Telugu govt jobs   »   Article   »   ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు

ఆంధ్రప్రదేశ్‌లో నీటిపారుదల వ్యవస్థ రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది, రాష్ట్ర భౌగోళిక వాతావరణ పరిస్తితులు కారణంగా ఇది ప్రధాన మైన నీటి వనరు. రెండు ప్రధాన నదులు, గోదావరి మరియు కృష్ణా, వాటి ఉపనదులతో ఎన్నో రకాల పంటలకు ప్రాణం పోస్తూ నీటిపారుదల వ్యవస్థ రాష్ట్ర వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలిచింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి ఉంది, జనాభాలో 62% మంది వ్యవసాయం చేస్తున్నారు. దాదాపుగా 104 చిన్న, మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టు లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి మరియు పెన్నా వంటి రాష్ట్ర, అంతర్రాష్ట్ర నదులపై ఉన్నవి.

1956కు ముందు ఆంధ్రప్రదేశ్ లో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద 29.73 లక్షల ఎకరాలు ఉండేవి, 1956 నుంచి 2015 వరకు 39.35 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. మైనర్ ఇరిగేషన్, APSIDC ఆధ్వర్యంలో 2015 వరకు 32.63 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. దీంతో రాష్ట్రంలో మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్, APSIDC కింద కొత్తగా 101.72 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.

Adda247 Telugu

APPSC/TSPSC Sure shot Selection Group

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు:

స్వాతంత్ర్యం తర్వాత నాగార్జునసాగర్ ప్రాజెక్ట్, ప్రకాశం బ్యారేజీ, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ, తుంగభద్ర లో-లెవల్ కెనాల్, కర్నూలు-కడప కాలువ వంటి అనేక ప్రాజెక్టు లు నిర్మించబడ్డాయి. ఈ ప్రాజెక్టు ల వలన ఎంతో మందికి జీవనోపాధి లభించిది. ఇంకా అమలు దశలో ఉన్న ప్రాజెక్టులు శ్రీరాంసాగర్, వంశధార, శ్రీసలీం కుడి బ్రాంచ్ కెనాల్, ఏలూరు రిజర్వాయర్ పథకం, గోదావరి డెల్టా వ్యవస్థ మొదలైనవి ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ‘జలసిరి హారతి’ అనే కార్యక్రమం ద్వారా 28 ప్రాజెక్టులు పూర్తి చేసి అన్నదాతకు ఎంతో మేలు చేశారు. అలాగే దాదాపు 40 ఏళ్ల నిరీక్షణ తర్వాత పురుషోత్తపట్నం ప్రాజెక్టుని పూర్తి చేసి గోదావరి ప్రాంత రైతులకు సాగునీరు అందించారు.

ప్రాజెక్టుల కింద నీటిపారుదల ఆయకట్టు ఆధారంగా నీటిపారుదల ప్రాజెక్టులు వర్గీకరించబడ్డాయి.

భారీ నీటిపారుదల ప్రాజెక్టులు ఆయకట్టు 25000ఎకరాల కంటే ఎక్కువ  (10,000 ha.)
మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులు ఆయకట్టు 5000 నుంచి  25000 ఎకరాలు (10000ha.)
చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు ఆయకట్టు 5000 ఎకరాల వరకు (2000 ha)

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా 10 ప్రాజెక్టులు  గోదావరి, కృష్ణ, వంశధార నదులపై ఉన్నాయి. వాటి గురించిన సమాచారం ఈ దిగువన పట్టికలో అందించాము.

ప్రాజెక్ట్ పేరు నది ఉపయోగం
పోలవరం ప్రాజెక్టు (ఇంకా నిర్మాణంలో ఉంది) గోదావరి నది సాగునీరు, జలవిద్యుత్, తాగునీటి సరఫరా
హంద్రీనీవా సుజల స్రవంతి (HNSS) ప్రాజెక్టు కృష్ణా సాగు, త్రాగునీటి సరఫరా
గోదావరి డెల్టా ఆధునీకరణ గోదావరి నది నీటి పారుదల ఆధునీకరణ
వంశధార ప్రాజెక్టు వంశధార సాగునీరు, తాగునీటి సరఫరా, జలవిద్యుత్ ఉత్పత్తి
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కృష్ణా సాగునీరు, జలవిద్యుత్ ఉత్పత్తి, తాగునీటి సరఫరా
వెలిగొండ ప్రాజెక్టు కృష్ణా నీటిపారుదల
పులిచింతల ప్రాజెక్టు కృష్ణా నీటిపారుదల, జలవిద్యుత్ ఉత్పత్తి
గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్) ప్రాజెక్టు కృష్ణా నీటిపారుదల[మార్చు]
తెలుగు గంగ ప్రాజెక్టు కృష్ణా త్రాగునీటి సరఫరా

