ఏపీలో జగన్ సర్కార్ వరుసగా రెండో ఏడాది మరో పథకం అమలు చేస్తోంది. జగనన్న చేదోడు కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు లబ్ధిదారుల ఖాతాల్లో రెండో ఏడాది నగదును జమ చేయనున్నారు. మొత్తం 2.85 లక్షల మంది రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలకు రెండో విడతలో రూ. 285 కోట్లను విడుదల చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నగదు బదిలీ చేస్తారు.
ప్రతి ఏటా షాపులున్న ప్రతిఒక్కరికి జగనన్న చేదోడు కింద రూ.10వేల ఆర్ధిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. ఈసారి షాపులున్న 1.46 లక్షల మంది టైలర్లకు రూ.146 కోట్లు, షాపులున్న 98వేల మంది రజకులకు రూ.98.44 కోట్లు, షాపులున్న 40వేల మంది నాయీ బ్రాహ్మణులకు రూ.40 కోట్ల నగదును లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. వరుసగా రెండేళ్లు కలిపి ఇప్పటి వరకూ జగనన్న చేదోడు కింద రూ.583 కోట్లు విడుదల చేశారు.
21 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న వారు ఈ పథకంలో అర్హులు. రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు అవసరమైన చేతి పనిముట్లు, వారికి పెట్టుబడి కోసం ఈ సహాయం చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలు ప్రదర్శించారు. గతేడాది కూడా అర్హులు ఎవరికైనా డబ్బులు రాకపోతే వారు గ్రామ సచివాలయానికి వెళ్లి అన్ని వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వెంటనే తనిఖీ ప్రక్రియ చేసి అర్హత ఉంటే డబ్బులు చెల్లిస్తారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని : అమరావతి
ముఖ్యమంత్రి : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
గవర్నర్ : బిశ్వభూషణ్ హరిచందన్
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************
Adda247 App for APPSC, TSPSC, Railways, SSC and Banking