Hyderabad to be host International Food Conference | హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆహార సదస్సు జరగనుంది
- అంతర్జాతీయ ఆహార శిఖరాగ్ర సదస్సు (Food Enclave) 2023కి రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సు హైదరాబాద్లో ఈనెల 28, 29 తేదీల్లో జరగనుంది.
- ఇందులో ప్రపంచవ్యాప్తంగా వంద ప్రసిద్ధ ఆహారశుద్ధి పరిశ్రమల అధిపతులు, సీఈవో, నిపుణులు పాల్గొంటారు. ప్రపంచ ఆర్థిక వేదిక, జాతీయ కూరగాయలు, నూనెల ఉత్పత్తిదారుల సంఘం, భారతీయ పాల ఉత్పత్తిదారుల సంఘం, హీఫర్ ఇంటర్నేషనల్, సొసైటీ ఆఫ్ ఆక్వాకల్చర్ ప్రొఫెషనల్స్ వ్యవహరించనున్నాయి.
- ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “ఎని మిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం ఐటీ, జీవశాస్త్రాలతోపాటు వ్యవసాయ రంగ అభివృద్ధిలోనూ అగ్రగామిగా నిలిచింది అని తెలిపారు.
- ఈమేరకు మంగళవారం తమ కార్యాలయంలో పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు దీనికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు.
- ఆహార రంగం, నీటి పారుదల, గ్రామీణ సామా జిక, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఉద్దే శించిన పథకాలపై దృష్టి సారించడంతో రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి పదేళ్లలో గణనీయంగా పెరిగింది. అదే సమయంలో నూనెలు, పాడి, మాంసం, చేపల ఉత్ప త్తుల ద్వారా పసుపు, శ్వేత, గులాబీ, నీలి విప్లవాలను సాధించాం.
- ఈ అవకాశాలను రాష్ట్రం, దేశం సమా నంగా ఉపయోగించుకోవడానికి సమన్వయంతో కూడిన ప్రయత్నం చేయాల్సిన అవసరముంది.
- కీలకమైన వాటాదారులు కలిసి ఒక స్పష్టమైన మార్గాన్ని రూపొం దించడానికి ఆహార సదస్సు వేదికగా ఉపయోగపడుతుంది.
- ఈ సదస్సులో దశాబ్దంలో భారతీయ వ్యవసాయ మరియు ఆహార రంగం వృద్ధికి కీలకమైన సవాళ్లు, అవకాశాలు అనే అంశం పై చర్చా మరియు రౌండ్ బుల్ సమావేశాలు జరుగుతున్నాయి అని వివరించారు.
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
***********************************************************************************************************************