Minister Mallareddy From Telangana Was Awarded The Visionary Man Award | తెలంగాణకి చెందిన మంత్రి మల్లారెడ్డి కి విజనరీ మ్యాన్ అవార్డు లభించింది
తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ విజనరీ మ్యాన్ గా అవార్డు సాధించిన ఆయన 77వ స్వాత్రంత్య దినోత్సవం రోజున ఈ అవార్డు అందుకున్నారు.
సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కళాశాలలో డైరెక్టర్లు ప్రీతిరెడ్డి, భద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా తనకు ఆ అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని మెడికో విద్యార్థులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. కష్టపడితేనే ఎవరైనా విజయం సాధించగలరనడానికి ఈ అవార్డులే నిదర్శనమన్నారు. ప్రజల ఆశీర్వాదం వల్ల జీవితంలో తనకు అన్ని సంపదలు చేకూరాయని, ఇక మిగిలిన జీవితమంతా ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తానని చెప్పారు.
కాలేజీలు స్థాపించి ప్రపంచం గర్వించే విధంగా డాక్టర్లను, ఇంజనీర్లను తయారు చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రయత్నం చేస్తే ఎవరైనా చరిత్ర రాయవచ్చని అన్నారు. ఇన్ని కాలేజీలు పెడతానని, మెడికాలేజీలు ఉంటాయని తాను ఏనాడూ అనుకోలేదని అన్నారు.
విద్యార్థులు పట్టుదలతో కృషి చేయాలని, ప్రతిరోజు కష్టపడి విజయం సాధించాలని, ఇదే పరమావధిగా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంత మంది డాక్టర్ల మధ్య విజనరీ అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉందని మల్లారెడ్డి అన్నారు.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
***************************************************************************