LICలో 7000పైగా ఖాళీలు
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో క్లాస్ III మరియు క్లాస్ IV ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నది. LIC సంస్థ లో ఉద్యోగం సంపాదించాలి అనుకొనే అభ్యర్ధులకు ఇదొక సువర్ణ అవకాశం. LIC లో AAO తరహాలో ఈ ఉద్యోగాలు కూడా భర్తీ కానున్నాయి. 7000 పోస్టుల కోసం నోటిఫికేషన్ జూలై 2024లో ప్రచురించబడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అభ్యర్ధులు ఈ పోస్టులకు సంబంధించిన సమాచారాన్ని త్వరితగతిన తెలుసుకోడానికి ఈ పేజిని బుక్ మార్క్ చేసుకోగలరు.
Adda247 APP
ప్రధాన ముఖ్యాంశాలు
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో క్లాస్ III మరియు క్లాస్ IV ఉద్యోగాల భర్తీలో LIC కీలకమైన మార్పును తీసుకువచ్చినది. రిజర్వ్‌డ్ కేటగిరీల అభ్యర్థులకు, ప్రత్యేకించి బెంచ్‌మార్క్ డిజేబిలిటీస్ (PwBD) ఉన్న వ్యక్తులకు ఉద్యోగ నియామకంలో అవకాశాలు అందించనున్నది.
LIC అసిస్టెంట్ రిక్రూట్మెంట్ ముఖ్యమైన తేదీ
అంశం | ముఖ్యమైన తేదీ |
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం | త్వరలో నవీకరించబడుతుంది |
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ | త్వరలో తెలియజేస్తాం |
దరఖాస్తు ప్రక్రియ | ఆన్‌లైన్ మోడ్ |
LIC అసిస్టెంట్ పోస్టులకు అర్హత ప్రమాణాలు
అభ్యర్థులు మార్చి 1, 2024 నాటికి విద్యార్హత మరియు వృత్తిపరమైన అర్హతలను కలిగి ఉండాలి. విద్యా మరియు వయోపరిమితి మరియు వృత్తిపరమైన అనుభవానికి సంబంధించిన వివరాలను LIC నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. పూర్తి వివరాలను అభ్యర్ధులు నోటిఫికేషన్ లో చూడవచ్చు.
LIC అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2024 వయోపరిమితి
వయస్సు ప్రమాణాలు | వివరాలు |
కనిష్ట | 18 సంవత్సరాలు |
గరిష్టం | 30 సంవత్సరాలు |
సడలింపు | నిబంధనల ప్రకారం |
SC/ST అభ్యర్థులకు | 5 సంవత్సరాల సడలింపు |
SEBC అభ్యర్థుల కోసం | 3 సంవత్సరాల సడలింపు |
LIC అసిస్టెంట్ ఖాళీలు
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఎల్‌ఐసి అసిస్టెంట్ల కోసం 7,000 కంటే ఎక్కువ స్థానాలను భర్తీ చేయాలని భావిస్తున్నారు. జోనల్ స్థాయి మరియు రాష్ట్రస్థాయి పోస్టులకు సంబంధించిన ఖాళీల వివరాలు నోటిఫికేషన్ నందు నిశితంగా పరిశీలించవచ్చు.
PwBD అభ్యర్థులకు సమాన అవకాశం
ఈ నోటిఫికేషన్ నుండి లైఫ్ ఇన్సురన్సు కార్పొరేషన్ నూతన మార్పును తీసుకురానున్నది. రిజర్వ్‌డ్ కేటగిరీల అభ్యర్థులతో పాటు PwBD సహా సమాన అవకాశాలను కల్పించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ సమూహాల నుండి అర్హులైన అభ్యర్థులు ప్రకటనలో పేర్కొన్న నిర్దిష్ట రిజర్వేషన్‌లతో సంబంధం లేకుండా అవసరమైన అర్హతలను కలిగి ఉన్న అభ్యర్ధులు పోస్టులు దరఖాస్తు చేసుకోవచ్చును.
LIC అసిస్టెంట్ నియామకం వెనుక ముఖ్య లక్ష్యం
LIC క్లాస్ III మరియు క్లాస్ IV ఉద్యోగాల నియామకం ద్వారా LiC నైపుణ్యం కలిగిన మరియు అర్హత కలిగిన వ్యక్తులను ఆకర్షించడం మరియు దాని శ్రామిక శక్తిని బలోపేతం చేయడం మరియు ప్రస్తుతం సంస్థ ఎదుగుదలలో నైపుణ్యంతో కూడిన శ్రామిక శక్తి యొక్క పాత్రను ప్రోత్సహించడం లక్ష్యంగా చేసుకున్నది. భారతదేశంలో పేరెన్నికగన్న జీవిత భీమా సంస్థలలో అగ్రగామి అయిన LIC సంస్థల్లో పనిచేయడానికి ఈ రిక్రూట్మెంట్ ఒక ఇది గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. ఈ పోస్తులకు సంబంధించిన మరింత పూర్తి సమాచారం మరియు అర్హతలు, ప్రమాణాలకు అభ్యర్ధులు LIC అధికారిక వెబ్ సైట్ ను నిరంతరం చూస్తూ ఉండండి.
గమనిక:
పైన పేర్కొన్న సమాచారం వివిధ వార్త ప్రచురణల ఆధారంగా రూపొందించబడినది మరియు ఇది LIC నుండి వచ్చిన అధికారిక ప్రకటన కాదని దయచేసి గమనించండి. అభ్యర్థులు LIC వెబ్‌సైట్‌లో అధికారిక నోటిఫికేషన్ మరియు వివరణాత్మక సమాచారం కోసం తరచూ చూస్తూ ఉండాలి. ఈ పోస్ట్ అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను ముందుగానే ప్రారంభించడంలో మరియు వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరచడంలో సహాయపడటానికి ప్రాథమిక సమాచారాన్ని అందించడానికి ఉద్దేశించబడింది.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |