టు వ్యాధి కి సంబంధించిన రిపోర్టింగ్ సాఫ్ట్ వేర్ ను భారత దేశం అంతటా అమలు చేశారు.
  • జాయింట్ మానిటరింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్ గ్రూప్ (JMIG) ఏర్పాటు చేయబడింది. జనవరి 30 న కుష్టు వ్యాధి అవగాహన ప్రచారాలు జరుపుతారు.
  • జిల్లాలో ఆరోగ్య కార్యకర్తలను ప్రోత్సహించడం కోసం, కుష్టు వ్యాధి  నిర్మూలనను సాధించినందుకు జిల్లాలకు రెండు వర్గాలుగా ధృవీకరణ మరియు అవార్డును అందించడం.  అవి : 1)గోల్డ్ కేటగిరీ 2)సిల్వర్ కేటగిరీ
  • కుష్టు వ్యాధి వ్యాప్తి చెందకుండా కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించి వారి నుండి సంక్రమ చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు.
  • వైకల్యం నివారణ మరియు వైద్య పునరావాసం (DPMR) కార్యక్రమం కింద వివిధ సేవలు అందించబడతాయి, అనగా, ప్రతిచర్య నిర్వహణ, మైక్రోసెల్యులర్ రబ్బర్ (MCR) పాదరక్షలు, ఎయిడ్స్ & ఉపకరణాలు, స్వీయ-సంరక్షణ కిట్‌లు మొదలైనవి అందించబడతాయి.
  • పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు జిల్లా ఆసుపత్రులు/మెడికల్ కాలేజీలు/ సెంట్రల్ లెప్రసీ ఇన్‌స్టిట్యూట్‌లలో నిర్వహించబడతాయి మరియు పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న ప్రతి పేషెంట్‌కు రూ. 8000 సంక్షేమ భత్యం చెల్లించబడుతుంది.

National Leprosy Eradication Programme FAQ | జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం తరచుగా అడిగే ప్రశ్నలు

ప్ర. ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

జ. జనవరి 30 న ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవాన్నిజరుపుకుంటారు.

ప్ర. కుష్టు వ్యాధిని కలుగజేసె బాక్టీరియా పేరు ఏమిటి?

జ. కుష్టు వ్యాధిని కలుగజేసె బాక్టీరియా పేరు మైకోబాక్టీరియం లెప్రే.

adda247

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

When was World Leprosy Day celebrated?

It was celebrated on January 30.

Which bacteria causes Leprosy?

Mycobacterium leprae causes leprosy.