Telugu govt jobs   »   Study Material   »   రాబోయే ఇస్రో ప్రాజెక్ట్‌ల జాబితా

సైన్స్ అండ్ టెక్నాలజీ స్టడీ మెటీరియల్ – రాబోయే ఇస్రో ప్రాజెక్ట్‌ల జాబితా | APPSC, TSPSC Groups

ఇస్రో పంపిన చంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకొని ప్రపంచంలో ఏ దేశానికీ సాధ్యంకాని ఘనతను భారత దేశం  సాధించిండి. చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండ్ అయ్యి ప్రపంచ దృష్టి భారత్ పడేలా చేసింది. ఇదే విజయానందంతో ‘భారత అంతరిక్ష పరిశోధన సంస్థ’ (ఇస్రో) మరి కొన్ని ప్రయోగాలతో ప్రపంచ చరిత్రలో భారత దేశాన్ని చిర స్థాయిలో ఉంచాలి అని అనుకుంటుంది. తన విజయాలను ఇక్కడితో ఆపకుండా, ప్రపంచ దేశాలలో ఏ దేశాలకి సాద్యం కానీ ప్రయోగాలకు శ్రీ కారం చుట్టబోతుంది ISRO. చంద్రయాన్ 3 విజయవంతం తర్వతా ఇస్రో సూర్యని పై, అంగారక గ్రహంపై, శుక్ర గ్రహం పై పరిశోధనలు చేయడానికి సిద్దంగా ఉంది. ఇక్కడ మేము రాబోయే ఇస్రో ప్రాజెక్ట్‌ల జాబితా అందించాము.

రాబోయే ఇస్రో ప్రాజెక్ట్‌ల జాబితా

సూర్యని పైకి ఆదిత్య-ఎల్1

సూర్యుడి వాతావరణ పరిస్థితులపై పరిశోధనల కోసం ‘భారత అంతరిక్ష పరిశోధన సంస్థ’ (ఇస్రో) ఆదిత్య-ఎల్1 అనే ప్రత్యేక మిషన్ ను సిద్దం చేసింది. ఆదిత్య-ఎల్ 1 మిషన్ ను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ ప్రకటించారు. ఇది భారతదేశపు మొదటి సోలార్ మిషన్.  మిషన్ భూమికి 1.5 మిలియన్ కిమీ దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ 1చుట్టూ ఒక హాలో కక్ష్యలో ఉంచబడుతుంది.  దీని నుంచి ఆదిత్య-ఎల్1 సూర్యుడి వాతావరణం, అయస్కాంత క్షేత్రాలు, అంతరిక్ష వాతావరణ ప్రభావాలను అధ్యయనం చేయగలదు. సూర్యుడిలో ఉత్పన్నమయ్యే సౌర తుపానులను ముందుగానే గుర్తించడానికి కూడా ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది.

 మిషన్ ఆదిత్య – L1 గురించి మరిన్ని వివరాలు

శుక్రయాన్ 1

భూమికి కవల సోదరి అని పిలువబడే శుక్ర గ్రహం పైన పరిశోధనలను చేయడానికి వ్యోమనౌకను పంపాలని ఇస్రో అనుకుంటుంది.  చాలా అంశాల్లో భూమికి, శుక్ర గ్రహల మధ్య సారూప్యతలు ఉన్నాయి, అందుకే ఈ గ్రహాన్ని భూమికి కవల సోదరి అని అంటారు.  వాతావరణ మార్పులతో ఒక గ్రహానికి సంబంధించిన వ్యవస్థలపై ఎలాంటి ప్రభావం పడబోతోందన్నది అంచనా వేయదానికి శుక్ర గ్రహపై పరిశోధనలు చేయడానికి శుక్రయాన్ ను 2026లో ప్రయోగించనుంది. ఇందుకోసం రూ. 500 – 1000 కోట్ల బడ్జెట్ అవుతుంది అని అంచనా.

గగన్ యాన్

ఇస్రో, సోవియట్ యూనియన్ తో కలిసి చేపట్టిన మిషన్ లో మన దేశం నుంచి వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ (1984) ఒక్కరే అంతరిక్షంలోకి వెళ్లారు.ప్రస్తుత కాలంలో అంతరిక్ష రంగంలో గొప్ప పురోగతి సాధించిన భారత దేశం  ప్రస్తుతం గగన్ యాన్   పేరుతో సొంతంగా మానవసహిత యాత్రకు సిద్ధమైంది. వాస్తవానికి 2022లోనే దీన్ని ప్రయోగించాల్సి ఉన్న, కొవిడ్ 19 వంటి పలు కారణాల వల్ల వాయిదా పడింది. 2024లో గగన్ యాన్ ప్రయోగించనున్నారు. ఇందులో భాగంగా ముగ్గురు భారతీయ వ్యోమగాములు రోదసిలో మూడు రోజులపాటు గడపనున్నారు. భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకువెళ్లడానికి మరియు భూమిపై ముందుగా నిర్ణయించిన గమ్యస్థానానికి వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి గగన్ యాన్ భారతదేశపు తొలి మానవ అంతరిక్ష విమాన కార్యక్రమం. ఇందుకోసం 9038 కోట్ల బడ్జెట్ అవుతుంది అని అంచనా.

