తిరుపతి జిల్లా మన్నవరంలో భారీ విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కలను నిజంచేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ–బీహెచ్‌ఈఎల్‌తో కలిసి 750 ఎకరాల్లో ఈ యూనిట్ ఏర్పాటుకు అంకురార్పణ చేయగా ఆయన మరణానంతరం అది ఆగిపోయింది . కానీ, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ సర్కార్ మన్నవరంలో సోలార్ వంటి పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించిన ఉపకరణాల తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధంచేస్తోంది.
అలాగే, ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పునరుత్పాదక ఇంధన ఉపకరణాల దిగుమతులను తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు మాన్యుఫాక్చరింగ్ జోన్స్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందుకు ఇష్టమైన రాష్ట్రాలు, భాగస్వామ్య కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానిస్తూ తాజాగా టెండర్లను పిలిచింది. వీటిలో.. ఇప్పటికే ఉన్న రెండు విద్యుత్ ఉపకరణాల తయారీ కేంద్రాలను (బ్రౌన్‌ఫీల్డ్) సోలార్ ఉపకరణాల యూనిట్లుగా మార్చడంతోపాటు వీటికి అదనంగా మరో గ్రీన్‌ఫీల్డ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో.. బ్రౌన్‌ఫీల్డ్ విభాగంలో మన్నవరాన్ని అభివృద్ధిచేసేలా రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది. ఒక్కొక్కటి రూ.1,000 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఈ యూనిట్లలో రూ.400 కోట్లు కామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ (సీఐఎఫ్), కామన్ టెస్టింగ్ ఫెసిలిటీ (సీటీఎఫ్)లకు గ్రాంట్ రూపంలో ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు కానీ, భాగస్వామ్య కంపెనీలుగానీ ముందుకు రావచ్చని, ఆసక్తి కలిగిన సంస్థలు మే 4లోగా బిడ్లు దాఖలు చేయాలని కోరింది.
*******************************************************************************************
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************