Telugu govt jobs   »   Current Affairs   »   అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డు పొందిన...

అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డు పొందిన 5 భారతీయులు

అంతర్జాతీయ యంగ్ ఎకో-హీరో అవార్డుల కార్యక్రమం అత్యంత క్లిష్టమైన పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకున్న 8 నుండి 16 సంవత్సరాల వయస్సు గల పిల్లలు మరియు యుక్తవయస్కులను గుర్తించి ప్రోత్సహిస్తుంది.  గత 20 సంవత్సరాలుగా యంగ్ ఎకో-హీరో అవార్డుల కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటి వరకూ యంగ్ ఎకో-హీరో అవార్డుల కార్యక్రమం,”యాక్షన్ ఫర్ నేచర్” ద్వారా 27 దేశాలు మరియు 32 US రాష్ట్రాల నుండి 339 మంది ఎకో-హీరోలను గుర్తించింది.

అంతర్జాతీయ యంగ్ ఎకో-హీరో అవార్డు

అంతర్జాతీయ యంగ్ ఎకో-హీరో అవార్డు విజేతలను ఒక నిపుణుల కమిటీ నిర్ణయిస్తుంది. కమిటీలో పర్యావరణ శాస్త్రం, జీవశాస్త్రం మరియు విద్యలో నిపుణులతో సహా స్వతంత్ర న్యాయమూర్తులు ఉంటారు.

ఈ సంవత్సరం భారతదేశంకి చెందిన 5 చిన్నారులకు అంతర్జాతీయ యంగ్ ఎకో-హీరో అవార్డు లభించింది. మొత్తం 17 మందికి గాను 5 విధ్యార్ధిని/ విధ్యార్ధులు భారతదేశం వారు కావడం విశేషం. దీనితో పాటు భారత్ మూలాలు ఉన్న అమెరికాకు చెందిన 4 విధ్యార్ధిని విధ్యార్ధులు కూడా ఈ అవార్డు ని సొంతం చేసుకున్నారు. పర్యావరణాన్ని కాపాడటానికి వారు తీసుకున్న చర్యలకు గాను గుర్తింపుగా ఈ అవార్డు పనిచేస్తుంది.

 

Disaster Management Study Material - Cyclone (తుఫాను)APPSC/TSPSC Sure shot Selection Group

అంతర్జాతీయ యంగ్ ఎకో-హీరో అవార్డు అందుకున్న భారతీయులు:

అమెరికా స్వచ్ఛంద సంస్థ ‘యాక్షన్ ఫర్ నేచర్’ ఏటా అందజేసే ఈ పురస్కారాలు 2023 కి గాను ఐదుగురు భారతీయులు ఎపికయ్యారు. అంతర్జాతీయ యంగ్ ఎకో-హీరో అవార్డు అందుకున్న వారిలో అయిదుగురు భారతీయులు:

  1. నిర్వాణ్ సోమానీ (ఢిల్లీ), 16 సంవత్సరాలు
  2. మన్నత్ కౌర్ (ఢిల్లీ), 15 సంవత్సరాలు
  3. ఐహా దీక్షిత్ (మీరట్), 9 సంవత్సరాలు
  4. కర్ణవ్ రస్తోగీ (ముంబయి), 13 సంవత్సరరాలు
  5. మాన్య హర్ష (బెంగళూరు), 12 సంవత్సరాలు

ఫ్రాన్సిస్కోలో ఆగస్టు 26న ఉదయం 10 గంటలకు జరిగే ఈ వేడుకను విజేతలకు పురస్కారాలను  వర్చుయల్ గా జూమ్ వెబ్‌నార్ ద్వారా అందించనున్నారు. ప్రత్యక్ష ప్రసారమయ్యే ఈ వర్చువల్ ఈవెంట్‌లో విజేతల పనిని గుర్తించి పురస్కరిస్తారు.