చంద్రుడిపై రహస్యాలను ఛేదించేందుకు భారత్ చంద్రయాన్-3 మిషన్ - మిషన్ లక్ష్యం, వివరాలు, ప్రాముఖ్యత_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

నిసార్ (నాసా మరియు ఇస్రో)

నిసార్ (నాసా మరియు ఇస్రో) ఇది భూమి చిత్రం ఉపగ్రహ మిషన్ (Earth Image Satellite Mission). 2024 జనవరిలో ప్రయోగించనున్నారు. భూమిని నిరంతరం పరిశీలిస్తూ ఉండేందుకు ఆమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాతో కలిసి ‘నిసార్’ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సిద్దం అవుతుంది. సముద్ర మట్టాలు, భూగర్భ జలం సహా భూ వాతావరణానికి సంబంధించిన అనేక కీలక వివరాలను ఈ ఉపగ్రహం ఎప్పటికప్పుడు అందజేయనుంది. సునామీలు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు,  కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ‘నిసార్’ దోహదపడనుంది.ఇది ప్రపంచంలో నే అత్యంత ఖరీదైన ప్రయాగం దీని బడ్జెట్ రూ.12000 కోట్లు.

లూనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్ (LUPEX) లేదా చంద్రయాన్-4

లూనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్ (LUPEX) లేదా చంద్రయాన్-4 అనేది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) మరియు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA)చే రూపొందించబడిన ఉమ్మడి చంద్ర మిషన్. ఈ మిషన్ 2026 కంటే ముందుగా చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని అన్వేషించడానికి ఒక అన్‌క్రూడ్ లూనార్ ల్యాండర్ మరియు రోవర్‌ను పంపుతుంది. JAXA అభివృద్ధిలో లేని H3 లాంచ్ వెహికల్ మరియు రోవర్‌ను అందించే అవకాశం ఉంది, అయితే ISRO ల్యాండర్‌ను అందిస్తుంది. ఇందుకోసం రూ. 1000 – 1200 కోట్ల బడ్జెట్ అవుతుంది అని అంచనా.

మంగళయాన్ 2

అంగారకుడి దగరకు వెళ్ళే రెండవ మిషన్, మంగళయాన్ 2, దీనిని మార్స్ ఆర్బిటర్ మిషన్ 2 (MOM-2)అని కూడా పిలుస్తారు. ఈ మిషన్ ప్రస్తుతం 2024లో ప్రయోగించడానికి ప్రణాళిక చేయబడింది. మంగళయాన్-2 రాకెట్ GSLV Mk III ద్వారా ప్రయోగించబడుతుంది. దీని లక్ష్యం అంగారకుడు. మంగళయాన్-2 భారతదేశం యొక్క రెండవ అంతర్ గ్రహ మిషన్ మరియు అంగారక గ్రహానికి రెండవ మిషన్. ఇది ఒక ఆర్బిటల్ ప్రోబ్‌ను మాత్రమే కలిగి ఉంటుంది మరియు ప్లాన్ చేసిన ల్యాండర్ రద్దు చేయబడింది. ప్రోబ్‌లో హైపర్‌స్పెక్ట్రల్ కెమెరా, చాలా ఎక్కువ రిజల్యూషన్ ఉన్న నలుపు మరియు తెలుపు కెమెరా మరియు రాడార్ ఉంటాయి.

 

భారత్ చంద్రయాన్-3 మిషన్ చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ మరియు ఇతర వివరాలు.
ISRO చంద్రయాన్ మిషన్లు – చంద్రయాన్ 1 నుండి చంద్రయాన్ 3 వరకు పూర్తి వివరాలు చంద్రయాన్ 3 మరియు రష్యన్ లూన 25 మధ్య వ్యత్యాసం
చంద్రయాన్ 3 వెనుక ఉన్న మహిళా శక్తి  మిషన్ ఆదిత్య – L1 గురించి మరిన్ని వివరాలు

 

APPSC GROUP-2 2023 Prelims and Mains Chapter wise and Subject Wise Practice Tests Online Test Series in Telugu and English By Adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

మంగళయాన్ 2 ప్రయోగ తేదీ ఏమిటి?

మార్స్‌కు రెండవ మిషన్, మంగళయాన్ 2, దీనిని మార్స్ ఆర్బిటర్ మిషన్ 2 అని కూడా పిలుస్తారు, ఇది 2024లో ప్రణాళికాబద్ధమైన ప్రయోగ తేదీతో ఇస్రోచే ఒక అంతర్-గ్రహ మిషన్ అవుతుంది.

సూర్యుడి వాతావరణ పరిస్థితులపై పరిశోధనల కోసం ఇస్రో పంపనున్న మిషన్ ఏమిటి?

సూర్యుడి వాతావరణ పరిస్థితులపై పరిశోధనల కోసం 'భారత అంతరిక్ష పరిశోధన సంస్థ' (ఇస్రో) ఆదిత్య-ఎల్1 అనే ప్రత్యేక మిషన్ ను సిద్దం చేసింది. సెప్టెంబర్ లో దీనిని సూర్యని పైకి పంపనుంది