Telugu govt jobs   »   APPSC గ్రూప్ 2 మరియు గ్రూప్ 1...

Key Statistical Information Of Andhra Pradesh for APPSC Group 2 and Group 1 | APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 మెయిన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య గణాంక సమాచారం

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1, గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు రాష్ట్రంలోని కీలక గణాంక సమాచారంపై సమగ్ర అవగాహన ఉండటం చాలా ముఖ్యం. సుసంపన్నమైన చరిత్ర, వైవిధ్యమైన సంస్కృతి, భారత ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన తోడ్పాటునందించిన ఆంధ్రప్రదేశ్ గురించి ఈ పోటీ పరీక్షలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ కధనంలో ఆంధ్రప్రదేశ్ జనాభా, ఆర్థిక, భౌగోళిక మరియు సామాజిక గణాంకాల యొక్క సంక్షిప్త మరియు సమాచార అవలోకనాన్ని అందించనున్నాము. జనాభా సాంద్రత మరియు అక్షరాస్యత రేట్ల నుండి ఆర్థిక ఉత్పాదనలు మరియు సహజ వనరుల వరకు, ఆంధ్ర రాష్ట్రం యొక్క వివరణాత్మక సమాచారాన్ని అందిస్తున్నాము. మీరు గ్రూప్ 1 లేదా, గ్రూప్ 2, డిగ్రీ లెక్చరర్, ఉపాధ్యాయ, సచివాలయం వంటి పరీక్షలకి సన్నద్దమవుతున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు విస్తృత భారత భూభాగంలో దాని పాత్రను అర్థం చేసుకోవడానికి అవసరమైన పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.

Indian Society Important MCQs For APPSC Group 1 and Group 2

APPSC గ్రూప్ 2 మరియు గ్రూప్ 1 కోసం ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య గణాంక సమాచారం

  • ఆంధ్రప్రదేశ్ 1953 లో మద్రాసు ప్రాంతం నుండి వేరుచేయబడింది. మొత్తం 11 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయ్యింది. వాటిలో 7 కోస్తా ఆంధ్ర మరియు 4 రాయల సీమ ఉన్నాయి.
  • హైదరాబాద్ ని ఆంధ్రప్రదేశ్ లో 1956లో నవంబర్ 1 న మిలీనం చేశారు. ఆంధ్రప్రదేశ్ ని 2014 జూన్ 2 వ తేదీన తెలంగాణ రాష్ట్రంని ఏర్పాటు చేశారు.
  • ఆంధ్రప్రదేశ్ దేశం లోనే 8వ అతిపెద్ద రాష్ట్రం, మరియు జనాభా పరంగా 10వ అతిపెద్ద రాష్ట్రం. దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా 4.10% వాటాఉంది (2011 సేన్సెస్ ప్రకారం)
  • విభజన చట్టం ప్రకారం, రాజధాని కోసం ప్రభుత్వనికి సలహా ఇవ్వడానికి శివరామ కృష్ణ కమిటీని ఏర్పాటు చేశారు. ఇది 27 ఆగస్టు 2014న తన నివేదికని కేంద్ర హోమ్ శాఖకి అందించింది.
  • CRDA లేదా రాజధాని అభివృద్ది ప్రాధికార సంస్థ 30 డిసెంబర్ 2014 న ఏర్పాటు చేశారు
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా 23 ఏప్రిల్ 2015 ప్రకటించారు. 22 అక్టోబర్ 2015న రాజధాని నిర్మాణాన్ని ఏర్పాటు సభకు ప్రధాని మోడీ హాజరయ్యారు.
  • ఆంధ్రప్రదేశ్, మరియు తెలంగాణ హై కోర్టులు 1 జనవరి 2019 న ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ని నేలపాడు లో 3 ఫిబ్రవరి 2019న ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ హై కోర్టు లో ఉన్న జడ్జ్ ల సంఖ్య 37 అందులో 29 మంది పూర్తి స్థాయి జడ్జ్ లు, 8 మంది యడ్ హక్ జడ్జ్లు.
  • 2019లో ఆంధ్రప్రదేశ్ హై కోర్టు మొదటి CJగా చాగరి ప్రవీణ్ నియమితులయ్యారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా ధీరజ్ సింగ్ ఠాకూర్ నియమితులయ్యారు.
  • ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీ భవనం 2 మార్చి 2017 న ప్రారంభించారు.
  • 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 12 జిల్లాలు సముద్ర తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్ 17వ ముఖ్యమంత్రిగా (విభజన తర్వాత 2 వ ముఖ్యమంత్రి గా) శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు 30 మీ 2019న ప్రమాణ స్వీకారం చేశారు.
  • ఆంధ్రప్రదేశ్ లో మొదటి కేబినెట్ 12 జూన్ 2019న ఏర్పాటు అయింది, మరియు  2 వ కేబినెట్ 11 ఏప్రిల్ 2022 న విస్తరణ జరిగింది. మొత్తం 26 మంది మంత్రులు ఉన్నారు.
  • 2019 అక్టోబర్ 2న గ్రామ సచివాలయాల వ్యవస్థని ప్రారంభించారు. మొత్తం 15004 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2,19,518, (ఇంతకు ముందు 1,92,587గా ఉండేది). ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి (GSDP) 13,17,728 కోట్లు
  • రాష్ట్రంలో మొత్తం 10778 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. 15 అక్టోబర్ 2019 న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించారు
  • ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 4,08,07,256. అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లా కర్నూలు జిల్లా (20,16,396)
  • స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరున డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 206 అడుగుల విగ్రహాన్ని విజయవాడ లో ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహం (భారతదేశం లో 4వ అతిపెద్ద విగ్రహం, నుంచుని ఉన్న విగ్రహాలలో 2వ అతి పెద్ద విగ్రహం)
  • ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానిల బిల్లు ని 20 జనవరి 2020లో ఆమోదించారు. BCG లేదా బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ సంస్థ 3 రాజధానుల పై నివేదికని అందించింది.

Key Highlights of Union Budget 2024 Download PDF

 

APPSC Group 1 Prelims 2024 | Online Test Series (Telugu & English) By Adda247 Telugu

మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

APPSC గ్రూప్ 2 మరియు గ్రూప్ 1 కోసం ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య గణాంక సమాచారం_4.1
About the Author

Hi, I’m Venkat! Welcome to the ADDA247Exams blog. With 2 years of experience, including 1 year in EdTech, I create content on National and State-level exams, covering everything from notifications to results. Having appeared for exams like APPSC Group2 Mains, IBPS, SBI Clerk Mains, and SSC CHSL DV 2020, I bring hands-on expertise to guide you through your exam prep journey.