  • 8 నుండి 12 సంవత్సరాల విభాగం లో, మొదటి స్థానం: ఐహా దీక్షిత్

మొదటి స్థానం లో నిలిచిన ఐహా దీక్షిత్  చిన్నతనం నుంచి పర్యావరణం పై శ్రద్ధ ఎక్కువ నాలుగేళ్ల వయస్సు నుంచి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు పెంచడం ప్రారంభించింది. గ్రీన్ ఈహా స్మైల్ అనే ఫౌండేషన్ స్థాపించి దాని ద్వారా, ఆమె మరియు స్వచ్ఛంద సేవకుల బృందం 20,000 మొక్కలను నాటారు, ఆమె నగరంలో చిన్న చిన్న అడవులు, ఉద్యానవనాలు మరియు గ్రీన్ బెల్ట్‌లను సృష్టించింది, తద్వారా నీడ మరియు స్వచ్ఛమైన గాలిని అందరికీ అందిస్తోంది.

ఐహ దీక్షిత్ తన ఇంటి వద్ద ఒక ప్లాంట్ బ్యాంక్‌ను కూడా ఏర్పాటు చేసింది, ఎవరైనా వారి మొక్కలను సంరక్షించుకొని పరిస్థితి లో వాటిని ఐహకు విరాళంగా ఇస్తారు. ఇలా సేకరించిన మొక్కలను ఈమె సంరక్షించి మరియు విత్తనాలు బధ్రపరచి ఆసక్తి గలవారికి ఈ మొక్కలు మరియు విత్తనాలు ఉచితంగా అందిస్తారు.

  • 13 నుండి 16 సంవత్సరాల విభాగంలో రెండోవ స్థానం-మాన్య హర్ష

హర్ష, 12 ఏళ్ల కవి మరియు రచయిత, పర్యావరణ సమస్యలు మరియు వాతావరణ చర్యల గురించి అవగాహన పెంచడానికి ఒక మిషన్‌ను ప్రారంభించాడు. చిన్న వయస్సు లోనే పుస్తకాలు మరియు ఇంటర్నెట్ లో బ్లాగ్, యూట్యూబ్ చానెల్ స్థాపించి యువతలో చైతన్యం తీసుకుని వచ్చాడు. తన యూట్యూబ్ చానెల్ ది లిటిల్ ఎన్విరాన్‌మెంటలిస్ట్ ద్వారా ఎంతోమందిలో చైతన్యం నింపాడు. తన రచనల ద్వారా ఎంతో మందిలో పర్యావరణం పై స్పృహ కలిగించి వారిని ప్రేరేపించాడు. వీటితో పాటు మొక్కలు నాటడం, సీడ్ బాల్స్ పంచడం మరియు వాక్‌థాన్‌లు నిర్వహించాడు. చాలా చోట్ల క్లీన్-అప్ డ్రైవ్‌లను నిర్వహించడం తో పాటు ప్రకృతి ని కాపాడటానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాడు.

హర్ష అందరితో కలసి ఇప్పటి వరకూ 3,000 పైగా సీడ్ బాల్స్ , 3,500 పైగా మొక్కలు నాటి, 5,000 పైనే ప్రకృతికి హాని కలిగించని సంచులు ప్రజలకు అందించాడు. రాబోయే తరాల వారికి స్పూర్తినిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు.

  • 13 నుండి 16 సంవత్సరాల విభాగంలో రెండోవ స్థానం- నిర్వాన్ సోమాని

నిర్వాన్ జీన్స్ వల్ల కలిగే అనర్ధాలను గ్రహించి వాటిని తగ్గించడానికి వాడి వదిలేసిన జీన్స్ ను వివిధ రకాలు గా మార్చి అవసరమైన వారికి అందిస్తున్నాడు. ఇతను “ప్రాజెక్టు జీన్స్”ను స్థాపించి దాని ద్వారా జీన్స్ సేకరణ మరియు పంపిణీ జరుగుతోంది. నిర్వాన్ జీన్స్ మరియు డెనిమ్ వల్ల కలిగే అనర్ధాలను ధృష్టిలో ఉంచుకుని పర్యావరణాన్ని హాని కలిగించకుండా కాపాడుతున్నాడు. నిరుపయోగంగా ఉన్న జీను ను అతను బ్యాగులు గా తయారుచేయడం, అవసరం లేనివి దానం ఇవ్వడం వంటివి చేస్తూ తన వంతుగా పర్యావరణాన్ని కాపాడుతున్నాడు.

