Telugu govt jobs   »   Telugu Current Affairs   »   Isro chandrayan-3 launch in August 2022

ఆగస్టులో ఇస్రో చంద్రయాన్‌-3 ప్రయోగానికి సన్నాహాలు

సూళ్లూరుపేట: తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈ ఏడాది ఆగస్టులో చంద్రయాన్‌-3 ప్రయోగం నిర్వహించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. దీనికి సంబంధించిన మొదటి చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా ఇస్రో ‘స్పేస్‌ ఆన్‌ వీల్స్‌’ పేరుతో 75 ఉపగ్రహాలను ప్రయోగించనుంది. దీనికి సంబంధించిన డాక్యుమెంటరీలో చంద్రయాన్‌-3 చిత్రాలను పొందుపరిచారు. చంద్రుని ఉపరితలంపై కాలుమోపనున్న ల్యాండర్‌, ఆదిత్య-ఎల్‌1 మిషన్‌లతోపాటు గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు అందులో తెలియజేశారు.

ముఖ్యమైన అంశాలు

ఇస్రో చైర్మన్:  S. సోమనాథ్

ఇస్రో ప్రధాన కార్యాలయం: బెంగళూరు
ఇస్రో ఎప్పుడు స్థాపించబడింది: 15 ఆగస్టు 1969

 

*******************************************************************************************ఆగస్టులో చంద్రయాన్‌-3 ప్రయోగానికి సన్నాహాలు

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

ఆగస్టులో చంద్రయాన్‌-3 ప్రయోగానికి సన్నాహాలు

Download Adda247 App

Sharing is caring!