Telugu govt jobs   »   Current Affairs   »   Daily current affairs in telugu

21st March observed as International Day of Forests | అంతర్జాతీయ అటవీ దినోత్సవం

మార్చి 21ని అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా పాటిస్తారు:

అంతర్జాతీయ అటవీ దినోత్సవం (ప్రపంచ అటవీ దినోత్సవం అని కూడా పిలుస్తారు) ప్రతి సంవత్సరం మార్చి 21న జరుపుకుంటారు. ఈ రోజు యొక్క ప్రధాన లక్ష్యం అన్ని రకాల అడవుల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం. అన్ని రకాల అడవులు మరియు అడవుల వెలుపల చెట్ల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంపొందించడానికి, ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాలకు ప్రయోజనం చేకూర్చడానికి అలాగే అడవుల విలువలు, ప్రాముఖ్యత మరియు సహకారం గురించి అన్ని రకాల వర్గాల ప్రజల్లో అవగాహన పెంచడానికి మరియు  భూమిపై జీవిత చక్రాన్ని సమతుల్యం చేయడానికి ఈ రోజు జరుపుకుంటారు.

2022 నేపథ్యం “అడవులు మరియు స్థిరమైన ఉత్పత్తి మరియు వినియోగం.”

అంతర్జాతీయ అటవీ దినోత్సవం యొక్క ఆనాటి చరిత్ర:

యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మార్చి 21ని అంతర్జాతీయ అటవీ దినోత్సవం (IDF)గా 2012లో ప్రకటించింది. అప్పటి నుండి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు మరియు అన్ని రకాల అడవుల యొక్క  ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తారు. ప్రతి అంతర్జాతీయ అటవీ దినోత్సవం నాడు, చెట్ల పెంపకం ప్రచారాలు వంటివి ఏర్పాటుచేసి అడవులు మరియు చెట్లతో కూడిన కార్యకలాపాలను నిర్వహించడానికి స్థానిక, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రయత్నాలను చేపట్టడానికి దేశాలు ప్రోత్సహించబడతాయి. ప్రతి అంతర్జాతీయ అటవీ దినోత్సవానికి సంబంధించిన నేపథ్యంను అడవులపై సహకార భాగస్వామ్యం ద్వారా ఎంపిక చేస్తారు.

APPSC Group 2 2022 Vacancies Complete Details, APPSC గ్రూప్ 2 2022 ఖాళీల పూర్తి వివరాలు

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

AP Endowment officer Salary and Allowances, AP ఎండోమెంట్ ఆఫీసర్ జీతభత్యాలు

Adda247 App for APPSC, TSPSC, Railways, SSC and Banking

Sharing is caring!