పోలవరం ప్రాజెక్ట్:

పోలవరం ప్రాజెక్ట్ అధికారికంగా ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్ట్ అని పిలుస్తారు ఇది బాహుళప్రయోజన నీటిపారుదల ప్రాజెక్టు. మన దేశం లో ఉన్న ప్రధాన నదిఅయిన గోదావరి పై దీని నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా నీటి నిర్వహణతో పాటు విద్యుత్ ని కూడా తయారు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కరువు ప్రాంతాలకు కూడా నీరు అందించనున్నారు. దీనికి జాతీయ ప్రాజెక్టు హోదా కూడా కల్పించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2.91 లక్షల హెక్టార్లకు సాగునీరు, మరియు దాదాపు 1000 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి లభించనుంది. ఈ ప్రాజెక్టు నుంచి కృష్ణ నదికి 80 TMC ల నీటిని మళ్లించి విశాఖ ప్రాంతానికి తాగునీరు అందించనున్నారు. ఈ ప్రాజెక్టు వలన అనేక గ్రామాలు మునిగిపోయాయి మరియు ఎంతోమంది వారి గ్రామాలు తరలి వెళ్లిపోయారు.

హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు:

ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణ నదికి తరలి వచ్చే వరద నీరుని రాయలసీమ లో ఉన్న కరువు ప్రాంతాలకు తరలిస్తారు. దీనిని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. హంద్రీనీవా ప్రాజెక్టు ను రెండు విభాగాలలో నిర్మించనున్నారు మొదటి దశలో శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తరలిస్తారు. శ్రీశైలం నుంచి దాదాపుగా 40 TMCల నీటిని హంద్రీనీవా, పెన్నా, చిత్రావతిలకు మళ్లిస్తారు. తద్వారా రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఎన్నో ప్రాంతాలకు తాగు, సాగునీరు అందిస్తారు.

గోదావరి డెల్టా ఆధునికీకరణ:

గోదావరి నది భారతదేశంలోనే రెండవ పొడవైన నది ఈ నది ఎంతో మంది రైతులుకు ఎన్నో రాష్ట్రాలకు జీవనాధారంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో గోదావరి నదికి అనుబంధంగా నీటిపారుదల వ్యవస్థలో మౌలిక సదుపాయాలు మెరుగుపడనుంది.

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ భారతదేశంలోని అతిపెద్ద మరియు అత్యంత ముఖ్యమైన నీటిపారుదల మరియు జలవిద్యుత్ ప్రాజెక్టులలో ఒకటి. ఇదిగుంటూరు మరియు నల్గొండ జిల్లాలో ఆంధ్ర మరియు తెలంగాణ మధ్యన ఉంది. ఈ ప్రాజెక్ట్ దేశంలోనే అతి పెద్ద నదులలో ఒకటైన కృష్ణా నది పై ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన మరియు ఎత్తైన ఆనకట్టలలో ఒకటి. దీని ఎత్తు సుమారు 124 మీటర్లు, 1.6KM పొడవు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, ఖమ్మం జిల్లాల్లో దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది మరియు 816 మెగావాట్ల జలవిద్యుత్ అందిస్తోంది.