12,000 జీన్స్ ను దానం చేశాడు మరియు 800 జీన్స్ ను స్లీపింగ్ బ్యాగ్లు గా మార్చి పంపిణిచేశారు. తద్వారా ఫ్యాషన్ ఇండస్ట్రి నుంచి ఉత్పన్నమయ్యే కాలుష్యాన్ని తనవంతుగా తగ్గించడానికి కృషి చేస్తున్నారు.

  • 13 నుండి 16 సంవత్సరాల విభాగంలో మూడవ స్థానం- మన్నత్ కౌర్

కౌర్ తాగునీటి సమస్యను పరిష్కరించడానికి నీటి కొరత మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా పనిచేస్తోంది. ఈమె లక్ష్యం ఇళ్ల నుండి మూరుగునీరు సేకరించి శుద్ధి చేసి తాగేందుకు వీలుగా మార్చుతోంది.  నీటిని తిరిగి ఉపయోగించుకునే వ్యవస్థను రూపొందించింది, దీనివలన త్రాగునీరు అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తోంది.

ఆమె ఆవిష్కరణల ప్రభావం వ్యక్తిగత గృహాలకు మించి ఉంటుంది మరియు ప్రతిరోజూ వేల లీటర్ల మంచినీటిని ఆదా చేసి, నగరం యొక్క మురుగునీటి శుద్ధి కోసం కార్యాచరణ మరియు మౌలిక సదుపాయాల ఖర్చులను తగ్గించేలా చేస్తోంది.

  • 13 నుండి 16 సంవత్సరాల విభాగంలో- గౌరవ స్థానం సాధించిన కర్నవ్ రస్తోగి

కర్నావ్ ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం మరియు వాతావరణ మార్పులను ఎదుర్కోవడంపై అవగాహన పెంచడానికి మరియు చర్య తీసుకోవడానికి కట్టుబడి ఉంది. ప్లాస్టిక్ కాలుష్యం మరియు వాతావరణ మార్పుల ప్రభావం గురించి యువతకు అవగాహన కల్పించేందుకు, “కార్తీక్, డాడీ & ప్లాస్టిక్: ప్లాస్టిక్ ఏ జర్నీ ఎబౌట్ బీటింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్” మరియు “కార్తీక్, మిక్సీ & మాన్స్టర్: ఏ జర్నీ ఎబౌట్ ఓషన్ పొల్యూషన్” అనే రెండు పుస్తకాలను రచించాడు. ఇప్పటివరకు అతని పుస్తకాలు 5000 ప్రతులు పంపిణీ చేశాడు. తన రచనలతో ఎందరికో స్పూర్తి నింపి పర్యావరణం పై మార్పు తీసుకుని వచ్చాడు.

 

pdpCourseImg

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

భారతదేశం తరపున ఎంతమందికి అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డు లభించింది?

ఈ సంవత్సరం భారతదేశంకి చెందిన 5 చిన్నారులకు అంతర్జాతీయ యంగ్ ఎకో-హీరో అవార్డు లభించింది. మొత్తం 17 మందికి గాను 5 విధ్యార్ధిని/ విధ్యార్ధులు భారతదేశం వారు కావడం విశేషం. దీనితో పాటు భారత్ మూలాలు ఉన్న అమెరికాకు చెందిన 4 విధ్యార్ధిని విధ్యార్ధులు కూడా ఈ అవార్డు ని సొంతం చేసుకున్నారు. పర్యావరణాన్ని కాపాడటానికి వారు తీసుకున్న చర్యలకు గాను గుర్తింపుగా ఈ అవార్డు పనిచేస్తుంది.