Komaram Bheem Asifabad district selected for PM award, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు ‘ప్రధానమంత్రి ఎక్స్‌లెన్స్ అవార్డు’
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు ‘ప్రధానమంత్రి ఎక్స్‌లెన్స్ అవార్డు’ దక్కింది. శిశు, బాలిక, మహిళలు, గర్భిణులు, బాలింతల పౌష్టికాహార కల్పన కార్యక్రమం పోషణ్ అభియాన్ అమలులో 2021 సంవత్సరానికిగానూ ఆసిఫాబాద్ జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పౌర సేవా దినోత్సవాన్ని పురుస్కరించుకొని ఈ నెల 21న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో అవార్డును ప్రధాని నరేంద్ర మోదీ అందజేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు సమాచారం ఇచ్చారు.
తెలంగాణకు కేంద్ర పురస్కారం దక్కడంపై రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. స్త్రీ శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, జిల్లాకలెక్టర్ రాహుల్‌రాజ్‌లను అభినందించారు. త్వరలో కేసీఆర్ పౌష్టికాహార కిట్ పథకాన్ని అమల్లోకి తేబోతున్నట్లు ఆమె వివరించారు.
*******************************************************************************************
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************