వంశధార ప్రాజెక్టు

వంశధార లేదా బి.ఆర్.ఆర్. వంశధార ప్రాజెక్ట్ స్టేజ్-1 శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదిపై బ్యారేజీని నిర్మించి దాదాపుగా 400 గ్రామాలలో 1,48,230 ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ 1970లో ప్రారంభించారు మరియు 1977లో మొదటిసారిగా నీటిపారుదల కొరకు నీటిని విడిచిపెట్టారు. ప్రాజెక్ట్  అంచనా వ్యయం రూ.109.00 కోట్లు. ఇప్పటికే 19 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన హేమాండలం రిజర్వాయర్ పూర్తి కాగా, నదిపై సైడ్ వియర్ నిర్మించి వంశధార నది నుంచి నీటి సరఫరా చేయాల్సి ఉంది. గొట్టా బ్యారేజీ నిర్మాణం కోసం 189 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు.

వెలిగొండ ప్రాజెక్టు

వెలిగొండ ప్రాజెక్టు అసలు పేరు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రకాశం జిల్లాలో ఇంకా నిర్మాణ దశలో ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 4,47,300 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. ఈ ప్రాజెక్టును 1996 మార్చి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు శంకుస్థాపన చేశారు కానీ పనులు ప్రారంభించడం లో చాలా జాప్యం జరిగింది అలాగే ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా భారీగా పెరిగింది 2004 లో రాజశేఖర్ రెడ్డిగారు మళ్ళీ శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు ప్రారంభించారు అంచనా వ్యయం 5,500 కోట్లు 2014 నాటికి ప్రాజెక్టు పనులు 80 % పూర్తి అయ్యాయి. 2019 నాటికి ప్రాజెక్టు వ్యయం దాదాపుగా 8,000 కోట్లకు చేరింది.

పులిచింతల ప్రాజెక్టు

పులిచింతల ప్రాజెక్టు ని 2006 లో  కె ఎల్ రావు సాగర్ అని ప్రముఖ ఇంజనీర్ పేరు మీద దీని పేరు మార్చారు.  కృష్ణా నదిపై నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు దిగువన పులిచింతల గ్రామం వద్ద ఈ ప్రాజెక్టు ని నిర్మించారు. 1988 నవంబర్ 18న అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు కానీ వివిధ అంతరయాల తర్వాత ప్రాజెక్టు 2013 లో పూర్తయింది అదే సంవత్సరం డిసెంబర్ నెలలో జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 1556 కోట్లు. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణ డెల్టా లో సుమారు 13 లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నారు.

గాలేరు-నగరి సుజల స్రవంతి (GNSS) ప్రాజెక్టు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కడపమరియు చిత్తూరు జిల్లాల మధ్య GNSSని ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,60,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు అంతేకాకుండా ఎంతో మందికి తాగునీరు కూడా అందించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.2525.91కోట్లు. ఈ ప్రాజెక్టు నిర్మాణం మూడు దశలలో నిర్వహించనున్నారు.   దీనితో పాటు వివిధ రిజర్వాయర్లకు నీరు అందిస్తుంది అవి:

1. శ్రీ బాలాజీ రిజర్వాయర్

2. మల్లిమడుగు రిజర్వాయర్

3. పద్మ సాగర్ రిజర్వాయర్

4. శ్రీనివాససాగర్ రిజర్వాయర్

5. వేణుగోపాలసాగర్ రిజర్వాయర్

6. వేపగుంట రిజర్వాయర్

7. అడవికొత్తూరు రిజర్వాయర్

తెలుగుగంగ ప్రాజెక్టు

1976లో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు ముఖ్యమంత్రుల మధ్య ఒప్పందం లో ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. తెలుగుగంగ ప్రాజెక్టు కృష్ణా మరియు పెన్నార్ వరద జలాలను ఉపయోగించి రాయలసీమలోని కరువు ప్రాంతాలు మరియు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలలో 5.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అంతర్రాష్ట్ర ప్రాజెక్టు. ప్రాధమికంగా చెన్నై నగరానికి నీరు అందించే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు తాగు మరియు సాగునీరు అందిస్తుంది. ఈ ప్రాజెక్టులో శ్రీశైలం జలాశయం నుండి ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు సరిహద్దు వరకు కాలువలతో నాలుగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతో వివిధ ప్రాంతాలకు నీరు అందిస్తోంది.ఈ ప్రాజెక్టుతో కర్నూలు జిల్లాలో 1.145 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది.

1. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్

2. ఎస్.పి.వి.బి.రిజర్వాయర్

3. సోమశిల జలాశయం

4. కండలేరు జలాశయం

adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!