బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్‌గా కేసలి అప్పారావు
ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్‌గా విజయనగరం జిల్లాకు చెందిన కేసలి అప్పారావును ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా జంగం రాజేంద్రప్రసాద్, గొండు సీతారాం, ఆదిలక్ష్మీ త్రిపర్ణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.
న్యాయ శాఖ కార్యదర్శిగా సత్యప్రభాకర్‌రావు
రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శిగా జి.సత్యప్రభాకర్‌రావు నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం చిత్తూరులోని 8వ అదనపు జిల్లా న్యాయాధికారిగా సేవలందిస్తున్నారు. సత్యప్రభాకర్‌రావును రెండేళ్ల పాటు డిప్యుటేషన్‌పై న్యాయశాఖ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************