MHSRB మెడికల్ ఆఫీసర్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది
MHSRB తెలంగాణ మెడికల్ ఆఫీసర్ ఆన్‌లైన్ దరఖాస్తు 2023: మెడికల్ & హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, తెలంగాణ MHSRB తెలంగాణ మెడికల్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఆన్లైన్ దరఖాస్తు ను 07 ఆగస్టు 2023 నుండి తన అధికారిక వెబ్‌సైట్ https://mhsrb.telangana.gov.inలో ప్రారంభించబడింది. ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లో మొత్తం 156 మెడికల్ ఆఫీసర్ (యునాని/ హోమియోపతి/ ఆయుర్వేదం) ఖాళీలు కోసం దరఖాస్తు చివరి తేది 21 సెప్టెంబర్ 2023. MHSRB తెలంగాణ మెడికల్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి మేము డైరెక్ట్ లింక్‌ను అందిస్తాము. ఈ కథనంలో, మేము MHSRB తెలంగాణ మెడికల్ ఆఫీసర్ దరఖాస్తు చేయడానికి దశలు, దరఖాస్తు రుసుము వంటి అన్ని వివరాలను అందిస్తున్నాము
MHSRB తెలంగాణ మెడికల్ ఆఫీసర్ నోటిఫికేషన్ 2023 PDF
MHSRB తెలంగాణ మెడికల్ ఆఫీసర్ ఆన్‌లైన్ దరఖాస్తు 2023 అవలోకనం
మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB), తెలంగాణాలో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ క్రింద మెడికల్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆన్లైన్ లో స్వీకరిస్తుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు 07 ఆగస్టు 2023 నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.
MHSRB తెలంగాణ మెడికల్ ఆఫీసర్ ఆన్‌లైన్ దరఖాస్తు 2023 అవలోకనం |
|
సంస్థ పేరు | మెడికల్ & హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, తెలంగాణ |
పోస్ట్ పేరు | మెడికల్ ఆఫీసర్ |
పోస్ట్‌ల సంఖ్య | 156 పోస్ట్‌లు |
నోటిఫికేషన్ విడుదల తేదీ | 13 జూలై 2023 |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 7 ఆగస్టు 2023 |
అప్లికేషన్ ముగింపు తేదీ | 21 సెప్టెంబర్ 2023 |
అప్లికేషన్ విధానం | ఆన్లైన్ |
ఉద్యోగ స్థానం | తెలంగాణ |
అధికారిక సైట్ | https://mhsrb.telangana.gov.in/ |
APPSC/TSPSC Sure shot Selection Group
MHSRB తెలంగాణ మెడికల్ ఆఫీసర్ ఆన్‌లైన్ దరఖాస్తు 2023 లింక్
తెలంగాణ ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టుల కోసం బోర్డు వెబ్‌సైట్ https://mhsrb.telangana.gov.in లో ఆన్‌లైన్‌లో అర్హులైన వ్యక్తుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ 07 ఆగస్టు 2023 నుండి ప్రారంభమమైంది. అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి.. ముందుగా నమోదు చేసుకుని తమ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి. తెలంగాణ ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది 21 సెప్టెంబర్ 2023.
MHSRB తెలంగాణ మెడికల్ ఆఫీసర్ ఆన్‌లైన్ దరఖాస్తు 2023 లింక్
MHSRB తెలంగాణ మెడికల్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
మెడికల్ & హెల్త్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) తెలంగాణ ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లో 156 మెడికల్ ఆఫీసర్ ఖాళీల పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. కింది దశలను అనుసరించి అభ్యర్ధులు విజయవంతంగా తమ దరఖాస్తును సమర్పించవచ్చు.
- దశ 1: అభ్యర్ధులు ముందుగా మెడికల్ & హెల్త్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) తెలంగాణ అధికారిక వెబ్‌సైట్ https://mhsrb.telangana.gov.in ను సందర్శించాలి.
- దశ 2: మెడికల్ ఆఫీసర్స్ (ఆయుష్) పోస్టుల కోసం దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయండి.
- దశ 3: దరఖాస్తు ఫారమ్‌లో పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఈ-మెయిల్ చిరునామా, మొబైల్ నంబర్, విద్యార్హత మొదలైన అన్ని తప్పనిసరి వివరాలను పూరించి నమోదు చేసుకోండి.
- దశ 4: రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ పొందడానికి సూచనలను అనుసరించండి మరియు దశల వారీగా నమోదు ప్రక్రియను పూర్తి చేయండి.
- దశ 5: నిర్ణీత పరిమాణంలో పత్రాల స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయండి.
- దశ 6: సమర్పించే ముందు, దరఖాస్తు ఫారమ్‌ను ప్రివ్యూ చేసి, అన్ని వివరాలను జాగ్రత్తగా తనిఖీ చేయాలి.
- దశ 7: భవిష్యత్ సూచన కోసం మీ దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి.
MHSRB తెలంగాణ మెడికల్ ఆఫీసర్ సిలబస్ 2023
MHSRB తెలంగాణ మెడికల్ ఆఫీసర్ 2023 దరఖాస్తు రుసుము
- ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము: ప్రతి దరఖాస్తుదారు తప్పనిసరిగా రూ. 500/-. ఈ కేటగిరీ కింద ఎలాంటి ఫీజు మినహాయింపు లేదు.
- ప్రాసెసింగ్ ఫీజు: దరఖాస్తుదారు తప్పనిసరిగా రూ. 200/-.
- అయితే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన SC, ST, BC, EWS, PH & మాజీ సైనికులకు చెందిన అభ్యర్థులు, తెలంగాణ రాష్ట్రంలోని 18 నుండి 44 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ దరఖాస్తుదారులకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
- గమనిక: ఇతర రాష్ట్రాలకు చెందిన దరఖాస్తుదారులు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడరు
- ఫీజు చెల్లింపు విధానం – దరఖాస్తు ఫారమ్ వివరాలను పూరించిన తర్వాత ఆన్‌లైన్ సూచనలను అనుసరించి చెల్లింపు గేట్‌వే ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి.
MHSRB తెలంగాణ మెడికల్ ఆఫీసర్ అర్హత ప్రమాణాలు
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |