Telugu govt jobs   »   Article   »   Indian Society Important MCQs

Indian Society Important MCQs For APPSC Group 1 and Group 2 | భారతీయ సమాజం ముఖ్యమైన MCQలు APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోసం

ఈ కథనం APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు సహాయం చేస్తుంది. మీరు APPSC గ్రూప్ 2 మరియు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే, ఇండియన్ సొసైటీ నుండి ప్రశ్నలు ఉండవచ్చని మీకు తెలుసు. ఇండియన్ సొసైటీ కొంచెం సవాలుగా ఉండే అంశం మరియు స్కోరింగ్ సబ్జెక్టు కూడా, ఇంకా 23 రోజులు మాత్రమే ఉంది గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షా కి చాలా మంది అభ్యర్థులు రివిజన్ చేయడం ప్రారంభించి ఉంటారు. తక్కువ రోజులే ఉన్నందున మేము మీకోసం ఇండియన్ సొసైటీ లో ముఖ్యమైన MCQ లను అందిస్తున్నాము. ఈ ఆర్టికల్‌లో, మేము ఇండియన్ సొసైటీకి అవసరమైన అంశాల నుండి పరీక్ష కు అవసరమైన ముఖ్యమైన ప్రశ్నలను జవాబులతో చదవండి, ఇది మీ రివిజన్ కు ఉపయోగపడుతుంది.

APPSC గ్రూప్ 2 మరియు గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ను క్లియర్ చేయడానికి అంకితభావం మరియు వ్యూహాత్మక ప్రణాళిక అవసరం. ఇండియన్ సొసైటీ MQCలు మరియు సమర్థవంతమైన పునర్విమర్శ పద్ధతులపై గట్టి పట్టుతో, మీరు మీ APPSC గ్రూప్ 2 మరియు గ్రూప్ 1లలో అర్హత సాధించవచ్చు.

Indian Society Important MCQs For APPSC Group 1 and Group 2

APPSC గ్రూప్1 మరియు గ్రూప్ 2 వంటి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఇండియన్ సొసైటీ చాలా కీలకం. ఈ పరీక్షలకు మితమైన కష్టతరమైన స్థాయిలో సన్నద్ధం కావడానికి మీకు సహాయపడే సమాధానాలతో కూడిన ముఖ్యమైన బహుళ-ఎంపిక ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి:

ప్ర1. సోషియాలజి అనే పదంను ఉపయోగించిన సామాజిక శాస్త్ర పితామహుడు ఎవరు?

a) ఆగస్ట్ కామ్టే

b) G.S ఘర్యే

c) రిస్లే

d) గుహ

జవాబు: ఆగస్ట్ కామ్టే

ప్ర 2. రిస్లేకు సంబంధించి సరైన అంశాలు గుర్తించండి?

a) ఇతను రాసిన గ్రంథం– ద పీపుల్స్ ఆఫ్ ఇండియా

b) ఇతను జనాభాను ఏడు జాతులుగా వర్గీకరించాడు.

c)  a మరియు  b రెండు

d) a మరియు  b రెండు కాదు

జవాబు: a మరియు  b రెండు

ప్ర 3. భారత సమాజశాస్త్ర పితామహుడు ఎవరు?

a) ఆగస్ట్ కామ్టే

b) M.N శ్రీనివాస్

c) GS ఘర్యే

d) రిస్లే

జవాబు: GS ఘర్యే

ప్ర 4. డైనారిక్ లు ఎక్కువగా ఎక్కడ ఉన్నారు?

a) గుజరాత్, బెంగాల్

b) కూర్గు, ఒడిషా

c) ఒడిషా, బెంగాల్

d) ఉత్తరప్రదేశ్, పంజాబ్

జవాబు: కూర్గు, ఒడిషా

ప్ర 5. భారతసమాజ లక్షణాలను గుర్తించండి?

a) మతపరమైన వైవిధ్యం

b) భాషాపరమైన వైవిధ్యం

c) భిన్నత్వంలో ఏకత్వం

d)పైవన్నీ

జవాబు: పైవన్నీ

ప్ర 6. సంతాల్, ముండా, హో గిరిజన తెగలు ఏ భాషా కుటుంబం క్రిందకు వస్తారు.

a) ఆస్ట్రిక్ భాషా కుటుంబం

b)సైనో టిబెటన్ భాషా కుటుంబం

c) ద్రవిడియన్ భాషా కుటుంబం

d) ఇండో ఆర్యన్ భాషా కుటుంబం

జవాబు: ఆస్ట్రిక్ భాషా కుటుంబం

ప్ర 7.  దేశంలోని మొత్తం సాంప్రదాయ భాషల సంఖ్య ఎంత?

a) 14

b) 22

c) 6

d) 8

జవాబు: 6

ప్ర 8. మెడిటరేనియన్లు మాట్లాడే భాష ఏది?

a) ద్రవిడియన్ భాష

b) ఆర్యభాష

c) పై రెండు

d) ఏది కాదు

జవాబు: ద్రవిడియన్ భాష

ప్ర 9. సంస్కృతి గురించిన కింది స్టేట్మెంట్లలో సరైనవి ?

a) ప్రతి సంస్కృతి సమగ్రమైనది.

b) సంస్కృతి సంక్లిష్టం, అతిచిన్న యూనిట్

c) సంస్కృతిని నిర్ణీత సమూహ సభ్యులు ఉమ్మడిగా పంచుకుంటారు.

d) ప్రజల శారీరక, జైవిక లక్షణాలను సంస్కృతి  నిర్ధారిస్తుంది.

సరైన సమాధానం ఎంపిక చేయండి.

  1. a,b,c
  2. b,c,d
  3. a,c
  4. b,d

జవాబు: a,c

ప్ర 10. సమాజానికి సంబంధించిన లక్షణాలేవి?

a) ప్రదేశం

b) రాజ్యం

c) వ్యక్తులు

d) అంతర సంబంధాల వ్యవస్థ

e) ఉమ్మడి సంస్కృతి

సరైన సమాధానం ఎంపిక చేయండి.

  1. a,b,c
  2. c,d,a
  3. b,c,d
  4. a,d,e

జవాబు: a,d,e

ప్ర 11. భారతీయ సమాజం యొక్క సామాజిక నిర్మాణాన్ని రూపొందించడంలో ఏ అంశం కీలక పాత్ర పోషిస్తుంది?

a) ఆర్థిక స్థితి
b) రాజకీయ అనుబంధాలు
c) విద్యా అర్హతలు
d) కుల వ్యవస్థ

జవాబు: D. కుల వ్యవస్థ

ప్ర 12. భారతీయ సమాజంలో వైవిధ్యం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

a). ఇది సాంస్కృతిక గొప్పతనాన్ని మరియు వారసత్వాన్ని పెంపొందిస్తుంది.
b). ఇది సామాజిక సంఘర్షణలకు దారితీస్తుంది.
c). ఇది ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది.
d). ఇది మతపరమైన సజాతీయతను ప్రోత్సహిస్తుంది.

జవాబు: A. ఇది సాంస్కృతిక గొప్పతనాన్ని మరియు వారసత్వాన్ని పెంపొందిస్తుంది.

ప్ర 13. కింది జాబితాలను సరిగా జత చేయండి. జాబితాల కింద ఇచ్చిన సంకేతాలను ఉపయోగించి, సరయిన సమాధానం ఎంపిక చేయండి?

జాబితా-1                                                                   జాబితా-2

(అధ్యయనం చేసిన గ్రామం పేరు)                    (శాస్త్రవేత్త పేరు)

a) కుంబపెట్టయ్                                                    1) A.M. షా

b) రాధ్వనాజ్                                                         2) కాథేన్ గౌస్

c) మహువా                                                             3) I.P. దేశాయ్

d) బిసిపర                                                               4) ఎఫ్. జి. బెయిలీ

జవాబు:

  • కుంబపెట్టయ్ –  కాథేన్ గౌస్
  • రాధ్వనాజ్ – A.M. షా
  • మహువా   – I.P. దేశాయ్
  • బిసిపర  – ఎఫ్. జి. బెయిలీ

ప్ర 14. హెర్బర్ట్ రిస్లే భారత దేశ జనాభాను ఏడు స్థూల జాతి సమూహాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణలో ఆయన ఉపయోగించని పదం ఏది?

a) నీగ్రిటో

b) మంగోలాయిడ్

c) సైథో – ద్రావిడియన్

d) ఇండో – ఆర్యన్

జవాబు: A. నీగ్రిటో

ప్ర 15. గ్రామీణ కుటుంబ నిర్మాణంలో ‘పంచాయతీ రాజ్’ సంస్థ ఎలాంటి పాత్ర పోషిస్తుంది?

a). ఇది గ్రామీణ కుటుంబ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపదు.
b). ఇది పితృస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
c). ఇది కుటుంబంలో మహిళలకు సాధికారత కల్పిస్తుంది.
d). ఇది సమాజ భాగస్వామ్యాన్ని నిరుత్సాహపరుస్తుంది

జవాబు: c. ఇది కుటుంబంలో మహిళలకు సాధికారత కల్పిస్తుంది.

Indian Society Ebook for APPSC GROUP’s Exams by Adda24

మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!